intinti gruhalakshmi 8 april 2022 full episode
Intinti Gruhalakshmi 8 April Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 ఏప్రిల్ 2022, శుక్రవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మామయ్య ఆపరేషన్ కోసమే నేను అప్పు తీసుకున్నా అని భాగ్యతో అంటుంది తులసి. దీంతో నిన్ను ఎవరు తీసుకొమ్మన్నారు. మామయ్య గారి విషయాన్ని చూసుకోవడానికి కొడుకులు ఉన్నారు కదా. నీకెందుకు అంటుంది భాగ్య. అప్పు తీర్చడానికి ఈ ఇల్లు అమ్మడానికి తప్ప వేరే మార్గం లేదు భాగ్య. దయచేసి అడ్డు పడకు అంటుంది తులసి. కానీ.. వాటా విషయంలో నేను రాజీపడను అంటుంది భాగ్య.
intinti gruhalakshmi 8 april 2022 full episode
దీంతో లాస్య మాట విని నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటుంది తులసి. నాది విశాల హృదయం కాదు. మనం కోర్టులోనే తేల్చుకుందాం అంటుంది భాగ్య. దీంతో నువ్వు కోర్టుకు వెళ్లినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఇది మామయ్య గారి కష్టార్జితం అంటుంది తులసి. నువ్వు కోర్టుకు వెళ్లకుండా ఉంటే.. ఇల్లు అమ్మగా మిగిలిన 20 లక్షలు నీకు ఇస్తా అంటుంది తులసి. లాస్య మాటలు విని నువ్వు అనవసరంగా కోర్టుకు వెళ్తున్నావు. కేసు ఓడిపోతే నీకు నష్టం తప్పితే రుపాయి కూడా లాభం ఉండదు. లాస్య మాటలు విని నష్టపోతావా.. లేక నా మాటలు విని లాభపడతావా నువ్వే ఆలోచించుకో అంటుంది తులసి.
కట్ చేస్తే పని చేయడానికి వేరే ఇంటికి వెళ్లడం ఆలస్యం అవుతుంది రాములమ్మకు. దీంతో ఆ ఇంటి పని ఆవిడ తిడుతుంది. నేను కొత్త పనిమనిషిని పెట్టుకున్నా. నువ్వు ఇక రావాల్సిన అవసరం లేదు అంటుంది. ఆ పని మనిషి ఎవరో కాదు శృతి.
తనను చూసి షాక్ అవుతుంది. ఇది నువ్వు పని చేసే ఇల్లు అని తెలియదు రాములమ్మ. నువ్వే పని చేసుకో అంటుంది శృతి. ఏంటమ్మా ఇదంతా. మీరు పనిమనిషిగా మారడం ఏంటి అంటుంది. తప్పు అనిపించలేదా అంటుంది. దీంతో నాకు వేరే దారి దొరకలేదు అంటుంది.
మరోవైపు భాగ్య.. తులసి ఆఫర్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో లాస్య తనకు ఫోన్ చేస్తుంది. చెప్పు లాస్య అంటుంది. తులసి వచ్చిందా.. నీతో మాట్లాడిందా అంటుంది. మాయమాటలు చెప్పి నీ మనసు మార్చడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు అస్సలు వినకు అంటుంది లాస్య.
ఇల్లు అమ్మిన వెంటనే 20 లక్షలు నాకు ఇస్తా అంది అని లాస్యకు చెబుతుంది భాగ్య. కానీ.. లాస్య వద్దు తనను నమ్మకు అంటుంది. పరందామయ్యతో తులసి కూడా అదే విషయం చెబుతుంది. భాగ్య.. లాస్య మాట వినదు.. నామాటే వింటుంది అంటుంది.
మరోవైపు చెప్పు భాగ్య.. తులసి మాయలో పడిపోయావా అంటుంది లాస్య. దీంతో లేదు లాస్య.. నేను నువ్వు చెప్పినట్టే చేస్తాను.. అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది కానీ.. తనకు ఎవరివైపు వెళ్లాలో అర్థం కాదు. ఏం చేయాలో అర్థం కాదు.
కట్ చేస్తే శశికళ వస్తుంది. ఏం ఆలోచించావు అని తులసిని అడుగుతుంది. తులసి నా సహనాన్ని పరీక్షించకు. ఏ నిర్ణయం తీసుకున్నావు చెప్పు అంటే.. సమాధానం చెప్పు భాగ్య అంటుంది తులసి. భాగ్య సమాధానం ప్రకారం.. శశికళకు సమాధానం చెప్పాలనుకుంటుంది.
దీంతో ఎవ్వరికీ ఇష్టం లేని నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తోంది అని చెప్పి తులసి ఆ ఇంటిని శశికళకు అప్పగించేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
This website uses cookies.