Intinti Gruhalakshmi 8 Feb Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 ఫిబ్రవరి 2022, మంగళవారం ఎపిసోడ్ 550 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అంకిత పూర్తిగా లాస్య మాయలో పడిపోయింది అని శృతి.. తులసితో చెప్పడంతో తులసి ఇంకా భయపడుతుంది. మరోవైపు అంకితను డ్రాప్ చేసేందుకు కారులో తీసుకెళ్తుంది లాస్య. కారులో వెళ్తూ.. అంకితను తనవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆఫీసు పని, ఇంట్లో పనిని వేర్వేరుగా చూడాలి. ఎక్కడి తలనొప్పి అక్కడే వదిలేయాలి అంటుంది లాస్య. కోట్ల ఆస్తిని ప్రేమ కోసం వదులుకొని వచ్చావు అంటుంది లాస్య. కానీ.. ఇక్కడ నీకు ఆ ప్రేమ దొరికిందా లేదు కదా అంటుంది లాస్య. అవును ఆంటి.. నాకు అక్కడ దొరకని ప్రేమ ఇక్కడ దొరుకుతుందని అనుకున్నా. కానీ.. ఇక్కడ కూడా దొరకలేదు అంటుంది.
అందుకే.. నీ మూడ్ రిలాక్స్ కావడం కోసం ఈరోజు ఈవెనింగ్ మనం డిన్నర్ కు వెళ్దాం అని చెబుతుంది. వద్దులెండి ఆంటి అంటుంది. కానీ.. కారు దిగి వెళ్లేటప్పుడు మాత్రం నేను డిన్నర్ కు వస్తా ఆంటి అని చెబుతుంది. కట్ చేస్తే రాత్రి అవుతుంది. ఇంకా అంకిత ఇంటికి రాదు. దీంతో ఇంట్లో వాళ్లంతా అన్నం తినకుండా.. నిద్రపోకుండా అంకిత కోసమే ఎదురుచూస్తూ ఉంటారు. అంకిత కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయదు. లాస్య కూడా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు.. ఏమైంది అని అందరూ టెన్షన్ పడుతుంటారు. ఇంతలో లాస్య, అంకిత.. ఇద్దరూ కలిసి ఇంటికి తిరిగి వస్తాంరు. చాలా సంతోషంగా.. నవ్వుతూ ఉంటారు. ఇంట్లోకి రాగానే అందర ఒకచోట కూర్చొని టెన్షన్ పడుతూ ఉండటం చూసి షాక్ అవుతారు.
ఇంతలో అభి లేచి అంకిత వైపు సీరియస్ గా చూస్తాడు. ఇంతలో లాస్య.. ఏమైంది మీకు అందరూ ఏదో సంతాప సభకు వచ్చినట్టు అలా ఉన్నారు అంటుంది. లాస్య నువ్వు నవ్వకు. లేట్ అవుతుంది అనుకుంటే మీరు ఒక్క మాట అయినా ఇంట్లో చెప్పాలి కదా. అసలు ఎక్కడికి వెళ్లారు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. నువ్వేమో ఫోన్ లిఫ్ట్ చేయవు.. ఏంటి అంటాడు నందు.
అందరూ నన్ను దోషిలా చూస్తున్నారేంటి.. అంకిత మూడ్ బాగోలేదంటే డిన్నర్ కు తీసుకెళ్లాను. ఇందులో నా తప్పు ఏముంది అంటుంది లాస్య. మీరు ఎక్కడికైనా వెళ్లండి. ఎవ్వరికీ అభ్యంతరం లేదు. మీ వల్ల ఇంట్లో వాళ్లు ఎవ్వరూ అన్నం తినకుండా వెయిట్ చేస్తున్నారు.. అంటుంది తులసి.
నేను అన్నం తినకుండా ఉండండి అని మిమ్మల్ని నేను అన్నానా. తిండి ఒక్కటేనా.. ఇంకేం లేదా. ఇంట్లో తులసి ఆంటితో సహా అందరూ ఎక్కడికైనా వెళ్లొచ్చు.. కానీ ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ నాకేనా అంటుంది అంకిత. దీంతో వదిన.. ఇక్కడ ప్రాబ్లమ్ లేట్ గా రావడం కాదు. లేట్ గా వస్తామని చెప్పనందుకు అంటాడు ప్రేమ్.
మొత్తం మీద అంకిత, లాస్య.. ఇద్దరూ చిరాకు పడుతూ ఇంట్లోకి వెళ్లిపోతారు. అంకితకు ఏం చేయాలో అర్థం కాదు. అంకిత మనసులో కొలిమిలో మండుతున్న ఇనుములా ఉంది. ఇదే కరెక్ట్ టైమ్. తనను నావైపు తిప్పుకోవడానికి ఇదే కరెక్ట్ సమయం అనుకొని తన దగ్గరికి వెళ్తుంది.
సారీ అంకిత. నా వల్లే నీకు ఇవన్నీ అంటుంది లాస్య. పర్లేదు ఆంటి.. అంటుంది. ఇంట్లో వాళ్లు అంతా ఇలా తయారయ్యారు అంటుంది అంకిత. ఇంట్లో వాళ్లు కాదు అంకిత.. కేవలం తులసినే నిన్ను టార్గెట్ చేసుకుంది. ఈ ఇంట్లో అందరూ తులసి చేతుల్లో కీలుబొమ్మలు అంటుంది లాస్య.
నువ్వు వెళ్లింది నాతో కాబట్టి మనిద్దరిని ఎలా విడదీయాలా అని తులసి తెగ ఆరాటపడుతుంది.. అంటూ తులసి మీద నాలుగు మాటలు ఎక్కువ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది లాస్య. మరోవైపు నందు.. తులసితో మాట్లాడుతాడు. ఈ ఇల్లు నావల్ల ఇప్పటికే ముక్కలు అయింది.. అంటాడు నందు.
ఇంకా ముక్కలు కావడం నేను చూడలేను. అంకితను లాస్య కీలుబొమ్మను చేసింది అంటాడు నందు. ఈ కుటుంబాన్ని ఒక దారిలో పెట్టడం కేవలం నీవల్లే అవుతుంది తులసి. అంకితను మరో లాస్యను కానివ్వకు. అదే జరిగితే అంతకుమించిన దౌర్భాగ్యం ఉండదు అంటాడు నందు.
వావ్.. నీ తెగింపు చూస్తుంటే ముచ్చటేస్తుంది నందు అంటూ అప్పుడే అక్కడికి వస్తుంది లాస్య. అవకాశం దొరికితే చాలు.. మాజీ భార్యతో ముచ్చట్లు చెప్పడమే వదలవు కదా అంటుంది. లాస్య ఇక్కడికి వచ్చి సీన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించకు అంటాడు నందు.
మరోవైపు తులసి కూడా లాస్యతో అంకిత గురించి మాట్లాడుతుంది. అంకిత నీకు కోడలు మాత్రమే కావచ్చు లాస్య.. కానీ నా కూతురు. నన్ను, అంకితను విడదీసేందుకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ వృథాయే అంటుంది తులసి. చేతనైతే అంకితకు దగ్గరవడానికి ప్రయత్నించు కానీ మమ్మల్ని దూరం చేయడానికి కాదు అంటుంది తులసి.
ఈ కుటుంబంలోని వాళ్లను నాకు వ్యతిరేకంగా మార్చాలని చూస్తే అది నీకే సమస్యగా మారుతుంది. టైమ్ వేస్ట్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది తులసి. ఆ తర్వాత నందు కూడా తనకు అదే విషయం చెబుతాడు. ఇప్పటికైనా నువ్వు ఈ కుటుంబం జోలికి రాకూడదు అని చెబుతాడు నందు.
లాస్యే కావాలని అంకితను మార్చేస్తుందని శృతి, ప్రేమ్ మాట్లాడుకుంటారు. లాస్య నుంచి వదినను ఎలా దూరం చేయాలి అని అంటాడు ప్రేమ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం అంటుంది శృతి. మరోవైపు అభిని జీతం అడుగుతుంది తులసి. ఇంతలో లాస్య కలగజేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.