Home » Entertainment » Intinti Gruhalakshmi 8 October 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 8 Oct Today Episode : అనసూయను బుట్టలో వేసుకున్న లాస్య.. తులసిని వదిలేసి నందు ఇంటికి వెళ్తుందా? తులసికి ఈ విషయం తెలిసి ఏం చేస్తుంది?

Authored By
Varun G
The Telugu News | Updated on: October 8, 2022 9:02 am
Advertisement

Intinti Gruhalakshmi 8 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 అక్టోబర్ 2022, శనివారం ఎపిసోడ్ 758 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు నిజంగా ఫైల్స్ కోసమే వచ్చారా అని అడుగుతుంది తులసి. దీంతో ఎందుకు అలా అడుగుతున్నారు అని అడుగుతాడు సామ్రాట్. ఎందుకు అంటే.. ఈ ఫైల్స్ అంతగా ముఖ్యమైనవి ఏం కాదు. కావాలంటే ఈ ఫైల్స్ కోసం ఎవరినైనా పంపించి ఉండొచ్చు కానీ.. మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. నిజం చెప్పండి. మీరు నాకోసం వచ్చారు కదా అంటుంది తులసి. నేను బోరున ఏడుస్తుంటే వచ్చి ఓదార్చుదామని అనుకున్నారా? అని అడుగుతుంది. దీంతో మీకు సారీ చెబుదామనే అనుకొని వచ్చా కానీ.. మీ అత్తయ్య నా నోరు కట్టేసింది అని మనసులో అనుకుంటాడు సామ్రాట్. తనకు ఏం చెప్పాలో అర్థం కాదు. మీరు నన్ను జనరల్ మేనేజర్ పదవి నుంచి తీసేసి మంచి పని చేశారు.

Advertisement

intinti gruhalakshmi 8 october 2022 full episode

ఎందుకంటే.. కేవలం మన ఫ్రెండ్ షిప్ వల్ల మీరు నన్ను అందలం ఎక్కించి మీ కంపెనీ కోట్లలో నష్టపోయేలా చేయలేరు కదా. మన మధ్య ఉన్న ఆఫీసు బంధం తెగిపోయింది కానీ.. మన మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ మాత్రం అలాగే ఉంటుంది అని అంటుంది తులసి. రేపు మా కాలనీలో అందరం కలిసి దసరా పండుగను వేడుకగా జరుపుకుంటున్నాం. హనీని తీసుకొని మీరు కూడా రండి అంటుంది తులసి. దీంతో మీ కాలనీ ఫంక్షన్ కు మేమెందుకు అని అంటాడు. దీంతో అలాంటిదేం లేదు.. అతిథులుగా మీరూ రావచ్చు అని అంటుంది తులసి. దీంతో నాకు అర్జెంట్ గా ఆఫీసు పని ఉంది. రావడం కుదరదు అంటాడు. దీంతో హనీని అయినా పంపించండి. లేకపోతే నేనే వచ్చి హనీని తీసుకొని వస్తా అంటుంది తులసి. దీంతో సరే.. హనీని పంపుతా అంటాడు సామ్రాట్.

Advertisement

కట్ చేస్తే తులసిని అంతగా అవమానిస్తుంటే ఆ పెద్దావిడ ఎందుకు సైలెంట్ గా ఉంది అని అనసూయ గురించే ఆలోచిస్తూ ఉంటుంది లాస్య. వెంటనే నందుతో ఆవిడకు కాల్ చేయించి గ్రిప్ లో పెట్టుకుంటా అని అనుకుంటుంది లాస్య. అయినా ఆ పిచ్చిమాలోకం నా మాట వెంటాడా? అని అనుకుంటుంది లాస్య.

నేనే రంగంలోకి దిగుతా. పెద్దావిడను ముగ్గులోకి దింపుతా అని అనుకుంటుంది లాస్య. వెంటనే అనసూయకు కాల్ చేస్తుంది. అనసూయ కాల్ చూసి కట్ చేస్తుంది. అయినా మళ్లీ చేస్తుంది. దీంతో ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అని అడుగుతుంది. అవునన్నా కాదన్నా మీరే మా ఇంటి ఇలవేల్పు అత్తయ్య అంటుంది లాస్య.

Advertisement

Intinti Gruhalakshmi 8 Oct Today Episode : రెడీ అవడానికి చాలా సమయం తీసుకున్న హనీ

ఎప్పటి నుంచి అలా అనిపిస్తోంది అని అంటుంది అనసూయ. సామ్రాట్ గారి ఆఫీసులో నందుకు జనరల్ మేనేజర్ స్థానం లభించింది అంటే దానికి కారణం మా అమ్మ ఆశీస్సులే అని నందు ఇప్పటిదాకా అన్నాడు. ఈ పండుగకు మీ పేరు మీద నందు పూజ చేయించాలనుకుంటున్నాడు. కాదనకండి అంటుంది లాస్య.

లాస్య ఇంత కమ్మగా మాట్లాడుతోంది ఏంటి అని అనుకుంటుంది అనసూయ. మీరు ఒక్కసారి ఊ అనండి.. మేమే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని తీసుకొస్తాం అంటుంది లాస్య. నందుకు కావాల్సింది మీ దీవెనలు అత్తయ్య అంటుంది లాస్య. దీంతో మీరు రండి అంటుంది లాస్య.

దీంతో నాకు రావడం కుదరదు కానీ.. మేము రేపు ఉదయం గుడికి వెళ్తున్నాం. మీరు కూడా అక్కడికి రండి. అక్కడే చేయిద్దాం అంటుంది అనసూయ. దీంతో సరే అని ఫోన్ పెట్టేసి వెంటనే నందుకు ఈ విషయం చెబుతుంది. దీంతో నిజంగానా అంటాడు నందు.

మరోవైపు బతకమ్మ పండుగ కోసం రెడీ అవుతుంటారు తులసి ఫ్యామిలీ మెంబర్స్. ఇంతలో ప్రేమ్, అభి పూలు తీసుకొస్తారు. మాకు బతుకమ్మ పేర్చడం ఎలా తెలియదు కదా.. మాకు ఆంటి నేర్పిస్తుంది అని అంటుంది శృతి. దీంతో బతుకమ్మను పేర్చి.. దాని విశిష్టతను అంకిత, శృతికి చెబుతుంది తులసి.

Advertisement

బతుకమ్మను ఎలా పేర్చాలో వాళ్లకు చూపిస్తుంది తులసి. మరోవైపు హనీ రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో బాబాయిని పిలిచి నాకు జడ వేయి అంటుంది హనీ. దీంతో నాకు జడ వేయడం రాదు అంటాడు బాబాయి. దీంతో అమ్మాయిలు తయారు కావాలంటే ఎంత సమయం పడుతుందో చెబుతుంది హనీ.

బయట.. హనీ కోసం వెయిట్ చేస్తుంటాడు సామ్రాట్. ఇంతలో బాబాయి వచ్చి ఇంకా రెడీ అవుతోంది హనీ అని చెబుతాడు. దీంతో ఇంత సేపు ఏంటి అని అంటాడు. మరోవైపు గుడికి నందు, లాస్య, లక్కీ వస్తారు. వాళ్లను చూసి చేయి ఊపుతుంది అనసూయ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి