is ntr going to act as a politician...?
NTR : యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పొల్టికల్ ఎంట్రీ గురించి ఎప్పటి నుంచో రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నట వారసుడిగా..మనవడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో విపరీతమైన క్రేజ్ ఉన్న ఎన్.టి.ఆర్ రాజకీయ నాయకుడిగా మారితే చూడాలని..ఎందరో ఎదురు చూస్తున్నారు. ఆ కోరిక త్వరలోనే తీరబోతోందట. తీర్చబోయేది మరెవరో కాదు కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్. చిన్న కన్‌ఫ్యూజన్ ఉంది కదా..కొంచెం డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం.
ప్రశాంత్ నీల్ – ఎన్.టి.ఆర్ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయం అటు తారక్, ఇటు ప్రశాంత్ నీల్ కన్‌ఫర్మ్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తారక్ ని పవర్ ఫుల్ పొలిటీషియన్ గా ప్రశాంత్ నీల్ చూపించబోతున్నట్టు సమాచారం. ఇంతక ముందు ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ జవాన్ గా చూపిస్తాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఎన్టీఆర్ పొలిటీషియన్ గా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు.
is ntr going to act as a politician…?
పొలిటికల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించేందుకు ప్రశాంత్ నీల్ ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేశారని సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం తారక్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చేస్తున్నాడు. ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో సలార్ అనే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ – తారక్‌ల పొల్టికల్ డ్రామా పట్టాలెక్కనుంది.
AI Edge Gallery | ప్రపంచంలోనే అత్యున్నత టెక్ దిగ్గజాల్లో ఒకటైన గూగుల్ (Google), మరోసారి టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇంటర్నెట్…
Kalisundam Raa | విక్టరీ వెంకటేశ్ కెరీర్‌లో ఓ మైలురాయి మూవీగా నిలిచింది ‘కలిసుందాం రా’. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో…
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
This website uses cookies.