Home » Entertainment » Is Priyaka Chopra Doesnot Have The Range As Deepika Padukone
Entertainment

దీపిక పదుకొణె రేంజ్ ప్రియాంక చోప్రా కి లేదా ..?

Authored By
vamana sai
The Telugu News | Updated on: December 11, 2020, 7:19 pm
Advertisement

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పౌరానికి చిత్రాలను నిర్మించే స్థాయి నుంచి పాన్ ఇండియా సినిమాలు నిర్మించే స్టేజ్‌కి తెలుగు, దర్శక నిర్మాతలు ఎదిగారు. టాలీవుడ్ స్టార్ హీరోల, దర్శకుల క్రేజ్ ఖండాంతరాలు దాటుతుంటంతో…అందరి చూపు ఇప్పుడు తెలుగు పరిశ్రమపై పడింది. అంతేకాదు ఇప్పుడు బాలీవుడ్ సహా అన్ని చిత్ర పరిశ్రమలలోని నిర్మాతలు మన తెలుగు సినిమాల మీదే ఆధారపడుతున్నారని చెప్పాలి. బాహుబలి సినిమా నుంచి ఈ స్ట్రాటజీ మొదలైంది.

Advertisement

దీంతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లు సైతం తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటికే పూజా హెగ్దే , కైరా అద్వానీ, కృతిసనన్ పలు తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకుల ఆధరణను పొందుతున్నారు. గతంలో కూడా టబు, ఐశ్వర్య, సుశ్మితా సేన్ వంటి బాలీవుడ్ బ్యూటీలు తెలుగు సినిమాల్లో నటించి అలరించారు. లేటెస్ట్‌గా సాహో వంటి పాన్ ఇండియా సినిమాలో ప్రభాస్ కు జోడీగా శ్రద్ద కపూర్ నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలోనే జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ కూడా ప్రత్యేక గీతంతో అలరించింది. ప్రస్తుతం రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ ఆర్ ఆర్‌ లోనూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తోంది.

Advertisement

ఇక ప్రభాస్ నటించే ఆదిపురుష్‌లో దీపికా పదుకొణె లీడ్‌ రోల్ ప్లే చేస్తోంది. ఇలా బాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ నుంచి స్టార్ హీరోయిల్ వరకు తెలుగు ఇండస్ట్రీలో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటే…మాజీ ప్రపంచ సుందరి అయిన ప్రియాంక చోప్రా మాత్రం ఇటువైపే చూడటం లేదు. దీపికా పదుకొణె లాంటి స్టార్ హీరోయిన్‌లు సైతం తెలుగు తెరకు పరిచయం అవుతుంటే..అమ్మడు ఎందుకు ఇటువైపు చూడటం లేదన్న వార్తులు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్ మారుతున్నాయి. చెప్పాలంటే దీపికా, ప్రియాంకా ఇండియన్ స్టార్‌లే కాదు…ఇంటర్నేషన్ స్టార్ కూడా. ఇద్దరూ హాలీవుడ్ సెలబ్రిటీ స్టార్ హీరోలతో నటించి మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు.

Advertisement

మన ఇండియన్ హీరోయిన్ ల రేంజ్ ను పెంచారు. ఇద్దరిదీ ఇంచుమించు ఒకే రేంజ్ క్రేజ్ అండ్ రెమ్యూనరేష. కానీ దీపికాకు ఉన్నంత క్రేజ్ ప్రియాంకకు లేకనే…ఇండస్ట్రీ వర్గాలు తనను తెలుగు తెరకు పరిచయం చేయడం లేదన్న మాటలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నారు. మరో వైపు మన తెలుగు కథలు నచ్చకే దరంగా ఉంటుందంటూ..కొంత మంది చెప్పుకుంటున్నారట. ఏదేవైనా తెలుగు ఇండస్ట్రీ రేంజ్ పెరిగింది. అందుకే బాలీవుడ్ తారలు వరుసపెట్టి సినిమాలు చేసేందుకు ఇటువైపుగా క్యూలు కడుతున్నారు.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి