Rashmika mandanna : రష్మిక మందన్న ..కన్నడలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా కిరాక్ పార్టీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో టాలీవుడ్లో నటించే అవకాశం అందుకుంది. యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల, యంగ్ హీరో నాగ శౌర్య కాంబినేషన్లో తెరకెక్కిన ఛలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. డెబ్యూ సినిమా సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టి రష్మిక మీద పడింది. నాని నాగార్జున నటించిన దేవదాస్, విజయ్ దేవరకొండతో గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, నితిన్‌తో భీష్మ సినిమాలు చేసింది.
గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. దాంతో ఏకంగా పాన్ ఇండియన్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న పుష్పలో హీరోయిన్ గా నటిసున్న ఈ కన్నడ బ్యూటీ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి ఏకంగా అమితాబ్ బచ్చన్ లాంటి సీనియర్ స్టార్ తో నటించే అవకాశం అందుకుంది. ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తోంది. ఇలా హిందీ తెలుగులోనే కాదు కోలీవుడ్ లో కూడా ఎంటరైంది.
కార్తి నటించిన సుల్తాన్ సినిమా ద్వారా తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టి హిట్ అందుకుంది. అయితే ఈమెకి పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో ఒక్కసారైనా డేటింగ్ కి వెళ్ళాలని ఉందంటూ ఇటీవల తన కోరికను బయట పెట్టింది. రష్మిక Rashmika mandanna లాంటి అందగత్తె తలుచుకుంటే ప్రభాస్ తో డేట్ కి వెళ్ళడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే అమ్మడి కోరిక ఆయన నటించే పాన్ ఇండియన్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకోవడమే అసలు కోరిక అని తెలుస్తోంది. చూడాలి మరి ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ తో అది ఈజీగానే సాధించవచ్చు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్‌లోని…
This website uses cookies.