Is Samantha Marrying That Guy Who Shown By Sadhguru
Samantha : మాజీ అక్కినేని కోడలు సమంత త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతుందా.. అంటే అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సోషల్ మీడియా ద్వారా తనపై వచ్చే విమర్శలన్నింటిని తిప్పి కొట్టిన సమంత ఇప్పుడు చాలా సైలెంట్ అయింది. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం లేదు. దీంతో ఆమెకు ఏం జరిగిందా అని అందరు ఆరాలు తీస్తుండగా, ఇప్పుడు ఆమె రెండో పెళ్లికి సంబంధించి వార్తలు వస్తున్నాయి. ఈ పెళ్ళిని ఫేమస్ స్పిరుచ్యూవల్ గురు సద్గురు బాబా దగ్గరుండి చేయబోతున్నారట…? ఈ వార్తల్లో నిజమెంతో కాని.. పుకారు మాత్రం గట్టిగా షికారు చేస్తోంది. సద్గురుతో సమంతకు మంచి అనుబంధం ఉంది. మొదటి నుంచి మానసికంగా ఇబ్బంది ఉంటే..? సద్గురు ప్రవచనాలు వినడం సమంతకు బాగా అలవాటు.
ఆయన చేపట్టే కార్యక్రమాలలో కూడా సమంత పాల్గొంటూ ఉంటుంది.చైతూ నుండి విడిపోయిన తర్వాత సద్గురు సలహాలు పాటిస్తూ డిప్రెషన్ నుండి బయటకు వచ్చింది.ఇక ఇప్పుడు ఆయన సూచించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కేందుకు కూడా సిద్ధమైనట్టు టాక్. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది చూడాలి.ఇక సమంత ఏమాయ చేశావే మూవీ షూటింగ్ సమయంలో చైతూతో ప్రేమలో పడగా, 2017లో అతడిని పెళ్లి చేసుకుంది. గత ఏడాది అక్టోబర్ 2న విడాకులు ఇచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా సమంత దూసుకుపోతోంది. కెరీర్ పీక్స్ లో ఉండగానే అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడిన ఈ బ్యూటీ.. నాలుగేళ్ళ పాటు కాపురం చేసి ఆ బంధాన్ని బ్రేక్ చేసుకుంది. దీంతో అప్పటినుంచి సమంత పలు ఇష్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Is Samantha Marrying That Guy Who Shown By Sadhguru
ఇటీవలే సమంత తండ్రి జోసెఫ్ ప్రభు.. నాగ చైతన్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో మరో ఇష్యూ తెరపైకి వచ్చింది. చాలా కాలం క్రితం ఒక కథ ఉండేది. ఆ కథ ఇకపై ఉండకపోవచ్చు. కొత్త కథను, కొత్త అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం అన్నాడు జోసెఫ్. దీంతో మళ్ళీ చై సామ్ కలుస్తారా? అనే టాక్ మొదలైంది. ఈ టాక్ నడుస్తున్న సమయంలోనే సమంత రెండో పెళ్లికి సంబంధించి వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం నాగ చైతన్య ప్రేమతో పాటు రెండో పెళ్లికి సంబంధించి కూడా వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
This website uses cookies.