మెగా డాటర్ .. మెగా బ్రదర్ నాగ బాబు గారాలపట్టి నిహారికా వివాహం ఉదయ్ పూర్ ప్యాలెస్ లో మరికొన్ని గంటల్లో జరగబోతోంది. గత రెండు రోజులుగా మెగా ఫ్యామిలీ మొత్తం ఉదయ్ పూర్ ప్యాలెస్ లో ఉన్నారు. మెహందీ ఫంక్షన్.. సంగీత్ గ్రాండ్ గా జరిగాయి. మొత్తం మెగా హీరోలంతా చేస్తున్న సందడి కి సోషల్ మీడియా షేకవుతోంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాం చరణ్ పెళ్ళి తర్వాత మళ్ళీ అత్యంత వైభవంగా.. ఘనంగా జరుగుతుంది మళ్ళీ నిహారిక వివాహమే అని చెప్పాలి. కోవిడ్ 19 గనక లేకపోయి ఉంటే ఈ సంబరాలు ఆకాశాన్ని తాకేవి.
ఇక నిహారిక వివాహానికి అత్యంత సన్నిహితులని మాత్రమే ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ రెండు రోజుల నుంచి కంప్లీట్ గా మెగా ఫ్యామిలీ తప్ప మిగతా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరూ కనిపించలేదు. అయితే హైదరాబాద్ లో ప్రత్యేకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖలందరి కోసం గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. ఇక నిహారిక వివాహానికి నిన్నా మొన్నటి వరకు టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ చాలా మంది హాజరవుతున్నారన్న టాక్ వినిపించింది.
ముఖ్యంగా మెగా హీరోలతో నటించిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కాజల్ , సమంత, శృతిహాసన్, రకుల్ ప్రీత్ సింగ్, రాశీఖన్నా, పూజా హెగ్డే, కీర్తి సురేష్ లాంటి వాళ్ళకి ఆహ్వానం వెళ్ళిందని .. వారంతా నిహారిక పెళ్ళిలో తళుక్కున మెరవనున్నారన్న వార్తలు వచ్చాయి. కాని కేవలం ఇద్దరు హీరోయిన్స్ మాత్రమే నిహారికా పెళ్ళికి వచ్చినట్టు సమాచారం. వాళ్ళలో ఒకరు లావణ్య త్రిపాఠి కాగా మరొకరు తెలుగమ్మాయి రీతూవర్మ. ఈ ఇద్దరు నిహారిక కి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కావడం వల్లే ఈ ఇద్దరు వచ్చినట్టు.. మిగతా వాళ్ళు హైదరాబాద్ లో జరిగే రిసప్షన్ కి వస్తారని అంటున్నారు.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.