
is trisha ignored by senior star heroes
Trisha : సీనియర్ స్టార్ హీరోలు కూడా త్రిష వైపు అందుకే చూడటం లేదా..? అంటే నెటిజన్స్ చాలా కారణాలే వెతుక్కుంటున్నారు. నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన త్రిష కృష్ణన్ ఆ తర్వాత వర్షం సినిమాతో ప్రభాస్ సరసన నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో ఒక్కసారిగా ఈమె సౌత్ సినిమా ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ అయింది. మొదటి సినిమా అంత పెద్ద సక్సెస్ కాకపోయినా కూడా స్టార్ హీరోయిన్ అవుతుందని మాత్రం అటు తమిళ ఇండస్ట్రీ ఇటు తెలుగు ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడ్దారు.అనుకున్నట్టుగానే త్రిష హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అతికొద్దికాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.
ఎన్.టి.ఆర్, తరుణ్, నితిన్ లాంటి యంగ్ హీరోలతో జత కడుతూనే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ లాంటి సీనియర్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంది. త్రిష కెరీర్‌లో హిట్స్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే, దాదాపు అటు తమిళంలో ఇటు తెలుగులో అందరు హీరోల సరసన నటించింది. పెద్ద దర్శకుల సినిమాలలో నటించి హిట్స్ అందుకుంది. అయితే, గత కొన్నేళ్ళుగా త్రిష సౌత్‌లో పెద్దగా కనిపించడం లేదు.మరీ ముఖ్యంగా తెలుగు తెరపై కనిపించి చాలా ఏళ్ళవుతోంది. వాస్తవంగా అయితే, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో హీరోయిన్‌గా నటించాల్సింది.
is trisha ignored by senior star heroes
దాదాపు అఫీషియల్ కన్‌ఫర్మేషన్ వచ్చే సమయంలో ప్రాజెక్ట్ నుంచి తప్పుకొని కాజల్ వచ్చి చేరింది. ఇప్పుడు నాగార్జున నటిస్తున్న ది ఘోస్ట్‌లో కూడా కాజల్ తప్పుకోవడంతో త్రిష వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ, ఆ అవకాశం సోనాల్ చౌహాన్ దక్కించుకుంది. అయితే, త్రిష ఇక్కడ అవకాశాలు అందుకోలేకపోవడానికి కారణం, చిరంజీవితో నటించిన స్టాలిన్ ఫ్లాప్‌గా మిగిలింది. అలాగే, పవన్ సరసన నటించిన తీన్‌మార్ ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లోనే చేరింది. బాలయ్యతో చేసిన కూడా ఫ్లాపే. ఇదొక కారణం అయితే, ఆల్రెడీ అందరి సీనియర్ హీరోల సరసన నటించేసింది కాబట్టి కాంబినేషన్ ఫ్రెష్‌గా ఉండదనే ఆలోచన కూడా మేకర్స్‌లో ఉందని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా త్రిష లాంటి నాజూకు అందాన్ని అభిమానులు మిస్ అవుతున్నారు.
pakistan : టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ఇంకా రెండు వారాల సమయం కూడా లేకపోయినా ఈ మెగా టోర్నీ…
Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
Union Budget 2026 : దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1న…
Key Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన రెండున్నర ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో,…
Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు…
Vizianagaram: మానవత్వ విలువలు రోజురోజుకు క్షీణిస్తున్నాయనే వాదనకు విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. కేవలం…
Samantha : సినిమా రంగంలో నటీమణులు పెళ్లి తర్వాత తమ ఇంటి పేరును మార్చుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గతంలో…
Roja : చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే…
This website uses cookies.