Home » Entertainment » Is Varshini In Love
Entertainment

Varshini : వర్షిణి ఎవరి ప్రేమలో పడింది..ఇక బుల్లితెరకు దూరమవుతుందా..?

Authored By
vamana sai
The Telugu News | Updated on: May 6, 2021 1:39 pm
Advertisement

Varshini : వర్షిణి ప్రేమలో పడిందా.. బుల్లితెరకు దూరమవుతుందా..అనే టాక్ ఇప్పుడు చాలా చోట్ల వినిపిస్తోందట. సాధారణంగా సినీ తారలు గానీ, బుల్లితెర నటీ నటులు..యాంకర్స్ గానీ ప్రేమలో పడితే ఆ లోకంలోనే కొంత కాలం గడుపుతుంటారు. ప్రేమ కోసం కెరీర్ ని కూడా కొంతకాలం పక్కన పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ లిస్ట్‌లో ఇప్పుడు హాట్ యాంకర్ వర్షిణి చేరిందట..ఇంతకీ ఆ స్టోరి ఏంటో చూద్దాం.. వర్షిణి సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటో షూట్స్ తో పాటు ట్రెడీషనల్ అండ్ ట్రెండీ ఫొటో షూట్స్‌తో హల్‌చల్ చేసింది.

Advertisement

is varshini in love

ఈ ఫొటోస్ చూసిన దర్శక, నిర్మాతలు వర్షిణికి బుల్లితెర మీద వస్తున్న పాపులర్ షోస్‌లో అవకాశం ఇచ్చారు. ఇలా బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చిన వర్షిణి అతికొద్ది కాలంలోనే క్రేజీ యాంకర్ గా పాపులారిటీని సాధించింది. యాంకర్ గా..మెంటర్ గా.. కామెడీ షోస్ లో చిన్న చిన్న పాత్రలను పోషిస్తూ ప్రేక్షకుల్లో అలాగే యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం మాటీవి లో ప్రసారమవుతున్న ఒక కార్యక్రమానికి యాంకర్‌గా చేస్తూ సందడి చేస్తోంది.

Advertisement

varshini sounderajan

Varshini : వర్షిణి హీరోయిన్ అవకాశాల కోసం కూడా ట్రై చేస్తోందని తెలుస్తోంది.

varshini sounderajan

Advertisement

అయితే ఈ మధ్య వర్షిణి ఒక ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసి వెంటనే డిలీట్ చేసింది. ఓ వ్యక్తి భుజం మీద తలవాల్చినట్టు ఉన్న ఈ ఫొటో డిలీట్ చేసే లోపే కొందరు స్క్రీన్ షాట్ తీసి వర్షిణి ప్రేమలో ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. ఇది వర్షిణి వరకు వెళ్ళిందా లేదా తెలీదు గాని ..తను మాత్రం ఇంకా దీని మీద స్పందించలేదు. ఇక 2017లో వర్షిణికి ఓ డైరెక్టర్‌తో నిశ్చితార్థమైన అప్పట్లో వార్తలు వచ్చాయి. అతనే ఇతనా లేక మరెవరైనానా అన్న విషయం వర్షిణినే క్లారిటీ ఇవ్వాలి. కాగా వర్షిణి హీరోయిన్ అవకాశాల కోసం కూడా ట్రై చేస్తోందని తెలుస్తోంది. మరి హీరోయిన్ గా ఈ బుల్లితెర బ్యూటీ అవకాశాలు అందుకుంటుందా లేదా చూడాలి.

varshini sounderajan

 

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి