Ismart Jodi : తెలుగు బుల్లి తెరపై యాంకర్ ఓంకార్ ది చాలా ప్రత్యేకమైన శైలి అనడంలో సందేహం లేదు. సన్ నెట్వర్క్ వారి ఆధిత్య మ్యూజిక్ తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఓంకార్ యాంకర్ గా మారాడు. ఆ సమయంలో తన మాట చాతుర్యం మరియు ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయ్యే విధానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు. ప్రతి ఎపిసోడ్ లో కూడా ఆయన ఉంటే ఎంటర్ టైన్మెంట్ బాగా ఉండేది అనే అభిప్రాయం ఏర్పడింది. దాంతో ఓంకార్ అంటే అభిమానం మొదలయ్యింది. ఆ తర్వాత ఆయన స్థాయి ఏ విధంగా మారిందో అందరికి తెల్సిందే.తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు రియాల్టీ షో లు.. అందులో ఉన్న మజాను రుచి చూపించింది ఓంకార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అలాంటి ఓంకార్ ఇస్మార్ట్ జోడీ అంటూ రెండవ సీజన్ ను ముగించాడు మొదటి సీజన్ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో చాలా తక్కువ సమయంలోనే రెండవ సీజన్ ను కూడా తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు స్టార్ మా ద్వారా తీసుకు వచ్చాడు. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఇస్మార్ట్ జోడీ సీజన్ 2 తాజాగా ముగిసింది. గ్రాండ్ ఫినాలే లో వినయ్ మరియు వర్ణిత లు విజేతలు గా నిలిచారు. అమ్మరాజశేఖర్ మరియు రాధమ్మ లు రన్నర్ లుగా నిలిచారు.ఇస్మార్ట్ జోడీ సీజన్ 2 లో విజేతలుగా నెగ్గిన వర్ణిత మరియు వినయ్ లకు ఓంకార్ పాతిక లక్షల చెక్కును అందజేశాడు. రన్నర్ గా నిలిచిన వారికి పది లక్షలు.. కంటెస్టెంట్స్ కు అయిదు లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది.
మొత్తం ప్రైజ్ మనీ మరియు వారి పారితోషికాలు కలిపి ఓంకార్ దాదాపుగా 1.25 కోట్ల రూపాయలను ఖర్చు చేశాడని స్టార్ మా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఆయన చేసిన ఖర్చుకు గాను దాదాపు రెట్టింపు గా ఆయనకు వచ్చింది. రెండు కోట్లకు పైగానే ఆయన స్టార్ వారి నుండి అందుకున్నాడు. దాంతో దాదాపుగా కోటి రూపాయల లాభం ఓంకార్ కు వచ్చి ఉంటుందంటున్నారు. ఇక స్టార్ ఛానల్ లో టెలికాస్ట్ చేయడం ద్వారా వారికి ఏకంగా రెండు కోట్లకు పైగానే బ్రాండ్స్ ద్వారా ఆదాయం వచ్చిందని సమాచారం. మొత్తానికి ఓంకార్ ఏం చేసినా లాభాల పంట ఖాయం అని ఇస్మార్ట్ జోడీ కూడా నిరూపించింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.