
jabardasth and Sridevi Drama Company shows judge indraja going out very soon
Indraja : జబర్దస్త్ నుండి జడ్జ్ గా రోజా తప్పుకుంది. జగన్ ప్రభుత్వం లో ఆమెకు మంత్రి పదవి దక్కింది. ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో జబర్దస్త్ లో జడ్జ్ గా వ్యవహరించిన సమయంలోనే విమర్శలు వచ్చాయి. దాంతో ఆమె మంత్రి పదవి వచ్చిన వెంటనే జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేసింది. ఆమె ఇండస్ట్రీ లో ఉన్నంత కాలం చాలా ఆనందంగా ఉన్నట్లుగా చెప్పింది. జబర్దస్త్ లో తాను దక్కించుకున్నది చాలా అంటూ వెళ్లి పోయింది. ఎంతో లక్కీ చైర్ అయిన జడ్జ్ చూర్ ఎవరికి దక్కుతుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.రోజా వెళ్లి పోవడంతో ఆ స్థానంలో ఇంద్రజ దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది.
రోజా కు ఆరోగ్యం సరిగా లేని సమయంలో దాదాపుగా రెండు నెలల పాటు రోజా స్థానంలో ఇంద్రజ వచ్చిన విషయం తెల్సిందే. ఆ సమయంలో రోజా కు సరైన ప్రత్యామ్నాయం అంటూ ఇంద్రజను అంతా అనుకున్నారు. ఆమెకు ఆ సమయంలో మంచి ఫాలోయింగ్ దక్కింది. ఆమె కంటిన్యూ అవ్వాలని కూడా అభిమానులు అనుకున్నారు. అందుకే ఆమె కు శ్రీదేవి డ్రామా కంపెనీ దక్కింది.ఇప్పుడు రోజా కు మంత్రి పదవి దక్కడంతో ఇంద్రజ ఫుల్ టైమ్ జబర్దస్త్ జడ్జ్ గా కొనసాగే అవకాశం కనిపిస్తుంది.
jabardast full time judge indraja
అయితే ఈ సమయంలో ఆమెను కాస్త అతి తగ్గించుకుంటే బాగుంటుంది అంటూ కొందరు సూచిస్తున్నారు. ఆమె కొన్ని స్కిట్స్ లో టేబుల్ పై తల పెట్టి మరీ నవ్వేస్తుంది. ఇక తాజా ఎపిసోడ్ లో కుర్చీలో నుండి లేచి మరీ కడుపు పట్టేసుకుని నవ్వేసింది. కూర్చుని కూడా నవ్వొచ్చు కదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మీ నవ్వు బాగుంటుంది కదా అని మరీ అతిగా నవ్వితే బాగా లేదు ఇంద్రజ గారు అంటూ అభిమానులు స్వయంగా కామెంట్స్ చేస్తున్నారు. అదొక్కటి చూసుకుంటే ఇంద్రజ జబర్దస్త్ లో కుమ్మేయవచ్చు.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.