jabardast comedian rakesh went anchor rashmi karawan
Rashmi Gautam : ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ఓ సూపర్ హిట్. తొమ్మిదేళ్లుగా మంచి రేటింగ్స్ తో దూసుకు పోతున్న ఈ షో లోని యాంకర్లు, కమెడియన్లు నేడు పెద్ద సెలబ్రిటీ స్టేటస్ అందుకున్నారు. జబర్దస్త్ షోకు హైపర్ ఆది స్కిట్లు హైలెట్ గా నిలిస్తే ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు సుడిగాలి సుధీర్ స్కిట్లు ప్రాణమని చెప్పవచ్చు. జబర్దస్త్ షో మొదలైనప్పటి నుంచి నటి, ఎమ్మెల్యే రోజాఇప్పటివరకు ఈ షోకు జడ్జిగా కొనసాగుతున్నారు. కొన్నేళ్లు నాగ బాబు మరో జడ్జిగా ఉండగా ప్రస్తుతం సింగర్ మనో ఆయన స్థానాన్ని భర్తీ చేశారు. వీరిద్దరి షో లో వచ్చే స్కిట్ల మధ్యలో వేసే పంచ్ లు సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
కేవలం ప్రోమోలే యుట్యూబ్ లో మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడం చూస్తుంటే అభిమానులు షో కోసం ఎంత ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదిలా ఉండగా ఈ వారానికి సంబంధించిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో విడుదలైంది. ఇందులో యాంకర్ రష్మీ గురించి సింగర్ మని మాట్లాడిన ఓ మాట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.షో టాప్ రేటింగ్ లో దూసుకుపోతుండటంతో కమెడియన్లంతా ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ మధ్య స్కిట్ ఎంట్రీలోనే డ్యాన్స్ తో కుమ్మేస్తున్నారు. సుదీర్, హైపర్ ఆది మాదిరిగానే ఈ వారం రాకింగ్ రాకేష్ కూడా రష్మీతో కలిసి ఎంట్రీ సాంగ్ లో స్టెప్పులేశాడు. ఈ డ్యాన్స్ మూమెంట్స్ భలే రాగా.. ..
Jabardasth comedian rakesh went anchor rashmi gautam karawan
చివర్లో రష్మీ కాళ్ల మీద పడ్డట్టు, రాకేష్‌ను రష్మీ దీవిస్తున్నట్టుగా పోజులు పెట్టింది. ఈ తంతుపై జడ్జీ మనో వేసిన సెటైర్ అందరినీ షాక్ కు గురి చేసింది. ఉదయం ఎవరు లేనప్పుడు కేరవ్యాన్‌లో రష్మీ కాళ్ల మీద పడ్డావ్ కదా.. ఓ ఆమెతో కలిసి డ్యాన్స్ కోసమేనా.. అంటూ అసలు విషయం బయట పెట్టి ఆ కమెడియన్ పరువు తీశాడు. సెట్ లో ఉన్న వారంతా పగలబడి నవ్వగా.. పాపం రాకేష్ మాత్రం నవ్వలేక బిత్తర పోయి చూశాడు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న కమెడియన్లను సైతం నేడు ఆర్టిస్టులుగా మార్చింది ఈ షో. అలా ఎంతో మంది ప్రస్తుతం సినిమా అవకాశాలతో బిజీగా ఉన్నారు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.