
Jabardasth kiraak RP : సైలెంట్ గా పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కిరాక్ ఆర్పీ...!
Jabardasth kiraak RP : బుల్లితెర మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ షో ద్వారా చాలామంది కమెడియన్స్ లైఫ్ లో సెటిల్ అయిపోయారు. ఎంతోమంది కమెడియన్స్ ను వెండితెరకి పరిచయం చేసింది. జబర్దస్త్ షోకి కమెడియన్స్ గా వచ్చి ఇప్పుడు వెండి తెరపై డైరెక్టర్స్ గా, హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సత్తా చాటుతున్నారు. ఇక జబర్దస్త్ కమెడీయన్స్ లో కిరాక్ ఆర్పీ ఒకరు. ఆయన జబర్దస్త్ లో కమెడియన్ గా ఎంటర్ అయ్యి టీం లీడర్ స్థాయికి ఎదిగి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఆయన సైలెంట్ గా పెళ్లి చేసుకుని అభిమానులందరికీ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జబర్దస్త్ షోలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కిరాక్ ఆర్పీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ షోకి కమెడియన్ గా ఎదిగిన కిరాక్ ఆర్పి తనదైన పంచులు, ప్రాసలతో తనకంటూ ఒక మార్క్ ను క్రియేట్ చేసుకున్నారు. కమెడియన్ నుంచి టీం లీడర్ గా ఎదిగి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. జబర్దస్త్ షో నుండి బయటికి వచ్చాక హైదరాబాద్లో నెల్లూరు పెద్దారెడ్డి చాపల పులుసు అనే పేరుతో రెస్టారెంట్ ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన రెస్టారెంట్ మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. ఇలా చేపలు పులుసుతో బిజీబిజీగా ఉంటున్న కిరాక్ ఆర్పీ రీసెంట్గా వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. అయితే పెళ్లిని చాలా సైలెంట్ గా చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పెళ్లికి ముందు ఎటువంటి ప్రకటన లేకుండా కొద్దిమంది బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
అయితే ఎంగేజ్మెంట్ చేపల పులుసు ప్రమోషన్స్ ధూమ్ ధామ్ గా చేసిన కిరాక్ ఆర్పీ తన పెళ్లిని మాత్రం అతికొద్ది బంధువుల సమక్షంలో చేసుకున్నారు. వైజాగ్ కు చెందిన లక్ష్మీప్రసన్నతో మూడేళ్లపాటు ప్రేమలో ఉన్న ఆర్పీ పెద్దలను ఒప్పించి గతేడాది గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. వీరు బుధవారం విశాఖపట్నంలో పెళ్లి చేసుకున్నారు. కేవలం ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు, సన్నిహితులు మాత్రమే ఆర్పీ పెళ్లికి హాజరయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇవి చూసిన జబర్దస్త్ కామెడీ అభిమానులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు పెళ్లి తర్వాత మీడియాతో మాట్లాడిన ఆర్పి ఏడాదిన్నర క్రితమే తాము ఎంగేజ్మెంట్ చేసుకున్నామని, ఎంగేజ్మెంట్ కి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారని, అందుకే పెళ్లి చాలా సింపుల్ గా చేసామని తెలియజేశారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.