Jabardasth Naresh : జబర్దస్త్ షోలో నడిచే చండాలం గురించి ఎంత చెప్పినా తక్కువే. డబుల్ మీనింగ్ డైలాగ్స్, అక్రమ సంబంధాల మీద సెటైర్లు వేస్తుంటారు. జబర్దస్త్ ప్రారంభంలో అయితే ఈ ధొరణి మరింత ఎక్కువగా ఉండేది. పక్కింటి పెళ్లాం.. ఎదురింటి మొగుడు, దుబాయ్ వెళ్లిన మొగుడు అంటూ ఇలా పిచ్చి పిచ్చి కాన్సెప్టులతో స్కిట్లు వేసేవారు. ఇక ఆ మధ్య కొన్ని సంఘటనలతో కాస్త హద్దుల్లో ఉంటూ వచ్చారు. కానీ డబుల్ మీనింగ్స్ మాత్రం మానడం లేదు. నానాటికీ వాటి హద్దులు చెరిపేస్తూ వస్తున్నారు. ఇక ఈ మధ్య అయితే జబర్దస్త్ నరేష్ మరింత రెచ్చిపోతోన్నాడు. తన హైట్ మీద అందరూ కామెంట్లు చేసేవారని, తనను చులకనగా చూసేవారంటూ గతంలో ఎంతో ఎమోషనల్‌గా చెబుతూ ఏడ్చేశాడు.
సమాజంలో తనను చిన్న చూపు చూస్తున్నాడంటూ వాపోయాడు. కానీ నరేష్ తీరా జబర్దస్త్ షోలో చేసేది కూడా అదే. తన మీద తానే, తనను తానే చిన్నచూపు చూసుకుంటూ కించప్చరుకునే కామెంట్లు వేసుకుంటారు. వేరే వాళ్లు కూడా నరేష్ హైట్ మీద కామెంట్లు వేస్తుంటారు. ఇక అంతకు మించిన కంటెంట్ వారికి లేనట్టుంది. నరేష్ మొన్నటి ఎపిసోడ్‌లో దొండకాయ అంటూ తనది తానే పరువుతీసుకున్నాడు. దొండకాయ ఏంటి మరీ ఇంత చిన్నగా ఉందని నరేష్ డబుల్ మీనింగ్ డైలాగ్ వేస్తాడు.. ఎక్కడో చూసినట్టుగా ఉంది కదా? అని ఆది మరింత దారుణంగా డైలాగ్ వేస్తాడు. ఇవన్నీ వినలేక ఇంద్రజ తలదించుకుంటుంది.
అయితే తాజాగా మరోసారి నరేష్ రెచ్చిపోయాడు. తన మీద పంచులు వేయించుకోవాలని తహతహలాడుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా జబర్దస్త్ ప్రోమోను వదిలారు. అందులో నరేష్ రెచ్చిపోయాడు. హద్దులు దాటుతోన్న నరేష్.. ఆ మధ్య ఒకసారి నరేష్ ఇలా చెప్పాడు.. గునపం చేయలేని పనులు.. చిన్న బ్లేడ్ చేస్తుంది.. దానికి కూడా ఓ చాన్స్ ఇవ్వాలి అంటూ నరేష్ తన హైట్ గురించి డబుల్ మీనింగ్ డైలాగ్ వేశాడు. ఇప్పుడు కొత్త అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి కూడా అదే డైలాగ్ వేసింది. అమ్మాయిలు మారుతున్నారు కానీ డైలాగ్ మాత్రం మారడం లేదు.. గునపం, బ్లేడ్ అని చెప్పిన డైలాగ్‌ను నరేష్ గుర్తు చేసుకున్నాడు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.