Jabardasth new anchor rashmi gautam as we told
Jabardasth : తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు జబర్దస్త్ తో కనెక్షన్ ఇప్పటిది కాదు.. పది సంవత్సరాలుగా జబర్దస్త్ కామెడీ కార్యక్రమానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతూనే ఉన్నారు. ఈ మధ్య కాలం లో కొందరు కమెడియన్స్ మరియు జడ్జ్ లు వెళ్లి పోయినా కూడా కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. తాజాగా జబర్దస్త్ యాంకర్ గా అనసూయ తప్పుకున్న విషయం తెలిసిందే. ఆమె స్థానం లో కొత్త యాంకర్ గా జబర్దస్త్ కి ఎవరు వస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ సమయంలో ఎట్టకేలకు ఆ సస్పెన్స్ వీడినట్లు అయింది.
గతంలో అనసూయ జబర్దస్త్ ను వీడిన సమయం లో రష్మి గౌతమ్ వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అనసూయ వెళ్లిపోయిన తర్వాత రష్మి గౌతమ్ సందడి చేసింది. జబర్దస్త్ ప్రోమో వచ్చిన సమయంలోనే మేము జబర్దస్త్ కొత్త యాంకర్ గా రష్మి గౌతమ్ రాబోతుంది అంటూ క్లారిటీ ఇచ్చాము. కొందరు మాత్రం వేర్వేరు పేర్లు చెప్పుకొచ్చారు.. కానీ మేము రష్మి గౌతమ్ అంటూ బలంగా ప్రచారం చేశాము. మేము చెప్పినట్లుగానే, మాకు అందిన సమాచారం నిజమయింది. రష్మి గౌతమ్ జబర్దస్త్ యాంకర్ గా బాధ్యతలు తీసుకుంది. ఇప్పటికే ఆమె ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ గా చేసిన విషయం తెలిసిందే. ఆమెకు అదనపు బాధ్యతలు అన్నట్లుగా జబర్దస్త్ బాధ్యతలను అప్పగించడం జరిగింది.
Jabardasth new anchor rashmi gautam as we told
ఇటీవలే ఆమె శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి సుధీర్ తప్పుకోవడంతో ఆ కార్యక్రమం యొక్క యాంకరింగ్ బాధ్యతలను కూడా తీసుకున్న విషయం తెలిసిందే. మొత్తానికి మల్లెమాల వారి ప్రతిష్టాత్మకమైన మూడు కార్యక్రమాలకు సంబంధించిన యాంకరింగ్ బాధ్యతలను రష్మి గౌతమ్ తీసుకోవడంతో.. ఆ కార్యక్రమాల రేటింగ్ ముందు ముందు ఎలా ఉంటాయి అనేది ఆసక్తిగా మారింది. ఎంతో మంది ఈటీవీ, మల్లెమాల ని వదిలి పోతున్న కూడా రష్మి గౌతమ్ మాత్రం అలాగే కొనసాగుతుంది. రష్మికి విశ్వాసం ఎక్కువ అందుకే ఇలా కొనసాగుతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జబర్దస్త్ బాధ్యత కూడా రష్మీ గౌతమ్ భుజాన ఎత్తడం తో ఆమె ఎలాంటి సక్సెస్ ని దక్కించుకుంటుంది చూడాలి.
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
This website uses cookies.