Anchor Sowmya Rao : రష్మీ, అనసూయకు ఆ కండీషన్లు పెట్టి కొత్త యాంకర్ సౌమ్యకు మాత్రం ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశారట
Anchor Sowmya Rao : జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య తెలుసు కదా. తనేంటో, తన రేంజ్ ఎంటో అందరికీ ఇప్పుడు అర్థం అయింది. ముందు తనను చూసి జబర్దస్త్ లో ఇమడగలుగుతుందా అని అందరూ టెన్షన్ పడ్డారు. కానీ.. తను జబర్దస్త్ లోకి రావడంతోనే ఒక్కసారిగా తనకు క్రేజ్ వచ్చేసింది. నిజానికి తను ఒక యాంకర్ గా సూపర్ సక్సెస్ అయిపోయింది. తను సీరియల్ నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత యాంకర్ గా జబర్దస్త్ లోకి వచ్చేసింది. ఆ తర్వాత ఒక్కసారిగా క్రేజ్ పెంచుకుంది.
ఇక.. జబర్దస్త్ షో గురించి చెప్పుకోవాలంటే.. షో ప్రారంభమై పదేళ్లు దాటినా ఇప్పటికీ ఆ షో నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. ఆ షో అంతలా జనాలకు ఎక్కేసింది. చాలామంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చింది. చాలామంది జబర్దస్త్ స్టేజ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పెద్ద సెలబ్రిటీలు అయ్యారు. చాలామంది యువతుల లైఫ్ ను సెటిల్ చేసింది. యాంకర్ల జీవితాల లైఫ్ కూడా సెటిల్ అయింది. అందులో యాంకర్ అనసూయ నుంచి యాంకర్ రష్మీ కూడా ఉన్నారు.
jabardasth new Anchor Sowmya Rao gets full freedom no conditions
Anchor Sowmya Rao : కొత్త యాంకర్ కు మల్లెమాల ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసిందా?
జబర్దస్త్ షో ప్రారంభానికి ముందు యాంకర్లు కొన్ని స్టెప్పులు వేయాలి తెలుసు కదా. ఏ పాటకు డ్యాన్స్ వేయాలి.. ఎలాంటి స్టెప్పులు వేయాలి, కాస్ట్యూమ్ ఏంటి అనేది మొత్తం మల్లెమాల యాజమాన్యమే చూసుకుంటుంది. అనసూయ, రష్మీ విషయంలోనూ మల్లెమాల అలాగే చేసిందట. కానీ.. కొత్త యాంకర్ సౌమ్య విషయంలో మాత్రం అలా వ్యవహరించడం లేదని తెలుస్తోంది. తను ఏ పాటకు డ్యాన్స్ వేయాలి.. ఎలాంటి స్టెప్స్ వేయాలి. ఏ కాస్ట్యూమ్ వేసుకోవాలి.. అన్నీ తనకే ఫ్రీడమ్ ఇచ్చేశారట. అనసూయ, రష్మీ ఏం తప్పు చేశారు.. సౌమ్య అంతగా అట్రాక్ట్ చేసిందేంటి.. అంటూ నెటిజన్లు మల్లెమాలపై ఫైర్ అవుతున్నారు.
