Home » Entertainment » Jabardasth Nookaraju Suffering With Sugar Chanti Reveals The Fact
Entertainment

Jabardasth : ఆ రోగంతో బాధపడుతున్న కమెడియన్.. అసలు విషయం చెప్పిన చంటి

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: November 12, 2021 9:08 pm
Advertisement

Jabardasth : జబర్దస్త్ నూకరాజు.. ఈ మధ్య బాగానే సందడి చేస్తున్నాడు. పటాస్‌ షోతోనే ఎంట్రీ ఇచ్చిన నూకరాజుకు.. క్రేజ్ వచ్చింది మాత్రం జబర్దస్త్‌తోనే. అయితే నూకరాజు, ఫైమా, ఇమ్మాన్యుయేల్ మధ్య కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అవుతున్నాయి. నూకరాజు కూడా తనకంటూ ప్రత్యేకతను చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. రెండు, మూడు సినిమాల్లో కూడా కనిపించాడు.

Advertisement

మరోవైపు తనతో పాటు పటాస్‌లో చేసిన ఆసియాతో లవ్ ట్రాక్‌ నడుపుతున్నాడు.అయితే నూకరాజు షుగర్‌తో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా జబర్దస్త్, శ్రీదేశి డ్రామా కంపెనీ ఫాలో అయ్యేవారికి ఈ విషయం గురించి ఐడియా ఉంటుంది. ఎందుకంటే పలు సందర్భాల్లో.. ఇతర కంటెస్టెంట్‌లు నూకరాజుకు షుగర్ ఉందని, తీపి ఎక్కువగా పెట్టొద్దని కామెంట్స్ చేయడం చూశాం.

jabardasth nookaraju suffering with sugar chanti reveals the fact

Advertisement

Jabardasth : షుగర్ ఉందంటూ కామెంట్..

ఈ విధంగా నూకరాజు షుగుర్ ఉన్న విషయం బయటికొచ్చింది. దీనిని ఉద్దేశించి వేసే డైలాగ్‌ను నూకరాజు కూడా లైట్ తీసుకుంటాడు.అయితే తాజాగా ఓ స్కిట్‌లొ లేడీ గెటప్‌లో ఉన్న సునామీ సుధాకర్‌‌ను ఉద్దేశించి డైలాగ్ చెబుతూ.. ఆమె కళ్లు షుగర్ పెషేంట్‌లు తినే నెరెడి పండ్లు అని అంటాడు. అప్పుడు చలాకీ చంటి.. మనిషిని పొగడమంటే నీ షుగుర్ గురించి చెప్తావేంటి అంటూ ప్రశ్నిస్తాడు.

అయితే జడ్జ్‌గా ఉన్న ఇంద్రజ కల్పించుకుని.. వాడు ఏది స్టార్ట్ చేసిన షుగర్‌తోనే చేస్తున్నాడని కామెంట్ చేస్తుంది. దీనికి లేదు మేడమ్ నాకు పోయిందని.. నూకరాజు బదులిస్తాడు. అయితే చంటి మాత్రం ఎవడ్రా చెప్పింది పోయిందని అని అంటూ కామెంట్ చేస్తాడు. ఈ క్రమంలోనే నూకరాజు షుగర్‌తో బాధపడుతున్న విషయం చర్చనీయాంశంగా మారింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి