Home » Entertainment » Jabardasth Permanent Jedge Is Indraja And Mano
Entertainment

Jabardasth : జబర్దస్త్‌.. రోజా పోయినా మనో కి దెబ్బలు తప్పడం లేదు పాపం

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: May 27, 2022, 7:08 pm
Advertisement

Jabardasth : ఒకప్పుడు మంచి కామెడీతో.. మంచి రేటింగ్‌ తో వార్తల్లో నిలిచిన జబర్దస్త్‌ ఇప్పుడు ఇతర విషయాలతో వార్తల్లో ఉంటుంది. రోజా వెళ్లి పోయిందని.. ఆది కనిపించడం లేదని.. సుధీర్ కూడా లేడు అంటూ రకరకాల వార్తలతో జబర్దస్త్‌ వార్తల్లో నిలవడం అభిమానులకు తీవ్ర ఆవేదన కలిగిస్తుంది. జబర్దస్త్‌ లో మునుపటి ఉత్సాహం మునుపటి కామెడీ ఖచ్చితంగా లేదు అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలో ఒక విషయం మాత్రం కంటిన్యూ కనిపిస్తుంది. రోజా ఉన్న సమయంలో ఎవరైనా కామెడీ చేస్తే మనో చేయి మీద కొట్టి మరీ గట్టిగా రోజా నవ్వేది.

Advertisement

ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది.రోజా వెళ్లి పోవడంతో మనో కు దెబ్బలు తప్పినట్లే అని కొందరు అనుకుంటే అంతకు మించి అన్నట్లుగా ఇంద్రజ ఓవర్ గా రియాక్ట్‌ అవుతూ మనో చేయి లేవకుండా చేస్తుంది. మనో చేయి మీద రోజా పదే పదే తన చేత్తో కొట్టేది. ఇప్పుడు ఇంద్రజా కూడా మనోను అలాగే కొడుతుంది. ఇద్దరి మద్య మంచి అండర్ స్టాండింగ్ వచ్చేసింది. అందుకే మనో మరియు ఇంద్రజలు జడ్జిలుగా జబర్దస్త్‌ కు సూపర్ గా సెట్‌ అయ్యారు. అందుకే జబర్దస్త్‌ లో ఇంద్రజను పూర్తి స్థాయి జడ్జ్ గా ఖరారు చేయడం జరిగిందని వార్తలు వస్తున్నాయి.

jabardasth permanent jedge is indraja and mano

Advertisement

ఇంద్రజ సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఎక్కువ ఉన్న వ్యక్తి. అంతే కాకుండా కామెడీని ట్యాలెంట్‌ ను బాగా ఎంకరేజ్ చేయడం మరియు ఎంజాయ్‌ చేయడం ఆమెకు అలవాటు. అందుకే జబర్దస్త్‌ లో ఆమె కొనసాగుతుంది. తాజా జబర్దస్త్‌ ప్రోమోలో ఇంద్రజ సందడి చేసింది. ఆ ప్రోమోల మనోను ఇంద్రజ కొట్టిన విజువల్స్ ను చూడవచ్చు. జబర్దస్త్‌ లో మరియు ఇతర మీమ్స్ లో మనో ను రోజా కొట్టడం.. ఆయన చేయి నొప్పి తో బాధ పడుతున్నట్లుగా చూపించడం చాలా చూశాం. ఇప్పుడు ఆమె పోయినా కూడా ఇంద్రజ దెబ్బలతో మనో చెయి నొప్పి కంటిన్యూ అంటూ మీమ్స్‌ మరియు కామెడీ స్కిట్స్ వచ్చే అవకాశం ఉంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి