Jabardasth Raghava : జబర్దస్త్ రాఘవ పరువుపాయే.. సొంత కొడుకే అలాంటి కామెంట్లు
Jabardasth Raghava : జబర్దస్త్ షోలో రాఘవ గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. జబర్దస్త్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రాఘవ ఉన్నాడు. ఇక ముందు కూడా ఉంటాడు. అందరికంటే సీనియర్ అతనే. అయితే ఈ మధ్యన రాఘవ తన కొడుకు మురారిని కూడా ఎంట్రీ ఇప్పించాడు. జబర్దస్త్ స్టేజ్ మీద మురారి ఈ మధ్య హల్చల్ చేస్తున్నాడు. ఒకప్పుడు దీవెన, నేహాంత్ వంటి వారుండే వారు. కానీ ఇప్పుడు మాత్రం ఫోకస్ అంతా కూడా మురారి మీదే పడింది. ఎవ్వరికీ చాన్స్ ఇవ్వకుండా మురారి అందరి మీద పంచ్‌లు వేసేస్తున్నాడు.
Jabardasth Raghava Son Murari In Hyper Aadi Skit
మొన్నటికి మొన్న ఆది టీంలో మురారి వేసిన పంచ్‌లకు అందరూ ఫిదా అయ్యారు. ఆ స్కిట్‌లో రాఘవ కూడా ఓ క్యారెక్టర్ వేశాడు. ఇక తన తండ్రి మీదే దారుణమైన కామెంట్లు వేశాడు. డాన్ గెటప్‌లో పిల్లి బొమ్మను పట్టుకొచ్చిన రాఘవను దారుణంగా ఏకిపారేశాడు. ప్రాణాలు తోడేస్తా అని రాఘవ భయపెట్టే ప్రయత్నం చేశాడు.. ఇక్కడేమో ఇలా ప్రాణాలు తోడేస్తా అంటాడు.. ఇంటికెళ్తే పాలల్లో తోడేస్తాడు. పిల్లిని ఇక్కడ నిమురుతున్నాడు.. ఇంట్లోకి వెళ్తే ఆయన పరిస్థితి కూడా అదే అని కౌంటర్లు వేశాడు.
Jabardasth Raghava Son Murari In Hyper Aadi Skit
Jabardasth Raghava : రాఘవపై మురారి పంచులు..
ఇంచు అంత ఉన్నావ్.. జబర్దస్త్‌లో ఇంకెన్నాళ్లు ఉంటావ్.. కొత్త వాళ్లకు చాన్స్ ఇవ్వవా? ఇలా వరుసగా పంచులు మీద పంచులు వేశాడు. అనసూయ ముద్దు పెడితే కూడా కౌంటర్ వేశాడు.
Jabardasth Raghava Son Murari In Hyper Aadi Skit
చివరకు చందమామ అంటూ రోజాను పొగిడినట్టే పొగిడి కౌంటర్ వేశాడు. ఆది, రాఘవ, దొరబాబు, శాంతి, రైజింగ్ రాజు ఇలా ఏ ఒక్కరినీ వదిలిపెట్టలేదు. మొదటిసారిగా ఆది టీంలో ఆది కాకుండు ఓ బుడ్డోడు ఇలా చెలరేగడం. మొత్తానికి మురారి టైమింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు.
