Home » Entertainment » Jabardasth Rashmi Gautam Marriage News Goes Viral In Social Media
Entertainment

Rashmi Gautam : రష్మి గౌతమ్ పెళ్లి అయ్యింది.. అంతు చిక్కని విషయం మరోసారి ప్రచారం

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: October 26, 2022, 7:47 pm
Advertisement

Rashmi Gautam : యాంకర్ రష్మీ మరియు సుడిగాలి సుధీర్ మధ్య ప్రేమ ఉంది అంటూ టీవీ ప్రేక్షకులను జబర్దస్త్ నిర్వాహకులు దాదాపుగా 8 సంవత్సరాల పాటు నమ్మించారు. మధ్య మధ్యలో తామిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే అంటూ వారితో చెప్పిస్తూనే మరో వైపు లవ్ సిగ్నల్స్ వారి పై వేసి ఇద్దరు ప్రేమలో ఉన్నారని ప్రేక్షకులు భావించేలా చేశారు. ఒకవేళ వారు ప్రేమలో లేకుంటే ఇప్పటి నుండి అయినా ప్రేమించుకుంటే బాగుంటుందని ప్రేక్షకులు అనుకునే స్థాయికి జబర్దస్త్ మరియు ఈటీవీ వారు ప్రయత్నించారంటే ఏ స్థాయిలో సుడిగాలి సుదీర్ మరియు రష్మి గౌతమ్ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. వైజాగ్ కి చెందిన రష్మీ గౌతమ్ పెళ్లి అయింది అంటూ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు.

Advertisement

గత కొన్నాళ్లుగా సీనియర్ జర్నలిస్టు ఒకాయన తన ఫేస్బుక్ లో మరియు బ్లాగ్‌ లో రష్మీ గౌతమ్ కి చాలా కాలం క్రితమే పెళ్లి అయిందని.. టీవీ షోలా వల్ల ఆమె ఆ పెళ్లి విషయాన్ని బయటకి చెప్పడం లేదని చెబుతూ వస్తున్నాడు. ఆయన మాటలు ప్రకారం రష్మి గౌతమ్ పెళ్లి అయ్యి చాలా కాలమైందని, ఆమె సుడిగాలి సుదీర్ తో కేవలం షో యొక్క రేటింగ్ కోసమే అలా నటించిందని చెప్తున్నాడు. ఆయన మాటలను చాలా మంది నమ్మడం లేదు. అసలు ఆ విషయం చాలా మందికి తెలియనే లేదు. తాజాగా సోషల్ మీడియాలో మరో సారి రష్మీ గౌతమ్ యొక్క పెళ్లి ప్రచారం మొదలైంది. రష్మి గౌతమ్ కి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమెకు ఇంతకు ముందే పెళ్లి అయ్యింది అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా బలంగా వినిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

jabardasth Rashmi Gautam marriage news goes viral in social media

Advertisement

పెళ్లి అయితే ఆమె ఎందుకు మీడియా ముందుకు తన భర్తను తీసుకు రావడం లేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు ఈ సోషల్ మీడియా ప్రపంచం ఇంతగా ఉన్న సమయంలో రష్మి గౌతమ్ తన పెళ్లి విషయాన్ని దాచడం అనేది అసాధ్యం అంటూ కొందరు బలంగా వాదిస్తున్నారు. మొత్తానికి రష్మి గౌతమ్ పెళ్లి అయ్యిందా లేదా అనేది ఒక అంతు చిక్కని ప్రశ్నగా మారింది. గతంలో రష్మి గౌతమ్ మరియు సుడిగాలి సుదీర్ మధ్య ప్రేమ ఉందా లేదా అనేది ఒక అంత చక్కని ప్రశ్నగా ఉండేది. కానీ ఇప్పుడు రష్మి గౌతమ్ కి పెళ్లి అయిందా లేదా అనేది అంతు చిక్కని ప్రశ్నగా ఉంది అంటూ బుల్లి తెర ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి