Home » Entertainment » Jabardasth Rocking Rakesh Jordar Sujatha Living Together
Entertainment

Jabardasth : ఆ జబర్దస్త్‌ జోడీ పెళ్లి కాకుండానే సహజీవనం సాగిస్తున్నారా?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 2, 2022, 5:40 pm
Advertisement

Jabardasth : జబర్దస్త్ ప్రారంభం అయినప్పటి నుండి ఎంతో మంది ప్రేమ జంటలను ఆ స్టేజిపై చూడడం జరిగింది. మొదటగా సుడిగాలి సుదీర్, రష్మి గౌతమ్ మధ్య ప్రేమ ఉందని వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ తర్వాత కూడా చాలా మంది జంటల పేర్లు వినిపించాయి. కానీ ఏ ఒక్క జంట కూడా పెళ్లి పీటల వరకు వెళ్లలేదు. సుడిగాలి సుదీర్ మరియు రష్మి గౌతమ్ పెళ్లి చేసుకుంటారని అంతా బలంగా నమ్మారు.. కానీ వారిద్దరిది అసలు ప్రేమ కానే కాదని క్లారిటీ వచ్చేసింది.

Advertisement

వారిద్దరి మాదిరిగానే ఇతరులది కూడా ప్రేమ కాదని కేవలం రేటింగ్ కోసం మాయాజాలం అంటూ తేలి పోయింది. అయితే జబర్దస్త్ లో ఒక్క జంట మాత్రం రియల్ గా ప్రేమించుకున్నారు. వారిద్దరూ పెళ్లికి సిద్ధమయ్యారు. వాళ్లే రాకింగ్‌ రాకేష్ మరియు జోర్దార్ సుజాత. వీరిద్దరి జోడి చక్కగా కుదిరింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి జబర్దస్త్ స్టేజీపై కుమ్మేస్తున్నారు. ప్రేమలో ఉన్న వీరిద్దరూ అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించారు. అయితే వీరి పెళ్లి కాకుండానే హైదరాబాదులో ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారని.. సహజీవనం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

jabardasth rocking rakesh jordar sujatha living together

Advertisement

స్వయంగా జబర్దస్త్ కి చెందిన వారు ఈ విషయాన్ని అనధికారికంగా మీడియాతో చెప్పుకొచ్చారు. రాకేష్ మరియు సుజాత త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే పెళ్లి కాకుండానే వీరిద్దరూ కలిసి ఉంటున్నారు అంటూ వారు తెలియ జేశారట. వచ్చే సంవత్సరం వీరిద్దరి పెళ్లి ఉంటుందని సమాచారం అందుతుంది. పెళ్లి కాకుండానే వీరిద్దరూ సహజీవనం పేరుతో కలిసి ఉండడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే వీరిద్దరి సహజీవనం చేస్తున్నారా లేదా అనే విషయమై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. ఆ విషయం వారి నోటి నుండే వెలువడితే బావుంటుందని కొందరు అభిప్రాయం చేస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి