Jabardasth Shanthi Reel WIth Hyper Aadi
Hyper Aadi : హైపర్ ఆది తన గ్యాంగుతో కలిసి ఫుల్ చిల్ అవుతుంటాడు. దొరబాబు, పరదేశీ, రైజింగ్ రాజు ఇలా తమ గ్యాంగ్ అంతా కలిసి బయటకు వెళ్తుంటారు. ఫుల్లుగా రిలాక్స్ అవుతుంటారు. మొత్తానికి ఆది మాత్రం తన టీంను బాగానే చూసుకుంటాడు. ఇప్పుడు ఆది అయితే జబర్దస్త్ షోలో కనిపించడం లేదు. ఆది లేకపోవడంతో ఆయన టీం కూడా కనుమరుగైంది. మళ్లీ జబర్దస్త్ షోకు ఆది వస్తాడా? లేదా? అన్నది కూడా డౌట్‌గానే మిగిలింది. ఇక ఆది కూడా నెట్టింట్లో అంత యాక్టివ్‌గా ఏమీ ఉండడు. అయితే జబర్దస్త్ శాంతి మాత్రం ఎక్కువగా నెట్టింట్లో సందడి చేస్తుంటాడు.
జబర్దస్త్ టీం చేసే అల్లరి, రోజాతో ముచ్చట్లు, ఇతర కంటెస్టెంట్లతో చేసే సందడిని రీల్ వీడియోలుగా షేర్ చేస్తుంటాడు శాంతి స్వరూప్. నెట్టింట్లో ఆది ఫోటోలు, వీడియోలు కూడా శాంతి షేర్ చేస్తుంటాడు. మొత్తానికి శాంతి స్వరూప్ ఓ వీడియోను షేర్ చేశాడు. ఇది పాతదా? కొత్తదా? అన్నది తెలియడం లేదు. కానీ శాంతి స్వరూప్ షేర్ చేసిన ఈ వీడియోలో మాత్రం అందరూ స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేశారు. ఇందులో ఆది, దొరబాబు, పరదేశీలు స్విమ్మింగ్ పూల్‌లో ఉంటే.. శాంతి, రైజింగ్ రాజు మాత్రం స్విమ్మింగ్ పూల్ బయట ఉంటారు. ఇక ఆ ఇద్దరూ కాస్త తేడాగా ప్రవర్తిస్తారు.
Jabardasth Shanthi Reel WIth Hyper Aadi
దాంతో స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న ఆది అండ్ కో.. ఆ ఇద్దరినీ చూసి జడసుకుంటారు. పారిపోతారు. మొత్తానికి ఈ రీల్ వీడియో కాస్త ఫన్నీగానే ఉంది. కానీ ఆది లుక్ చూస్తుంటే అది ఇప్పటి వీడియోలా అనిపించడం లేదు. మొత్తానికి ఆది మాత్రం ఇప్పుడు జబర్దస్త్ షోకు దూరమయ్యాడు. దాంతో ఈ టీం మొత్తానికి పని లేకుండా పోయింది. కనీసం ఆది వచ్చే శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలోనూ వారిని తీసుకోవడం లేదు. వారు ఇతర టీంలోనూ కనిపించడం లేదు. మళ్లీ వీరంతా ఎప్పుడు వస్తారో చూడాలి. ఆ మధ్య రైజింగ్ రాజు సింగిల్‌గానే టీంను నడిపించినట్టున్నాడు.కానీ ఇప్పుడు మాత్రం ఆ టీం దిక్కులేని స్థితిలో ఉన్నట్టుంది.
Ghee Vs Butter | భారతీయ వంటకాలలో నెయ్యి, వెన్న కీలకమైన పదార్థాలు. రోటీ, పరాఠా, పప్పు, బిర్యానీ లాంటి…
Guava leaves | జామపండు రుచికరంగా ఉండటమే కాదు, దాని ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.…
Coconut Water | కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. దీనిలో ఉండే ప్రాకృతిక ఎలక్ట్రోలైట్లు,…
Pumpkin Seeds | ఇప్పటి కాలంలో పని ఒత్తిడి, తప్పుడు జీవనశైలి, శారీరక శ్రమలేని జీవితం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు…
Shani Dosha | శని దోషంతో బాధపడేవారు శనివారం ఉపవాసంతో శివుడి మరియు హనుమంతుని పూజ చేయాలి. శివలింగానికి ఆవుపాలు,…
Google Pixel 10 | గూగుల్ పిక్సెల్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇక నుండి వాట్సాప్ కాల్స్ (Google Pixel…
Lord Ganesha | ఈ ఏడాది గణేశ్ చతుర్థిను కాకినాడ జిల్లా భక్తులు ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. పర్యావరణహిత మార్గాల్లో వినాయక విగ్రహాలను…
Heavy Rains | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ…
This website uses cookies.