
Jabardasth Varsha full fun entertain the audience
Jabardasth Varsha : జబర్ధస్త్ షోతో అందరి దృష్టిని ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ వర్ష. ఇంతకముందు పలు సీరియల్స్ లో నటించినప్పటికీ జబర్ధస్త్‌తో క్రేజ్ విపరీతంగా పెరిగింది. అయితే చాలా రోజులుగా వర్ష, ఇమ్మాన్యుయెల్ లవర్స్ గా స్కిట్లు చేస్తూ నవ్వులు పూయిస్తున్నారు. అదే సమయంలో వ్యక్తిగత విషయాలను పంచుకునే సమయంలోనే ఇమ్మాన్యుయెల్‌ని లేకుండా తన లైఫ్‌ని ఊహించుకోలేనని చాలా సందర్భాల్లో చెప్పింది. ఇమ్మాన్యుయెల్ లేకపోతే చాలా కష్టం అంటూ రియాక్ట్ అయ్యింది. దీంతో వీరిద్దరి మధ్య లవ్ స్టోరీ సాగుతుందనే అంచనాని షోలోని మెంబర్‌తోపాటు ఆడియెన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. అయితే ఇటీవల వర్ష బుల్లెట్ భాస్కర్ టీంలోను తెగ సందడి చేస్తుంది.
ఫైమాని హాయ్ అక్క వర్ష పలకరించడంతో ఈమెపై ఫైమా ఫైర్ అయింది. కాస్ట్యూమర్ దగ్గరకు వెళుతుంటే నీలా నేను కూడా లేడీ గెటప్ అనుకొని చీర కడతా అన్నాడు అని చెప్పుకొచ్చింది ఫైమా. అవన్నీ కాదు కాని నా ముఖం చూస్తే ఎవరైన ఫ్లాట్ అయిపోతారు తెలుసా అంటూ వర్ష అంది. దీనిక ఫైమా నాలుగు డైలాగులు ఇస్తే నువ్వే ఫిట్స్ వచ్చి పడిపోతావు తెలుసా అంటుంది. ఇక అక్కా చెల్లెళ్లుగా నటించిన ఫైమా, వర్ష తమకు రావల్సిన అబ్బాయి ఎలా ఉండాలో కోరకుంటారు. దీనికి ఫైమా తనకు 4జీ సిమ్ లా కాకుండా 5జీ సిమ్ లా ఉండాలని కోరుకుంటుంది. వర్ష తనకు పిండితే లీటర్ పాలు కారేలా వచ్చేఅబ్బాయి కావాలంటుంది.
Jabardasth Varsha full fun entertain the audience
దీనికి ఫైమా బర్రెను పెళ్లి చేసుకోమని పంచ్ వేస్తుంది. ఇక బుల్లెట్ భాస్కర్,ఇమ్మాన్యుయేల్ కలిసి కొద్ది సేపు తమదైన పంచ్‌లతో నానా రచ్చ చేశారు. వీరి కామెడీ ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించింది. ఇదలా ఉంటే వర్ష శ్రీదేవి డ్రామా కంపెనీలోను తెగ సందడి చేస్తుంటుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ ప్రత్యేకమైన ప్రోగ్రాం ప్లాన్ చేసింది శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్. ఈ మేరకు కంటిస్టెంట్స్ తల్లులను గెస్టులుగా తీసుకొచ్చి ఈ వేదిపై గౌరవప్రదమైన సత్కారం చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా అందులోని కొన్ని సన్నివేశాలు పలువురి చేత కంటతడి పెట్టిస్తున్నాయి.సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, ఇమ్మానుయేల్, వర్ష, జోర్దార్ సుజాత సహా పలువురు కంటిస్టెంట్లతో ఈ ప్రోగ్రాం రూపొందించారు. ఇందులో పెళ్ళాం మాట విని ఇమ్మానుయేల్ తన తల్లిని ఇంట్లో నుంచి గెంటివేసిన సీన్ చూసి అక్కడున్న ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అయ్యారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.