Home » Entertainment » Jabardasth Varshaand Emmanuel Skit In Jabardasth
Entertainment

Jabardasth Varsha : ప్రియుడితో వర్ష సీక్రెట్ చాటింగ్.. ప్రూఫ్స్ తో సహా అన్నీ బయటపెట్టేసిన ఇమ్మాన్యుయేల్

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: January 5, 2023 1:38 pm
Advertisement

Jabardasth Varsha : సుడిగాలి సుధీర్, రష్మీ జంట గురించి తెలుసు కదా. వాళ్లు ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. ఆన్ స్క్రీన్ మీద ఆ జంట కెమిస్ట్రీ మామూలుగా ఉండదు. రచ్చ రంబోలానే. సుధీర్, రష్మీ పెళ్లి చేసుకుంటే చూడాలని కొన్ని కోట్ల మంది అభిమానులు ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. అయితే.. సుధీర్, రష్మీ జంట తర్వాత అంత ఫేమస్ అయింది ఇమ్మాన్యుయేల్, వర్ష జంట. వీళ్లు కూడా జబర్దస్త్ కు చెందిన వాళ్లే. ఆ జంట తర్వాత ఈ జంటకు అంత క్రేజ్ వచ్చింది. కేవలం వర్ష వల్ల.. ఇమ్మాన్యుయేల్ కు అంత క్రేజ్ వచ్చింది.

Advertisement

ఇద్దరూ కలిసి చాలా స్కిట్లలో నటించడం వల్ల.. ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు వచ్చాయి.ఇమ్మాన్యుయేల్, వర్ష ఇద్దరూ బుల్లెట్ బాస్కర్ టీమ్ చేసే స్కిట్ లో చేస్తుంటారు. అయితే.. ఈ జంట మధ్య కూడా ఏదో ఉందంటూ చాలా రోజుల నుంచి పుకారు షికారు చేస్తోంది. ఏకంగా జబర్దస్త్ స్టేజ్ మీదనే ఇమ్మాన్యుయేల్ చాలా సార్లు వర్షకు ప్రపోజ్ కూడా చేశాడు. అయితే.. తాజాగా వర్షకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని.. తన బాయ్ ఫ్రెండ్ తో వర్ష చేసిన చాటింగ్ మొత్తాన్ని ఇమ్మాన్యుయేల్ బయటపెట్టేశాడు.

Jabardasth Varshaand emmanuel skit in jabardasth

Advertisement

Jabardasth Varsha : లవ్ టుడే కాన్సెప్ట్ తో రచ్చ చేసిన వర్ష, ఇమ్ము

కాకపోతే అది స్కిట్ లో బాగమే. తాజాగా లవ్ టుడే కాన్సెప్ట్ తో వర్ష, ఇమ్మాన్యుయేల్ రచ్చ చేశారు. దాన్నే స్కిట్ గా చేశారు. వర్ష ఫోన్ తీసుకొని అందులో వర్ష ఫోన్ లోని చాటింగ్ గురించి మొత్తం బయటపెట్టేశాడు. అది కూడా ఫోన్ పేలో చాట్ చేస్తోందంటూ చెప్పకొచ్చాడు. దీనికి సంబంధించిన స్కిట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి