Jabardasth Varsha Expresses Her Love on Emmanuel In Latest Promo
Jabardasth Vasha : ఇమాన్యుయేల్ వర్ష జోడి బుల్లితెరపై దాగుడుమూతలు ఆడుతుందన్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై కొన్ని కాలాల పాటు మనుగడ సాగించాలంటే ఇలాంటి దోబూచులాడాల్సిందే. ప్రేమ ఉందా? లేదా? ట్రాక్ నడిపిస్తున్నారా? లేదా? అన్నది తెలిసీ తెలియకుండా మ్యానేజ్ చేయాలి. అప్పుడు ఆ జోడి గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. వారికి క్రేజ్ పెరుగుతుంది. ఆ క్రేజ్, ఫాలోయింగ్‌ను ఎవరైనా సరే ఇష్టపడుతుంటారు. అందుకే బుల్లితెరపై మరీ రెచ్చిపోయి నటిస్తుంటారు. ఇమాన్యుయేల్ వర్షలు ఈ పాటికే చాలా ఎక్కువ చేశారు.. ఎక్కువగా రక్తి కట్టించారు.
అది చూసి చూసి ప్రేక్షకులకు వెగటు కూడా పుట్టేసింది. కానీ మరోసారి తాజాగా వీరిద్దరి అంశం చర్చల్లోకి వచ్చింది. ఒకప్పుడు రోజా కావాలనే వీరి ప్రేమ గురించి అడిగేది. ఇప్పుడు ఇంద్రజ అడుగుతోంది. ప్రోమోల కోసం మల్లెమాల టీం పడరాని పాట్లు పడుతోంది. ప్రోమో హైలెట్ అవ్వడం కోసం అలాంటి పిచ్చి ప్రశ్నలు వేయడం.. వాళ్లు కూడా ఏదో లైలా మజ్నులైనట్టుగా రియల్ లవర్స్ అయినట్టుగా బిల్డప్ ఇస్తుంటారు. ఇమాన్యుయేల్ ఎప్పుడైనా నిన్ను అనుమానించాడా? అనుమానిస్తే నీకు ఎలా అనిపిస్తుంది? అని వర్షని ఇంద్రజ అడుగుతుంది. ఎప్పుడూ అనుమానించలేదు..
Jabardasth Varsha Expresses Her Love on Emmanuel In Latest Promo
నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం ఇమాన్యుయేల్. బయట ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా కూడా.. నాకు ఇమాన్యుయేల్ అంటే ఇష్టం.. వెళ్లి మీ అమ్మకు చెప్పు కోడలు వస్తోంది అని తెగ ఓవర్ యాక్షన్ చేసేసింది వర్ష. దీనికి తగ్గట్టుగా ఎడిటింగ్ టీం రెచ్చిపోయింది. లవ్ సింబల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో రెచ్చిపోతుంటారు. తీరా ఎపిసోడ్ చూస్తే వేరేలా ఉంటుంది. బయటకు వచ్చి మాత్రం అదంతా స్క్రీన్, స్కిట్ కోసమే చేశామని అంటారు. ఇలా ఇంకెంత కాలం జనాలను మోసం చేస్తుంటారో వారికే తెలియాలి. వీళ్లు వేసే వేషాలను ఎవ్వరూ నమ్మడం లేదని వాళ్లకి తెలిసినా ఈ పిచ్చి చేష్టలు మాత్రం ఆపడం లేదు.
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
This website uses cookies.