Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి 14 మార్చి 2022, సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం ఎపిసోడ్ 256 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకికి కడుపు పండలేదు అని తెలుసుకొని జ్ఞానాంబ షాక్ అవుతుంది. ఈ చేతితో మనవడిని, మనవరాలిని ఎత్తుకునే అదృష్టం ఆ దేవుడు నాకు ఎప్పుడిస్తాడో అర్థం కావడం లేదు అంటూ బాధపడి జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో మల్లికకు మరో ప్లాన్ తట్టుతుంది. ఎలాగైనా జానకికి పిల్లలు పుట్టకుండా చేయాలని అనుకుంటుంది. దాని కోసం లీలావతికి ఫోన్ చేసి.. జుమాంజి డాక్టర్ పిల్లలు పుట్టకుండా మందులు ఇస్తాడా అని అడుగుతుంది.
జానకి కడుపే పండుకుండా చేయాలి. నేనే వారసుడిని కని పోలేరమ్మ చేతుల్లో పెట్టాలి. నేను వారసుడిని కంటాను కాబట్టి ఆ పోలేరమ్మతో చెడుగుడు ఆడుకోవచ్చు. వెంటనే ప్లాన్ అమలు చేయాలి అని చెబుతుంది. రేపే జుమాంజీ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. జానకిని కూడా తీసుకెళ్దాం అంటుంది మల్లిక. సరే.. దానికి కూడా మందులు ఇస్తాడు జుమాంజి అంటుంది లీలావతి. కట్ చేస్తే ఉదయం అవుతుంది. జానకి, రామా ఇద్దరినీ పిలిచి మాట్లాడుతుంది జ్ఞానాంబ.
మీరు పిల్లల విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకున్నారా? కావాలని ఇప్పుడే పిల్లలు వద్దని ఏమైనా ప్లాన్ వేసుకున్నారా అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో అదేం లేదని అంటాడు రామా. అయితే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్లి చెక్ చేయించుకోండి అంటుంది జ్ఞానాంబ.
ఇంతలో మల్లిక వచ్చి.. దానికి అంత బాధ ఎందుకు అత్తయ్య. మన ఊరికే జుమాంజి అనే డాక్టర్ వచ్చాడంట.. ఆయన దగ్గరికి ఇద్దరం వెళ్లి మందులు తీసుకుంటాం. నెల తిరిగే సరికి ఇద్దరికీ కడుపు పండుతుంది అని చెబుతుంది మల్లిక. దీంతో ఇద్దరూ వెళ్లి రండి అని అంటుంది జ్ఞానాంబ.
ఇంతలో లీలావతి వచ్చి తన కూతురుకు పండంటి బిడ్డ పుట్టడానికి కారణం కూడా ఆ జుమాంజి డాక్టరే అని చెబుతుంది లీలావతి. అటువంటివి ఇంకా నమ్ముతారా అని జానకి చెబుతుంది అయినా ఏం కాదు.. ఒకసారి వెళ్లి ఆయన ఇచ్చే మందులు వేసుకో అంటుంది జ్ఞానాంబ.
దీంతో జానకిని తీసుకొని లీలావతి, మల్లిక.. డాక్టర్ జుమాంజి దగ్గరికి వెళ్తారు. వాళ్లను బయటే ఉంచి.. లోపలికి వెళ్లి అందులో జానకి అనే అమ్మాయికి శాశ్వతంగా పిల్లలు పుట్టకుండా చేయాలని చెబుతుంది. దీంతో సరే అంటాడు డాక్టర్ జుమాంజి.
Janaki Kalaganaledu : జానకికి మందులు ఇచ్చిన డాక్టర్ జుమాంజి
ఇద్దరినీ తీసుకొని లోపలికి వెళ్తుంది. ఈ అమ్మాయి జానకి.. నేను చెప్పాను కదా. ఈ అమ్మాయి మల్లిక.. అంటుంది. మా అమ్మాయి లాగే వీళ్లకు కూడా పిల్లలు పుట్టే మందులను ఇవ్వండి అంటుంది లీలావతి. దీంతో మందులను ఓ పేపర్ లో పెట్టి జానకికి ఇస్తాడు డాక్టర్.
దీంతో ఈ మందులను దేనితో తయారు చేశారు అని అడుగుతుంది జానకి. దీంతో ఇది మా పూర్వీకుల వైద్యం చెప్పకూడదు అని అంటాడు. దీంతో ఇందులో వాడిన ఆయుర్వేద మూలికలు ఏంటి అని అడుగుతుంది జానకి. దీంతో ఏదేదో చెబుతాడు డాక్టర్.
ఆ తర్వాత మందులు తీసుకొని బయటికి వస్తారు. ఇంటికి వెళ్దాం పదా అని అంటుంది మల్లిక. దీంతో నాకు కొంచెం పని ఉంది. నేను బయటికి వెళ్లి వస్తాను.. మీరు ఇంటికి వెళ్లండి అని చెబుతుంది జానకి. కట్ చేస్తే వెన్నెల నిశ్చితార్థానికి ముహూర్తం పెడతారు.
ఎల్లుండి మంచి ముహూర్తం ఉందని అమ్మ చెప్పిందని గోవిందరాజు చెబుతాడు. దీంతో సరే అంటుంది జ్ఞానాంబ. ఇంతలో మల్లిక వస్తుంది. ఎప్పుడొచ్చావు. మందులు తెచ్చుకున్నారా అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో తెచ్చుకున్నాం అంటుంది మల్లిక.
మరి జానకి ఏది అని అడుగుతుంది జ్ఞానాంబ. ఏమో నాకు తెలియదు అత్తయ్య గారు. ఇద్దరం మందులు తీసుకొని బయటికి రాగానే.. నాకు పని ఉంది నువ్వు వెళ్లు అని చెప్పింది అంటుంది మల్లిక. అయినా తనకు పెత్తనాలు, షికార్లు ఎక్కువే కదా అంటుంది మల్లిక. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.