janaki kalaganaledu 09 may 2022 full episode
Janaki Kalaganaledu 9 May Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. జానకి కలగనలేదు సీరియల్ 9 మే 2022, సోమవారం ఎపిసోడ్ 296 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రామా సంతకాలు పెట్టిన డాక్యుమెంట్ తీసుకొని రామాకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతాడు కన్నబాబు. మరోవైపు రాత్రి పూట వీళ్లు ఇద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు. ఈసారి అయినా రెడ్ హ్యాండెడ్ గా వాళ్లను పోలేరమ్మకు పట్టిస్తా అని అనుకొని ఇంటి వెనక్కి వస్తుంది. మీ కోసం ఈ మల్లిక పోలీస్ కుక్కలా ఇక్కడే ఎదురు చూస్తుంది రండి అని అనుకుంటుంది మల్లిక. వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో బండి సౌండ్ వినొస్తుంది మల్లికకు. అప్పుడే బైక్ మీద జానకి, రామా వస్తారు.
janaki kalaganaledu 09 may 2022 full episode
మనం వెళ్లి పెద్ద పులి పోలేరమ్మను పిలుచుకొద్దాం అని అనుకొని వెళ్లి జ్ఞానాంబను తీసుకొని వెనుక గోడ దగ్గరికి తీసుకొని వస్తుంది. జానకి, రామా ఇద్దరూ అర్ధరాత్రి గోడ దూకి వస్తున్నారు. రోజు అర్ధరాత్రి బయటికి వెళ్తున్నారు అని చెబుతుంది. వాళ్లు దొంగచాటుగా గోడదూకి వెళ్లడం చూస్తుంటే ఏదో గూడుపుఠాణి ఉందని నాకు డౌట్ గా ఉంది. వాళ్లు ఇద్దరూ ఇప్పుడు గోడ దూకడం మీరే చూస్తారు అంటుంది మల్లిక. దీంతో జ్ఞానాంబకు ఏం అర్థం కాదు. వాళ్లు ఇంకా గోడ దూకడం లేదు ఏంటి అని టెన్షన్ పడుతుంటుంది జ్ఞానాంబ.
ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేశావనుకో అప్పుడు చెప్తా నీ సంగతి అని అంటుంది జ్ఞానాంబ. వాళ్లు రాకపోయేసరికి.. జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. గోడ దూకకుండా.. మెయిల్ డోర్ నుంచి వెళ్లడం ఎందుకు అని జానకిని రామా అడుగుతాడు.
మల్లికకు మన గురించి డౌట్ వచ్చింది అని అంటుంది. అందుకే.. గోడ దూకి కాకుండా.. ఇలా మెయిన్ డోర్ నుంచి వెళ్దాం అంటుంది. కానీ.. జ్ఞానాంబ, మల్లిక ఇద్దరూ వాళ్లను చూస్తారు. రామా అని పిలుస్తుంది జ్ఞానాంబ. వీళ్లు ప్లాన్ తిరిగేశారా అని అనుకుంటుంది మల్లిక.
అమ్మ.. చిన్న పని ఉండి బయటికి వెళ్లి వస్తున్నాం అమ్మ అంటాడు రామా. దీంతో అడగండి అత్తయ్య గారు అడగండి.. ఇప్పుడు టైమ్ 12 అయింది. మీకు చెప్పకుండా వెళ్లివచ్చేంత రహస్యాలు ఏమున్నాయో అడగండి అని అంటుంది మల్లిక. దీంతో ఖార్ఖానాకు సంబంధించిన పని గురించి వెళ్లి వస్తున్నాం అంటాడు రామా.
ఖార్ఖానాకు సంబంధించిన పని అది. నాకు లెక్కలు సరిగ్గా తెలియదు కదా.. అందుకే జానకి గారిని తీసుకొని వెళ్లి వచ్చా అంటాడు రామా. దీంతో మల్లిక షాక్ అవుతుంది. సరే.. మీరు లోపలికి వెళ్లండి అంటుంది జ్ఞానాంబ. తర్వాత ఉదయం అవుతుంది. జానకి దగ్గరికి వెళ్తుంది జ్ఞానాంబ.
రాత్రి నాకొడుకును ఎక్కడికి తీసుకెళ్లావు అని అడుగుతుంది జ్ఞానాంబ. అంత అర్ధరాత్రి వేళ వాడిని ఎక్కడికి తీసుకెళ్లావు. నా కొడుకు అటు షాపులో ఇటు ఖార్ఖానాలో పని చేస్తాడు. వాడిని రాత్రి నిద్రకూడా పోనివ్వవా. అసలు ఆ టైమ్ లో వాడిని ఎక్కడికి తీసుకెళ్లావు అని నిలదీస్తుంది.
దీంతో జానకికి ఏం చెప్పాలో అర్థం కాదు. రాత్రి వాడు నాతో చెప్పింది అబద్ధం అని నాకు తెలుసు. అయినా సరే.. నేను ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసా. మల్లిక ముందు నా కొడుకు లోకువ కాకూడదని అంటుంది జ్ఞానాంబ. మీ అన్న నీ చదువు గురించి చెప్పిన అబద్ధం వల్లే కదా.. ఈరోజు నా కొడుకుకు, నా కుటుంబానికి ఈ గతి పట్టింది.
నా కొడుకు విషయంలో నేను ఏమాత్రం వెనకడుగు వేయను. నా కొడును ఇంకోసారి ఇలా బయటికి తీసుకెళ్తే అస్సలు బాగుండదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది జ్ఞానాంబ. దీంతో ఏం చేయాలో జానకికి అర్థం కాదు. మీరు రెస్ట్ లేకుండా ఎందుకు ఇలా పని చేస్తున్నారు అని అడుగుతుంది జానకి.
అబ్బే ఏం పర్లేదండి అంటాడు రామా. దీంతో మీరు ఇలా ఇబ్బంది పడటానికి వీలు లేదు అంటుంది జానకి. అందుకే ఈరోజు నుంచి కోచింగ్ కు నేను ఒక్కదాన్నే వెళ్తాను అంటుంది జానకి. నాకూడా మీరు రావద్దు అంటుంది జానకి. ఏమండి.. మీరు ఒక్కరే వెళ్తారా అంటాడు రామా.
షాపు నుంచి ఇంటికి రాగానే మీరు రెస్ట్ తీసుకోండి అంటుంది జానకి. కానీ.. మిమ్మల్ని అంత దూరం నేను ఎలా పంపిస్తాను అంటాడు రామా. అయితే.. నాది ఒక షరతు. ప్రతి రోజు మీరు మధ్యాహ్నం ఒక రెండు గంటలు షాపులో రెస్ట్ తీసుకోండి. నేను అప్పుడు షాపులో పని చేస్తాను అంటుంది జానకి.
నా షరుతుకు ఒప్పుకుంటేనే నాతో మిమ్మల్ని రానిస్తాను అంటుంది జానకి. దీంతో సరే అంటాడు రామా. కట్ చేస్తే జానకి షాపునకు వచ్చి.. రామాకు లంచ్ బాక్స్ ఇచ్చి మీరు ఇక రెస్ట్ తీసుకోండి అంటుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Sachin Tendulkar | క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్, అతని ఆటలతో కాకుండా ఇప్పుడు ప్రేమలో…
Bala Krishna | నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న చిత్రం అఖండ 2. బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని అత్యంత…
Shilpa Shirodkar | సూపర్ స్టార్ మహేశ్ బాబు మరదలు, బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ కు చెందిన కారును ఢీకొట్టిన…
Antibiotics : ప్రస్తుత కాలంలో ప్రజలు ఏ చిన్న అనారోగ్య సమస్యకు గురైన సరే ఇలాంటి బయటికి వినియోగం విపరీతంగా…
Potato Chips : సాధారణంగా చాలామంది కూడా పొటాటో చిప్స్ అంటే ఇష్టపడతారు.పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు. పిల్లలైతే…
Monsoon Season : వర్షాకాలంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదు.కొన్ని ఆహారపు అలవాట్ల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.…
coolie movie Review : భారీ అంచనాల మధ్య రజనీకాంత్ , లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న కూలీ చిత్రం…
War 2 Movie Review : ప్రస్తుతం భారతీయ సినిమా పరిశ్రమ కొత్తదనాన్ని ఆవిష్కరిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో దూసుకెళ్తోంది. ఈ…
This website uses cookies.