
janaki kalaganaledu 1 february 2022 full episode
Janaki Kalaganaledu 1 Feb Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 1 ఫిబ్రవరి, 2022 మంగళవారం ఎపిసోడ్ 227 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎస్పీ గారు నన్ను పంపించారని సీఐ జ్ఞానాంబ ఇంటికి వస్తాడు. జానకిని ఐపీఎస్ చదివించడం కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. మీరు ఒప్పుకుంటే వెంటనే జానకిని ఐపీఎస్ చదివిస్తాం. కమిషనర్ గారు కూడా ఇదే విషయం చెప్పారు. తను పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉంటే ఎంతో సమాజ సేవ చేయొచ్చు. ఈ ఊరి ప్రజలను కాపాడి తను ఎంతో సాయం చేసింది. ఇప్పటికైనా మీ అభిప్రాయం చెప్పండి అంటాడు పోలీస్. దీంతో జానకి ఏదో చెప్పబోతుంది. ఇంతలో జానకి నువ్వు ఆగు. నేను చెబుతాను అంటుంది జ్ఞానాంబ. ఎస్ఐ గారు.. మీరు ఇప్పుడే కదా చెప్పారు. మేము ఈ విషయం గురించి ఆలోచించుకొని త్వరలోనే మా అభిప్రాయాన్ని తెలియజేస్తాం అంటుంది జ్ఞానాంబ.
janaki kalaganaledu 1 february 2022 full episode
దీంతో మల్లిక షాక్ అవుతుంది. ఇదేందబ్బా ఇది. ఇలా చేసిందేంటి పోలేరమ్మ. కొంపదీసి జానకి ఐపీఎస్ చదవడానికి ఈ పోలేరమ్మ ఒప్పుకుంటుందా ఏంటి అని అనుకుంటుంది. అది కాదు జ్ఞానాంబ గారు.. బాగా చదువుకున్న వ్యక్తి మీ ఇంట్లో కూడా ఉండే మీకు కూడా గర్వ కారణమే కదా. మీరు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు అంటాడు. అదే సార్.. మేము అందరం ఒకసారి కూర్చొని మాట్లాడుకున్నాక మీకు అసలు విషయం చెబుతాం అంటుంది. కానీ.. జానకి గారు ఐపీఎస్ కావడానికి మీరు ఒప్పుకుంటారని.. అదే అభిప్రాయాన్ని మీరు చెబుతారని మేము ఎదురుచూస్తూ ఉంటాం. వస్తాం జానకి గారు అని అంటారు పోలీస్. రామా గారు మీ భార్య ఐపీఎస్ అయి దేశానికి సేవ చేస్తే దేశానికే కాదు.. మీకు, మీ కుటుంబానికి కూడా గర్వంగా ఉంటుంది అని చెప్పి పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోతారు.
మరోవైపు జానకికి ప్రసాదం తీసుకొచ్చి ఇస్తాడు రామా. గుడికి వెళ్లారా అని అడుగుతుంది. అవును అంటాడు రామా. ముందు చెబితే నేను కూడా వచ్చేదాన్ని కదా అంటుంది జానకి. మీకోసమే వెళ్లాను అండి.. అంటాడు. ఎందుకు అంటుంది జానకి. దీంతో అమ్మ మీరు ఐపీఎస్ చదవడానికి ఒప్పుకోవాలని దేవుడిని మొక్కుకున్నాను అంటాడు.
వద్దు రామా గారు.. దయచేసి వద్దు అండి. అత్తయ్య గారు ఒప్పుకోరు. ఇంట్లో నావల్ల గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు అంటుంది జానకి. మీరు ఐపీఎస్ అవడం ఖాయం. మీరు ఇలా ఇలా తుపాకి తిప్పుకుంటా యూనిఫాం వేసుకొని ఇంటికి వస్తారు.. మీరు చూస్తూ ఉండండి అంటాడు రామా.
కట్ చేస్తే జానకి ఐపీఎస్ అయి ఇంటికి తిరిగి వస్తుంది. యూనిఫామ్ వేసుకొని ఇంటికి వస్తుంది. తనను చూసి అందరరూ షాక్ అవుతారు. మల్లిక అని పిలుస్తుంది. జానకిని పోలీస్ యూనిఫామ్ లో చూసి షాక్ అవుతుంది. తట్టుకోలేకపోతుంది.
ఏంటి నిన్ను నిలదీసేసరికి నీళ్లు నములుతున్నావేంటి. ఈ మల్లిక అంటే భయం మొదలైందా.. చెప్పు.. ఏం నేరం మీద నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చావు చెప్పు అని అడుగుతుంది మల్లిక. దీంతో ఖార్ఖానాలో పూతరేకులు తయారు చేసే నెయ్యిలో నువ్వు మందు కలిపావు. దాని వల్ల.. 10 మంది ఆసుపత్రి పాలు అయ్యారు. ఆ నేరం మీద నిన్ను అరెస్ట్ చేస్తున్నాను అంటుంది జానకి.
దీంతో మల్లిక అస్సలు వినదు. నువ్వు స్టేషన్ కు వస్తావా రావా.. అని బెదిరిస్తుంది జానకి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిందే కాకుండా నాకు లంచం ఇవ్వాలని చూస్తావా? నిన్ను అంటూ తన గన్ తో కాల్చబోతుంది జానకి. వద్దు వద్దు నన్ను చంపొద్దు జానకి అంటూ కలగంటుంది మల్లిక.
విష్ణు.. మల్లికను లేపుతాడు. దీంతో గన్.. జానకి అంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది. అంటే ఇదంతా కలా అని అనుకుంటుంది తర్వాత. మరోవైపు జానకి గురించే ఆలోచిస్తూ ఉంటుంది జ్ఞానాంబ. ఏం చేయాలో తనకు అర్థం కాదు. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు.
ఇంతలో గోవిందరాజు వచ్చి.. ఏ విషయం గురించి నువ్వు ఆలోచిస్తున్నావో నాకు తెలుసు జ్ఞానం అంటాడు గోవిందరాజు. జానకి ఐపీఎస్ చదువు గురించి సీఐ గారు చెప్పిన విషయం గురించే కదా. ఏ నిర్ణయం తీసుకున్నావు అని అడుగుతాడు. దీంతో ఏం చెప్పాలో జ్ఞానాంబకు అర్థం కాదు.
ఇంతలోనే రామా, జానకి ఇద్దరూ జ్ఞానాంబ దగ్గరికి వస్తారు. నీ చదువు గురించి నువ్వేమనుకుంటున్నావు. నీ నిర్ణయం ఏంటి అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో మీ ఇష్టమే నా ఇష్టం అత్తయ్య గారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఒఫ్పుకుంటా అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.