Home » Entertainment » Janaki Kalaganaledu 1 March 2022 Full Episode
Entertainment

Janaki Kalaganaledu 1 March Today Episode : ఖార్ఖానాలో జానకి, రామా రొమాన్స్.. వెన్నెలను బుక్ చేయడం కోసం మల్లిక ప్రయత్నాలు.. ఇంతలో జానకికి మరో షాక్

Authored By
Varun G
The Telugu News | Published on: March 1, 2022, 11:30 am
Advertisement

Janaki Kalaganaledu 1 March Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 1 మార్చి 2022, మంగళవారం ఎపిసోడ్ 247 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి, రామా ఇద్దరూ కలిసి ఖార్ఖానాలో కేకులు తయారు చేస్తూ ఉంటారు. మీరు అలా చూడకండి. మీ చూపులతో నా గుండెల్లో మంటపుట్టిస్తున్నారు అంటాడు రామా. అవునా.. అంటూ సిగ్గు పడుతుంది జానకి. అబ్బ.. మీరు బయటికి వెళ్లిపోండి.. పని అవ్వడం లేదు అంటుంది జానకి. మీరు ఇంటికి వెళ్లిపోండి అంటుంది. దీంతో మీ మాటలు మాత్రం వెళ్లిపో అంటున్నాయి. కళ్లు మాత్రం ఇక్కడే ఉండమని చెబుతున్నాయి అంటాడు రామా. కళ్లలోకి కళ్లు పెట్టి చూసి ఈ లోకాన్నే మరిచిపోమని చెప్పాయి అంటాడు రామా.

Advertisement

janaki kalaganaledu 1 march 2022 full episode

మీరు డిస్టర్బ్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్లలేదనుకోండి.. నా చేతుల్లో ఉన్న పిండి మీ మొహానికి అంటుకుంటుంది అంటుంది జానకి. దీంతో తన చేతుల్లో ఉన్న పిండిని తీసుకొని తన ముఖానికి పూసుకుంటాడు రామా. తన చేతులు పట్టుకొని వదలడు రామా. దీంతో తన చేయిని లాగేసుకుంటుంది జానకి. దీంతో రండి మీరు అని చెప్పి రామాను బయటికి తీసుకెళ్లి డోర్ క్లోజ్ చేసి లోపలికి వచ్చేస్తుంది. ముందు కేకుల తయారీ పూర్తి కావాలి అంటుంది జానకి. తలుపు తీయండి అని అన్నా కూడా జానకి వినదు. దీంతో అక్కడి నుంచి ఎక్కడికో వెళ్లినట్టుగా యాక్షన్ చేస్తాడు. పిలిచినా పలకడు.

Advertisement

దీంతో ఎక్కడికి వెళ్లాడు అని అనుకుంటుంది జానకి. రామా గారు అని పిలుస్తుంది.. కానీ.. కనిపించడు. అప్పుడు వస్తాడు రామా. ఏంటి మీకు తమాషాగా ఉందా. నాతో ఆటలాడుకుంటున్నారా.. మీరు కనబడపోయేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అంటుంది జానకి.

కట్ చేస్తే తెల్లారుతుంది. ఉదయం నుంచి వెన్నెల ఫోన్ లోనే మాట్లాడుతూ ఉండటాన్ని చూసి మల్లిక షాక్ అవుతుంది. తన దగ్గరికి వెళ్తుంది. తెగ నవ్వుతూ మాట్లాడుతున్నావు. ఎవరు ఫోన్ లో అని అడుగుతుంది. దీంతో నా ఫ్రెండ్ అంటుంది వెన్నెల.

Advertisement

కానీ నీ విషయంలో నాకు ఒక విషయం అర్థం కావడం లేదు వెన్నెల అంటుంది మల్లిక. మొదటిసారి నీకు సంబంధం చూసినప్పుడు ఏడుస్తూ కూర్చున్నావు. ప్రేమిస్తే పెద్దవాళ్లను ఒప్పించాలి.. కుదరకపోతే ఎదిరించాలి. అందుకని నీ ప్రేమ విషయం మీ అమ్మకు నేను చెబుతాను అంటుంది.

Janaki Kalaganaledu 1 March Today Episode : జ్ఞానాంబ ముందు మరోసారి అడ్డంగా బుక్ అయిన మల్లిక

అత్తయ్య గారు.. అంటూ ఆవేశపడి జ్ఞానాంబను పిలుస్తుంది. దీంతో ఏంటి మల్లిక అంటుంది. వెన్నెల ప్రేమ అంటూ ఏదో చెప్పబోయి.. ఎందుకు నాకు మళ్లీ ఈ గొడవ అనుకొని టాపిక్ మారుస్తుంది. వెన్నెలకు ఈ పెళ్లి ఇష్టమో కాదో అడగాలి కదా అంటుంది మల్లిక.

నువ్వేం కంగారు పడకు. మీ అమ్మ ముందు ధైర్యంగా చెప్పు అంటుంది మల్లిక. దీంతో నాకు ఈ పెళ్లి ఇష్టమే అంటుంది వెన్నెల. ఏయ్ ఆపు.. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు తెలుసులే అంటుంది జ్ఞానాంబ. మల్లికకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ.

దీంతో అసలు ఈ వెన్నెల ఏంటి.. వాళ్ల అమ్మ ముందు మాట తిరగేసింది. అసలు ఆ పిల్లకు నిజంగా పెళ్లి ఇష్టమేనా. ముందు ఆ రూట్ లో నరుక్కురావాలి.. నరుక్కొస్తా అని అనుకుంటుంది మల్లిక. మరోవైపు కేకులన్నీ తయారు చేయడం అయిపోతుంది. జానకి గారు టీ తీసుకోండి అంటాడు.

Advertisement

ఎక్కడిది టీ అంటుంది. మీకెందుకు అండి శ్రమ అంటుంది జానకి. ఏం కాదు తాగండి అంటాడు రామా. చాయ్ బాగుంది అంటుంది జానకి. అద్భుతం.. అంటుంది. ఇంతలో జ్ఞానాంబ.. ఖార్ఖానాకు వస్తుంది. జానకి, రామా అని పిలుస్తుంది. దీంతో అత్తయ్య గారు వచ్చినట్టున్నారు అని అనుకొని కేకులను తీసుకొని బయటికి వస్తారు.

కేకులు తయారయ్యాయి అత్తయ్య గారు అంటుంది జానకి. టైమ్ తక్కువగా ఉంది కదా.. చేస్తారో చేయరో అని అనుకున్నా.. అని కస్టమర్ అంటాడు. జానకిని కూడా మెచ్చుకుంటాడు. మీ కొడుకు కోడలు ఈ వ్యాపారాన్ని ఇంకో మెట్టుకు తీసుకెళ్తారు అని చెప్పి కేకులు తీసుకొని వెళ్తాడు.

ఆ తర్వాత జ్ఞానాంబ కూడా మన మాట నిలబెట్టావు.. శెభాష్ అంటుంది జ్ఞానాంబ. వెన్నెల కోసం నువ్వు చూసిన సంబంధం అత్తయ్య గారికి నచ్చిందంట అని చెబుతుంది జ్ఞానాంబ. కాకపోతే మొన్న జరిగినట్టు మళ్లీ జరగకుండా జాగ్రత్తగా ఉండమని అత్తయ్య గారు పదే పదే చెప్పారట.

ఈసారి ఎలాంటి సమస్యలు తలెత్తకూడదని అత్తయ్య గారు హెచ్చరించారట. జానకి చూశాక.. అలాంటి పరిస్థితులు.. పొరపాట్లు రావని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదని నేను మీ మామయ్య గారికి చెప్పాను అంటుంది జ్ఞానాంబ. మన ఇంటి పరువు పోయే సంబంధం నువ్వు చూడవు కదా.. అంటుంది జ్ఞానాంబ.

Advertisement

వెన్నెల నిశ్చితార్థం అక్కడే జరిపించాలని అత్తయ్య గారు పట్టుబట్టారట అంటుంది జ్ఞానాంబ. దీంతో క్షమించండి అత్తయ్య గారు. మీరు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కానీ.. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తోంది అని అనుకుంటుంది జానకి.

ఒకసారి దిలీప్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇంటికి వచ్చి ఒకసారి వెన్నెలను చూసుకోమ్మని చెప్పు అంటుంది జ్ఞానాంబ. సరే అంటుంది జానకి. జ్ఞానాంబ వెళ్లిపోయాక.. మీరు పక్కనుంటే చాలండి.. ఏదైనా చేసేయగలను అనిపిస్తుంది అంటుంది జానకి. అవునా అంటాడు రామా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి