Home » Entertainment » Janaki Kalaganaledu 10 December 2021 Full Episode
Entertainment

Janaki Kalaganaledu 10 Dec Today Episode : రామాకు లిప్ కిస్ పెట్టి రెచ్చిపోయిన జానకి.. ఫస్ట్ నైట్ జరుగుతుందా? మరోవైపు జానకిని బుక్ చేసేందుకు మల్లిక భారీ స్కెచ్

Authored By
Varun G
The Telugu News | Updated on: December 10, 2021 12:12 pm
Advertisement

Janaki Kalaganaledu 10 Dec Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 డిసెంబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ 190 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాజమండ్రి వెళ్లి కేకులు నేర్చుకొని వస్తుంది జానకి అని చెబుతాడు రామా. దీంతో జ్ఞానాంబ వద్దు అంటుంది. జానకిని పంపించడం నాకు అస్సలు ఇష్టం లేదు అంటుంది. కానీ.. నువ్వు బాధపడుతుంటే కాదనలేక పంపిస్తున్నాను అంటుంది జ్ఞానాంబ. దీంతో అందరూ ఫుల్ ఖుషీ అవుతారు. మా మంచి అమ్మ.. అని చెప్పి వెళ్లొస్తాం అమ్మా అంటాడు రామా. వద్దంటే కోడికూర మాడిపోయినట్టు మొహాలు పెట్టారు. వెళ్లండి అనగానే.. వెంటనే గులాబ్ జామూన్ మొహాలు పెట్టారు.. ఈ కేకుల ముసుగులో ఏదో పెద్ద స్కామ్ ఉంది చెప్తా.. అని తనలో తానే అనుకుంటుంది మల్లిక. అత్తయ్య గారు.. మన జానకి కేకులు నేర్చుకోవడానికి వెళ్తున్న షాప్ అడ్రస్ చెబుతారా కొంచెం అని అడుగుతుంది. దీంతో అల్మారాలో అడ్రస్ కాగితం ఉంది వెళ్లి తీసుకో అంటుంది జ్ఞానాంబ.

Advertisement

janaki kalaganaledu 10 december 2021 full episode

జానకి వెళ్లు వెళ్లు.. నీ వెనకే నేను కూడా. నిను వీడని నీడలా వస్తున్నా.. అని అనుకుంటుంది. జానకి నేను అన్నం తినకుండా అయినా ఉంటానేమో కానీ.. నిన్ను మాత్రం వదలను అని అనుకుంటూ ఆటోలో రాజమండ్రి బయలుదేరుతుంది మల్లిక. తోటి కోడలు మీద పై చేయి సాధించాల్సిందే. నేను కనిపెట్టేస్తాను అనుకుంటుంది. మరోవైపు జానకి, రామా.. ఇద్దరూ బైక్ మీద వెళ్తుంటారు. మీకు ఇక ఎటువంటి అడ్డంకులు లేవండి అని అంటాడు రామా. ఏమండి.. ఒకవేళ మీ అమ్మగారు నేను కేకులు ఎలా నేర్చుకుంటున్నానో అని షాపులో అత్తయ్య ఎంక్వయిరీ చేస్తే ఎలా అని అడుగుతుంది జానకి. ఏం కాదు లేండి. నేను షాపు అతడితో మాట్లాడాను.. మీరేం టెన్షన్ పడకండి అంటాడు రామా. మరోవైపు మల్లిక.. జ్ఞానాంబ ఇచ్చిన షాపు అడ్రస్ కు వస్తుంది. ఒకసారి జానకిని పిలుస్తారా అని అడుగుతుంది. దీంతో జానకిని పిలుస్తాడు షాపు అతడు. జానకిని చూసి షాక్ అవుతుంది.

Advertisement

జానకి అంటే.. ఎవరో ముసలావిడ వస్తుంది. ఈమె కాదు.. ఇంకో జానకి. ఆత్రేయపురం నుంచి వచ్చే జానకి అని అంటే.. మా కేకుల తయారీ షాపులో ఈ జానకి తప్ప ఇంకెవరూ లేరు అంటాడు షాపు అతడు. దీంతో మల్లికకు ఫుల్ సంతోషం వేస్తుంది. మరోవైపు ఆత్రేయపురంలో కేకుల పోటీ ఉందని ఓ వ్యక్తి పాంప్లెట్లు పంచుతుంటాడు.

Janaki Kalaganaledu 10 Dec Today Episode : పల్లవికి మంచి సంబంధం చూసిన గోవిందరాజు

అబ్బ.. ఏం దొరికావు జానకి.. ఈ కేకుల పోటీలో నిన్ను నిలబెట్టి.. పోలేరమ్మ ముందు అడ్డంగా బుక్ చేస్తాను.. అని అనుకుంటుంది మల్లిక. మరోవైపు పల్లవి తన అమ్మమ్మ ఇంటి నుంచి వస్తుంది. జ్ఞానాంబ తనకు జెడ వేస్తుంది. ఇంతలో గోవిందరాజు వస్తాడు. ఏమ్మా.. వెన్నెల ఎప్పుడు వచ్చావు అంటాడు.

Advertisement

తర్వాత జ్ఞానాంబ దగ్గర కూర్చొని మాట్లాడుతాడు. రామచంద్రాపురంలో సత్యనారాయణరాజు గారు తెలుసు కదా. ఏదో ఫంక్షన్ లో మన వెన్నెలను చూశారట.. వాళ్ల అబ్బాయి కోసం అడుగుతున్నారు.. అని చెబుతాడు. ఎలాగూ మన వెన్నెల చదువు కూడా అయిపోతుంది.. అని చెబుతాడు.

ఆడపిల్లను ఇచ్చేటప్పుడు ఎంత ఆస్తి ఉందని కాదు చూడటం.. అబ్బాయి గుణగణాలను చూడాలి అని చెబుతుంది జ్ఞానాంబ. అబ్బాయి గురించి విచారించండి.. మంచి అబ్బాయి అయితే ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు.. అంటుంది జ్ఞానాంబ.

ఇంతలో మల్లిక వచ్చి.. అత్తయ్య గారు అంటూ మల్లిక వచ్చి.. కేకుల పోటీ గురించి చెబుతుంది. జానకిని ఈ కేకుల పోటీకి పంపిద్దాం అంటుంది మల్లిక. సాధారణంగా నువ్వు ఇంట్లో పనులే చేయవు.. అలాంటిది ఇంత మంచి పని చేయడం ఏంటా అని ఆశ్చర్యంగా ఉంది అంటుంది జ్ఞానాంబ. నాకైతే అనుమానంగానూ ఉంది జ్ఞానాంబ అంటాడు గోవిందరాజు.

జానకి ఈ కేకుల పోటీలో గెలిస్తే తనకు మంచి పేరు వస్తుంది. మన షాపునకు మంచి పేరు వస్తుంది.. అనగానే సర్లే.. నువ్వు ఏ చెప్పినా.. షాపునకు మంచి పేరు వచ్చే విషయం కాబట్టి.. రేపు జానకిని తీసుకెళ్లి పోటీలకు వెళ్దాం లే అంటుంది జ్ఞానాంబ.

Advertisement

ఉదయమే రామా.. షాపులో స్వీట్లు బాక్స్ లో పెడుతుంటాడు. రజినీ కాంత్ వచ్చి అన్న.. ఏదో మొక్కకు అంటుకట్టినట్టు.. అంత శ్రద్ధగా.. అంత ప్రేమగా స్వీట్లు బాక్స్ లో పెడుతున్నావు ఎవరికి అని అడుగుతాడు. మీ వదినకురా.. అంటాడు.

ఆ బాక్స్ తీసుకెళ్లి వదినకు ఇవ్వు అంటాడు రామా. మరోవైపు ఇంకో వ్యక్తి స్వీటు బాక్స్ తీసుకుంటాడు. అందులో ఏదో కలపమంటే కలిపా అంటాడు. అయితే.. రజినీ పరిగెత్తుతూ స్వీట్ బాక్స్ ను కిందపడేస్తాడు. ఆ వ్యక్తి బాక్స్ కూడా కిందపడటంతో.. బాక్సులు మారిపోతాయి.

రామా అన్నయ్య స్వీట్లు ఇచ్చాడని జానకికి ఇవ్వడానికి వస్తాడు రజినీకాంత్. కానీ.. జానకి లేదు అని చికిత చెబుతుంది. ఆ స్వీట్లు తిన్న జానకి రెచ్చిపోతుంది. రాత్రి పూట రామా ముఖంపై ముద్దులతో వర్షం కురిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి