Janaki Kalaganaledu 10 March Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 మార్చి 2022 గురువారం ఎపిసోడ్ 254 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అత్తయ్య గారు ఇఫ్పుడే కదా ఇంటికి వెళ్లింది.. అంతలోనే రమ్మనడం ఏంటి.. కారణం ఏమై ఉంటుంది అని రామాతో అంటుంది జానకి. దీంతో నాకు కూడా అర్థం కావడం లేదండి అంటాడు రామా. మరోవైపు మల్లికకు ఏం చేయాలో అర్థం కాదు. ఫోన్ చేసి అరగంట అవుతోంది లీలావతి పెద్దమ్మ ఇంకా రావడం లేదేంటి అని అనుకుంటుంది. ఇంతలో లీలావతి వస్తుంది. ఏమైంది అని అడుగుతుంది లీలావతి. దీంతో నిన్న గొడవ అయింది.. ఇవాళ జానకికి కడుపు అయింది అంటుంది. దీంతో అవును.. మీ అత్తయ్య కూడా స్వీటు ఇచ్చింది అంటుంది లీలావతి.
దీంతో.. జుమాంజీ డాక్టర్ దగ్గరికి వెళ్లి అర్జెంట్ గా నేను మగపిల్లాడిని కనాలి అంటుంది మల్లిక. దానికి 10 వేలు ఖర్చు అవుతుంది అంటుంది లీలావతి. సరే.. వెళ్దాం పదా అంటుంది. మరోవైపు జానకి, రామా ఇద్దరూ జ్ఞానాంబ దగ్గరికి వస్తారు. ఏమైందో అని అనుకుంటారు. రా జానకి నీకోసమే వెయిట్ చేస్తున్నాను. వేవిళ్లు వస్తే.. పులుపు తినాలని అనిపిస్తుంది. ఈ చింతకాయలు తిను అంటంది జ్ఞానాంబ. ఇంతలో మల్లిక వచ్చి కంగ్రాట్స్ జానకి. పండంటి బిడ్డ నీ కడుపున పుట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటుంది మల్లిక. జానకి.. మళ్లీ చెబుతున్నాను. నా జీవితంలో ఇంత ఆనందాన్ని నేను ఇప్పటి వరకు చూడలేదు అంటుంది. ఇంతలో రామా.. అమ్మ నీకో విషయం చెప్పాలి అంటాడు.
ఏంటి చెప్పు అని అనేలోపే గోవిందరాజు వచ్చి కామాక్షికి తెలిసిన డాక్టర్ తో మాట్లాడా. 12 గంటలకు రమ్మన్నాడు అంటాడు. దీంతో జానకి వెళ్లి త్వరగా రెడీ అవ్వు అంటుంది జ్ఞానాంబ. ఇంతలో కామాక్షి ఫోన్ చేయడంతో ఫోన్ తీసుకొని అక్కడి నుంచి వెళ్తుంది.
దీంతో రామా.. నువ్వురా.. మనం గుడికి వెళ్లి అక్కడ భోజన ఏర్పాట్లు చూడాలి అంటాడు గోవిందరాజు. దీంతో నాన్నా నీకో విషయం చెప్పాలి అంటాడు. అయినా గోవిందరాజు వినడు. దీంతో గోవిందరాజును పక్కకు తీసుకెళ్లి అసలు విషయం చెబుతాడు రామా.
మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటూ ఆనందంగా గడపాలని మీ అమ్మ ఆశ. ఆ ఆనందాన్ని ఆ దేవుడు ఇన్నాళ్లు ఇవ్వలేదని చాలా బాధపడిపోయిందిరా. ఇంకొన్ని నెలల్లో ఆ సంతోషం కళ్ల ముందుకు రాబోతోందని పొంగిపోయిందిరా. మీ అమ్మ ఈ విషయం గురించి తప్పా.. ఇంకే విషయం గురించి మాట్లాడటం లేదు అని అంటాడు గోవిందరాజు.
ఇప్పటి దాకా.. తను చూసిన సంతోషం శాశ్వతం కాదు అని తెలిస్తే మీ అమ్మ తట్టుకుంటుందా? ఇప్పటిదాకా సంతోషంలో మీ అమ్మ భోజనం కూడా చేయలేదు. ఇక నుంచి భోజనం కూడా మానేస్తుందేమో అని అంటాడు గోవిందరాజు.
అమ్మ గురించి ఆ భయమే నన్ను వెంటాడుతోంది. అందుకే.. అమ్మకు చెప్పడానికి మాకు ధైర్యం సరిపోవడం లేదు. నువ్వే అమ్మకు ఏదో విధంగా చెప్పి బాధపడకుండా చూడు అని దండం పెడతాడు రామా. దీంతో ఒరేయ్ రామా.. ఏంట్రా ఇది. అంటాడు గోవిందరాజు.
ఏంటమ్మా ఇంకా నిలబడే ఉన్నావు. అసలే కడుపుతో ఉన్నావు. కూర్చో అని జానకిని కూర్చోబెడుతుంది జ్ఞానాంబ. తనకు మామిడికాయ కోసి ఇస్తుంది. తిను అంటుంది. అత్తయ్య గారు.. అంటూ దో చెప్పబోతుంది జానకి. కానీ.. జ్ఞానాంబ వినదు.
తిను అంటుంది జ్ఞానాంబ. దీంతో మామిడి కాయలను తింటుంది జానకి. జ్ఞానాంబ.. తనకు మామిడి కాయ కోసి ఇవ్వడం మల్లిక చూసి షాక్ అవుతుంది. కొన్ని రోజులు ఆగండి.. నేను కూడా తింటాను అని అనుకుంటుంది మల్లిక. ఇంతలో గోవిందరాజు కూడా వస్తాడు.
దీంతో జానకి టక్కున లేచి నిలుచుకుంటుంది. ఏమండి.. మిమ్మల్ని గుడికి వెళ్లి అన్నదాన కార్యక్రమాన్ని చూసుకోమని చెప్పాను కదా.. మీరు వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఉన్నారు ఏంటి అంటుంది జ్ఞానాంబ. దీంతో జ్ఞానం నీకో విషయం చెప్పాలి అంటాడు గోవిందరాజు.
దీంతో నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఈరోజు ఏదో ఒక విషయం చెప్పి బాధపెట్టకండి.. అంటుంది జ్ఞానాంబ. దీంతో గోవిందరాజుకు ఏం చెప్పాలో అర్థం కాదు. అది కాదు జ్ఞానం.. అంటాడు కానీ.. జ్ఞానాంబ మాత్రం అస్సలు వినదు.
అరె.. వెళ్లమని చెబుతుంటే వెళ్లరు ఏంటండి అంటుంది జ్ఞానాంబ. అత్తయ్య గారు.. అంటూ జానకి ఏదో అనబోతుంటే.. సంతోషంగా ఉండాల్సిన సమయంలో మీరందరూ ఎందుకు ఇలా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు అంటుంది జ్ఞానాంబ.
దీంతో నేను నెల తప్పలేదు అత్తయ్య గారు అంటుంది జానకి. దీంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. తన చేతుల్లో ఉన్న ఉసిరికాయలను కింద పడేస్తుంది. మల్లికకు చాలా సంతోషం వేస్తుంది. ఇంతలో మల్లిక అక్కడికి వచ్చి జానకి.. నువ్వు చెప్పేది నిజమా అంటుంది.
జానకి నాకంటే ముందు తల్లి అయితే ఈ పోలెరమ్మ నన్ను ఉప్మాలో కరివెపాకులా తీసేస్తుంది అని అనుకున్నా. కానీ.. దేవుడా నువ్వు ఉన్నావయ్యా.. అని మనసులో అనుకుంటుంది మల్లిక. జ్ఞానం.. నువ్వు తల్లి హృదయంతో ఉన్నావు కాబట్టి.. జానకిని నువ్వు అలా చూసేసరికి.. ఏదేదో ఊహించేసుకున్నావు అంటాడు గోవిందరాజు.
నీతో ఎలా చెప్పాలో అర్థం కాక.. సతమతమయ్యారు అంటాడు. దయచేసి నువ్వు బాధపడకు అమ్మ అంటాడు రామా. దీంతో ఏం మాట్లాడాలో జ్ఞానాంబకు అర్థం కాదు. ఆ తర్వాత రామా, జానకిని పిలిచి.. మనవడు, మనవరాలిని ఎత్తుకోవడం కోసం నేనే ఎంతో ఆరాటపడుతున్నాను.. పిల్లల కోసం మీరెంత ఆరాటపడుతున్నారో అర్థం చేసుకోగలను.
మీరు ఇప్పుడప్పుడే పిల్లలు వదని అనుకుంటున్నారా? అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో జానకి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Allu Arjun : ప్రముఖ ఓటీటీ OTT ప్లాట్ ఫామ్ ఆహాలో Aha నందమూరి బాలకృష్ణ N Balakrishna అన్స్టాపబుల్ …
Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు…
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
This website uses cookies.