janaki kalaganaledu 11 july 2022 full episode
Janaki Kalaganaledu 11 July Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 11 జులై 2022, సోమవారం ఎపిసోడ్ 341 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు అలా ఎలా కింద పడ్డారు అని అడుగుతాడు రామా. దీంతో ఏదో కాలికి తాకినట్టు ఉంది అంటుంది జానకి. విత్తనాలు వేయడం పూర్తయ్యాక.. అందరూ అక్కడ కూర్చొని పిండి వంటలు తింటూ ఉంటారు. అందరూ సరదాగా గడుపుతారు. ఆ తర్వాత గోవింద రాజు రామా, విష్ణుతో చిన్న గేమ్ ఆడిస్తాడు. ఎవరి భార్యలను వాళ్లు ఎత్తుకొని భార్యలు తమ నోట్లో స్పూన్, నిమ్మకాయ పట్టుకొని ఉండాలి. వాళ్లు స్పూన్ మీద ఉన్న నిమ్మకాయ పడకుండా నడవాలి అని చెబుతాడు. పోటీలు ప్రారంభం అవుతాయి. రామా, జానకి ఓవైపు, విష్ణు, మల్లిక మరోవైపు నడుస్తుంటారు.
janaki kalaganaledu 11 july 2022 full episode
మధ్యలోనే మల్లిక స్పూన్ పడిపోతుంది. ఇంతలో రామా.. జానకిని తీసుకెళ్తాడు. దీంతో రామా, జానకి గెలుస్తారు. ఓడిపోయినందుకు మల్లిక.. విష్ణును చితకబాదుతుంది. ఆ తర్వాత ఈ పోటీలలో మీరిద్దరూ గెలిచారు అని జ్ఞానాంబ.. అంటుంది. తర్వాత అందరూ కలిసి సరదాగా గడిపి భోం చేస్తుంటారు. ఇద్దరూ రామా, జానకి సరదాగా గడపడం చూసి గోవిందరాజు, జ్ఞానాంబ సంబురపడతారు. ఇంతలో జానకిని.. ఐపీఎస్ కోచింగ్ చెప్పే వ్యక్తి చూస్తాడు. వాళ్ల దగ్గరికి వస్తాడు. ఏమ్మా జానకి బాగున్నావా అని అడుగుతాడు. దీంతో జానకి షాక్ అవుతుంది. ఐపీఎస్ కోచింగ్ వ్యక్తి అని గుర్తుకుతెచ్చుకొని షాక్ అవుతుంది జానకి. ఇంతలో అక్కడికి జ్ఞానాంబ, గోవిందరాజు వస్తారు. ఈయనేంటి ఇక్కడ. ఇప్పుడు అత్తయ్య గారికి నిజం తెలిస్తే అనుకుంటుంది.
నన్ను చూసి గుర్తు పట్టలేదా. నేను అకాడెమీ క్లర్క్ ను అంటాడు. దీంతో ఈ విషయం ఎక్కడ తెలుస్తుందో అని జానకి ఇంగ్లీష్ లో మా అత్తామామలకు ఈ విషయం తెలియదు అని చెబుతుంది. ఇంతలో అఖిల్ అక్కడికి వస్తుంటాడు. ఎవ్వరికీ నా చదువు గురించి చెప్పకండి సార్ అంటుంది.
దీంతో ఓకే అమ్మా. నేను నీకు ఎప్పుడైనా సాయం చేయడానికి రెడీగా ఉంటా అని చెబుతాడు. ఇంతలో వచ్చిన అఖిల్ వస్తాడు. వీళ్లు ఇంగ్లీష్ లో ఏం మాట్లాడుకుంటున్నారు అని అఖిల్ ను అడుగుతుంది మల్లిక. దీంతో ఆయన క్లర్క్ అని చెబుతున్నాడు. ఏ సాయం కావాలన్నా చేస్తానంటున్నాడు అంటాడు.
ఆ తర్వాత అతడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత అందరం అంత్యాక్షరి ఆడుకుందాం అని అంటాడు. దీంతో అందరూ పాటలు పాడటం స్టార్ట్ చేస్తారు. జానకి వంతు రాగానే.. జానకి కలగనలేదు అనే పాట పాడుతుంది. జానకి కలగనలేదు.. రాముడి సతి కాగలదని ఆనాడు అంటూ పాట పాడుతారు. అందరూ సంతోషంగా అక్కడ గడుపుతారు. రామా కూడా పాట పాడుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.