Home » Entertainment » Janaki Kalaganaledu 11 October 2022 Full Episode
Entertainment

Janaki Kalaganaledu 11 Oct Today Episode : జెస్సీని అపార్థం చేసుకున్న అఖిల్.. తనను ఇంట్లో నుంచి వెళ్లగొడతాడా?

Authored By
Varun G
The Telugu News | Updated on: October 11, 2022 8:41 am
Advertisement

Janaki Kalaganaledu 11 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. జెస్సీ కోసం కుంకుమ పూలు కలిపి ఇస్తుంది జానకి. అత్తయ్య గారు త్వరలే నీతో మంచిగా మాట్లాడుతారు అనిపిస్తుంది అంటుంది జానకి. ఎలా అక్క అని అడుగుతుంది జెస్సీ. దీంతో అత్తయ్య గారే నీకోసం కుంకుమ పువ్వు ఇచ్చింది. నువ్వు కడుపుతో ఉన్నావు కదా. కుంకుమ పువ్వు కలిపిన పాలు నీకు, మల్లికకు ఇవ్వాలని చెప్పింది అంటుంది. దీంతో జెస్సీ చాలా సంతోషిస్తుంది. త్వరలోనే నీకు మంచిరోజులు రానున్నాయి అని అంటుంది జానకి.

Advertisement

janaki kalaganaledu 11 october 2022 full episode

కట్ చేస్తే నీలావతితో కలిసి మరో ప్లాన్ చేస్తుంటుంది మల్లిక. తనకు ఫోన్ చేసి మళ్లీ ఏదో ప్లాన్ వేస్తుండగా అప్పుడే పాలు తీసుకొని వచ్చిన జానకి అన్నీ వింటుంది. నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటుంది. దీంతో నేనేం చేశాను జానకి అంటుంది. దీంతో కడుపుతో ఉన్నవాళ్లు ఫోన్ ఎక్కువ సేపు మాట్లాడకూడదు. రేడియేషన్ ప్రాబ్లమ్ వస్తుంది అంటుంది. దీంతో ఓహో.. అంటే జానకి పెద్దమ్మతో మాట్లాడిన మాటలు వినలేదన్నమాట అని అనుకుంటుంది.

Advertisement

సరే.. కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగు అంటుంది జానకి. దీంతో వద్దులే జానకి అంటుంది మల్లిక. లేదు.. తాగు అని అంటుంది. దీంతో కుంకుమ పువ్వు కలిపిన పాలను తాగేస్తుందది మల్లిక.

మల్లిక పాలు తాగాక.. పిల్లి పాలు తాగుతూ కళ్లు మూసుకొని నన్ను ఎవరూ చూడటం లేదు అని అనుకుంటుందట. అలా ఉంది నీ పరిస్థితి అంటుంది జానకి. నువ్వు ఫోన్ మాట్లాడిన సంగతి అన్నీ విన్నా.

Advertisement

జెస్సీ అమ్మానాన్నకు ఫోన్ చేసి చెప్పింది నువ్వే అని నాకు తెలుసు. నువ్వు నీలావతితో కలిసి చేసేవన్నీ నాకు తెలుసు అని అంటుంది. ఈ ఇంటికి నువ్వు మంచి చేయకున్నా పర్వలేదు కానీ.. ఇంటికి చెడు కలిగించాలని చూడకు. ఇంకోసారి ఇలా చేస్తే అస్సలు ఊరుకోను అని చెప్పి మల్లికకు వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది జానకి.

Janaki Kalaganaledu 11 Oct Today Episode : కుంకుమ పాలను నేలకు విసిరేసికొట్టిన అఖిల్

మరోవైపు అత్తయ్య గారు నాకోసం కుంకుమ పువ్వు పాలు తెచ్చి ఇచ్చారని అఖిల్ తో చెబుతుంది జెస్సీ. ఎంతో సంతోషంతో జెస్సీ ఈ విషయం చెబితే అఖిల్ మాత్రం తనను అర్థం చేసుకోడు. మల్లిక చెప్పిందో తనకు గుర్తొస్తుంది.

అమ్మ ముందు నువ్వు మంచిగా ఉండి నన్ను చెడు చేయాలని చూస్తున్నావా అని అడుగుతాడు అఖిల్. నీ నాటకాలు ఇక ఆపు అంటాడు అఖిల్. మా అమ్మ దగ్గర నువ్వు వేసే వేషాలు నాకు తెలియదు అనుకుంటున్నావా.

నువ్వు దగ్గర కావాలని చెప్పి నన్ను చెడు చేస్తున్నావా అని ప్రశ్నిస్తాడు అఖిల్. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అని బెదిరిస్తాడు. కుంకుమ పువ్వు కలిపిన పాలను విసిరేస్తాడు. ఇదంతా జానకి చూస్తుంది.

Advertisement

తర్వాత జానకి దగ్గరికి వెళ్లి చూడు అక్క అఖిల్ ఎలా మాట్లాడుతున్నాడో. నేను అఖిల్ ను అత్తయ్య గారి నుంచి ఎందుకు దూరం చేస్తానక్కా అని వెక్కి వెక్కి ఏడుస్తుంది జెస్సీ. ఆ తర్వాత జానకి కూర్చొని చదువుకుంటూ ఉంటుంది.

రామా.. జానకితో తన చదువు గురించే మాట్లాడుతాడు. మీరు ముందు పరీక్షలు మంచిగా రాసిన తర్వాత ఎవరికి ఏ సాయం చేయాలో చూద్దాం అంటాడు రామా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి