Janaki Kalaganaledu 12 Oct Today Episode : తాగి వచ్చి జానకిని అవమానించిన అఖిల్.. దీంతో జానకి షాకింగ్ నిర్ణయం.. జెస్సీ అఖిల్ ను వదిలేస్తుందా?

Janaki Kalaganaledu 12 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 అక్టోబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 408 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి చదువును ఎలాగైనా డిస్టర్బ్ చేయాలని అనుకుంటుంది మల్లిక. జానకి అలా చదువుకుంటూ ఉంటే నేను ఎలా చూడగలను అని జానకిని దూరం నుంచి పిలిచే ప్రయత్నం చేస్తుంది. ఇంతలో చికిత అక్కడికి వచ్చి ఏమైంది జానకి అమ్మ గారిని ఎందుకు పిలుస్తున్నారు. ఆవిడ చదువుకుంటున్నారు కదా అని అంటుంది చికిత. దీంతో నీకెందుకు నువ్వు వెళ్లు.. నాకు జానకితోనే పని ఉంది అని అంటుంది మల్లిక. ఆ తర్వాత కాలు బెనికినట్టు అమ్మో నొప్పి అంటుంది. దీంతో ఏమైంది మల్లిక అని జానకి, చికిత అక్కడికి వస్తారు. వామ్మో.. నొప్పి అంటుంది మల్లిక. దీంతో పదా.. ఆసుపత్రికి వెళ్దాం అంటుంది. వద్దులే.. నొప్పి కొంచెం తగ్గింది అంటుంది మల్లిక.

janaki kalaganaledu 12 october 2022 full episode

ఉండు.. ఏదైనా క్రీమ్ తెచ్చి రాస్తా అంటుంది జానకి. జానకి అటువైపు వెళ్లగా అక్కడికి వచ్చిన చికిత.. ఆమెకు కొపపి లేదు ఏం లేదు.. కావాలని మీ చదువు చెడగొట్టేందుకు నాటకం ఆడుతున్నారు అంటుంది. కావాలంటే మీరే ఒకసారి పరీక్షించి చూడండి అంటుంది జానకి. దీంతో సరే అని అంటుంది. ఇంతలో చికిత దగ్గరికి వస్తుంది మల్లిక. కొబ్బరి నూనె ఏది చికిత అని అడుగుతుంది మల్లిక. దీంతో జానకి అమ్మ గారు తెస్తున్నారు అంటుంది చికిత. ఇంతలో జానకి వస్తుంది. కొబ్బరి నూనె తెచ్చావా అని అడుగుతుంది మల్లిక. దీంతో ఇదిగో తెచ్చాను అని ఒక సూది చూపిస్తుంది. నరంలో రక్త ప్రసరణ ఆగిపోతే కాలు బెణుకుతుంది. ఈ సూదితో గుచ్చితే రక్తప్రసరణ బాగా అవుతుంది. చికిత కాలు గట్టిగా పట్టుకో. రక్తం గడ్డ కట్టిన చోట గుచ్చితే రక్త ప్రసరణ బాగా అవుతుంది అంటుంది జానకి.

దీంతో భయపడిపోయిన మల్లిక.. నా కాలు నొప్పి పోయింది. చూడు ఇప్పుడు నేను బాగానే ఉన్నా. బాగానే నడుస్తున్నా అంటుంది. దీంతో మల్లికపై సీరియస్ అవుతుంది జానకి. ఎందుకు ఇలా చేస్తున్నావు మల్లిక అంటూ అడుగుతుంది. దీంతో అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లిపోతుంది మల్లిక.

ఏ ప్లాన్ వేసినా వర్కవుట్ అవడం లేదు ఎలా అని అనుకుంటుంది మల్లిక. ఇంతలో అఖిల్ ఫుల్లుగా తాగి ఇంటికి వస్తాడు. అఖిల్ తాగి రావడం చూసి మల్లిక షాక్ అవుతుంది. నా కాలం కలిసొచ్చి పోలేరమ్మ కొడుకు తాగొచ్చాడు.

Janaki Kalaganaledu 12 Oct Today Episode : అఖిల్ చెంప చెళ్లుమనిపించిన జ్ఞానాంబ

ఈ అవకాశాన్ని ఎలా వాడుకోవాలి అని అనుకుంటుంది మల్లిక. వెంటనే అత్తయ్య గారు, మామయ్య గారు అని ఇంట్లోకి వెళ్లి వాళ్లను పిలుస్తుంది. దీంతో ఏమైంది అని అడుగుతుంది. దీంతో అఖిల్ పీకలదాకా తాగి వచ్చాడు అంటుంది మల్లిక.

ఏం మాట్లాడుతున్నావు. అఖిల్ తాగి రావడం ఏంటి. పైత్యం కమ్మిందా నీకు అంటాడు గోవిందరాజు. దీంతో నిజంగానే తాగొచ్చాడు. చూడండి అంటుంది మల్లిక. దీంతో తాగిన మత్తులో ఇంట్లోకి వస్తున్న అఖిల్ ను చూస్తారు అందరూ. ఇంట్లోకి అడుగు పెట్టబోతూ కింద పడబోతాడు అఖిల్.

ఒరేయ్ అఖిల్.. తాగొచ్చావా అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో ఏం సమాధానం చెప్పడు అఖిల్. లేదు.. అన్నట్టుగా తల ఊపుతాడు. దీంతో అఖిల్ గల్ల పట్టుకుంటుంది జ్ఞానాంబ. నోరు తెరిచి సమాధానం చెప్పు అంటుంది జ్ఞానాంబ. దీంతో లేదమ్మా అంటాడు అఖిల్.

దీంతో తనకు వాసన వచ్చి అఖిల్ పై చేయి చేసుకుంటుంది. వాడిని లోపలికి తీసుకెళ్లు అంటాడు గోవిందరాజు. దీంతో జెస్సీ.. అఖిల్ ను లోపలికి తీసుకెళ్తుంది. ఇంట్లోకి తీసుకెళ్లి అఖిల్ కు స్నానం చేయిస్తుంది జెస్సీ.

తనకు స్నానం చేయించాక నువ్వు ఎందుకు తాగి వచ్చావు అని అడుగుతుంది జెస్సీ. అమ్మకు నా మీద కోపం రావడానికి, నన్ను దూరం పెట్టడానికి కారణం నువ్వే జెస్సీ అంటాడు అఖిల్. అప్పుడే అక్కడికి జానకి, మల్లిక వస్తారు.

నా మాట వినకుండా నేను చెప్పింది చేయకుండా నీకు ఇష్టం వచ్చినట్టు చేశావు. అందుకే నేను మా అమ్మ ముందు దోషిగా నిలబడ్డాను అంటాడు అఖిల్. ఏం మాట్లాడుతున్నావు అఖిల్ అని జానకి అడుగుతుంది.

తాగొచ్చి అందరినీ బాధపెట్టడమే కాకుండా జెస్సీని బాధపెడుతున్నావా అని నిలదీస్తుంది జానకి. ఏమైంది అఖిల్ నీకు. ఎందుకు ఇలా తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. అత్తయ్య గారిని బాధపెడుతున్నావు అని అడుగుతుంది జానకి.

అప్పుడెప్పుడో ఏదో సామెత ఉండేది. గుడ్డు పిల్ల అని అంటాడు అఖిల్. గుడ్డొచ్చి పిల్లను ఎక్కిరించినట్టు అంటుంది మల్లిక. పెద్ద వదిన ఇప్పుడు నాకు క్లాస్ పీకుతోంది. అమ్మ ముందు తను చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు ఇప్పుడు నాకు క్లాస్ పీకుతోంది అంటాడు అఖిల్.

నేనేం తప్పు చేశాను అఖిల్ అంటుంది జానకి. ఇక్కడితో ఐపీఎస్ డ్రీమ్ ను వదిలేస్తున్నానని చెప్పి అమ్మ మీద ప్రామిస్ చేసి ఆ తర్వాత ఏం చేశావు అని అడుగుతాడు అఖిల్. మా అన్నయ్యను మభ్యపెట్టి మా అమ్మకు తెలియకుండా కాలేజీకి వెళ్లి ఐపీఎస్ కోచింగ్ తీసుకున్నావు అని అంటాడు అఖిల్.

మా అమ్మ దృష్టిలో అన్నయ్య చెడ్డవాడు అయినా పర్వాలేదు.. నీ ఆశయం నెరవేరితే చాలు అనుకున్నావు. అది తప్పు కాదా వదిన అంటాడు అఖిల్. నువ్వు చేస్తే మాత్రం తప్పు కాదు. నేను ఏదో తెలియకుండా తప్పు చేస్తే మాత్రం అది పెద్ద తప్పు.

అమ్మ ముందు నన్ను ఇంకా బ్యాడ్ చేస్తున్నావు అని అంటాడు అఖిల్. నీ వల్ల నాకు సంతోషం కన్నా బాధే ఎక్కువైపోయింది అంటాడు అఖిల్. మల్లిక ఇక్కడ ఉంటే ఇంకా సమస్యలు ఎక్కువవుతాయి అనుకొని అక్కడి నుంచి మల్లికను తీసుకెళ్తుంది చికిత.

జానకి కూడా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నేనేం చేసినా మీకు చెడుగానే కనిపిస్తుంది. నేను జానకినే సపోర్ట్ చేస్తుంటే మీరంతా చెడుగా అనుకుంటున్నారా? నీకు తప్పుగా అనిపిస్తోందా అంటుంది మల్లిక. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Health : పురుషులకు ఆ విషయంలో… భారత్ లో 28 మందిని వేధిస్తున్న ఒకే ఒక సమస్య… కారణం ఇదేనట…?

Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…

19 minutes ago

Nithin : నాని తిరస్కరించిన కథలతో నితిన్ ప‌రాజయాలు.. ‘తమ్ముడు’ తర్వాత ‘ఎల్లమ్మ’పై సందేహాలు..!

Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…

1 hour ago

Healthy Street Food : ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది… అదేనండి…స్ట్రీట్ ఫుడ్ వీటి రూటే సపరేట్…?

Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…

2 hours ago

Lucky Bhaskar Sequel : ల‌క్కీ భాస్క‌ర్ సీక్వెల్ క‌న్‌ఫాం చేసిన ద‌ర్శ‌కుడు.. ఎలా ఉంటుందంటే..!

Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…

3 hours ago

Jaggery Tea : వర్షాకాలంలో ఈ టీ తాగారంటే… రోజు ఇదే కావాలంటారు… దీని లాభాలు మిరాకిలే…?

Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…

4 hours ago

Bonalu In Telangana : బోనాల పండుగలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి… అవేంటో తెలుసా…?

Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…

5 hours ago

Poco M6 Plus : రూ.10 వేల ధరలో పోకో M6 Plus స్మార్ట్‌ఫోన్‌

Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…

14 hours ago

Atchannaidu : జగన్ ప్రతిపక్ష నేత కాదు.. జస్ట్ ఎమ్మెల్యే అంతే : అచ్చెన్నాయుడు.. వీడియో

Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…

15 hours ago