janaki kalaganaledu 13 july 2022 full episode
Janaki Kalaganaledu 13 July Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 13 జులై 2022, బుధవారం ఎపిసోడ్ 343 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తన రూమ్ లోకి వెళ్లి షాక్ అవుతుంది మల్లిక. రూమ్ అంతా డెకరేట్ చేసి ఉండటం చూసి షాక్ అయి.. పెద్ద కోడలు రూమ్ లో కూడా డెకరేట్ చేసిందా అని అనుకుంటుంది. వామ్మో.. నాకంటే ముందే జానకి పిల్లలను కంటే.. 5 సెంట్ల భూమి పోయినట్టే. అలా జరగకూడదంటే వాళ్ల శోభనాన్ని ఆపాలి. ఎలా అని అనుకుంటుంది మల్లిక. తనలో తాను మాట్లాడుకోవడం చూసి విష్ణు బిత్తరపోతాడు. త్వరగా రెడీ అవ్వు అంటాడు. ఏం చేయాలి.. వాళ్ల శోభనాన్ని ఎలా ఆపాలి అని అనుకుంటుంది మల్లిక. దీంతో తనకు భలే ఐడియా వస్తుంది. కిచెన్ లోకి వెళ్లి పాల గ్లాస్ లో ఏదో పౌడర్ కలుపుతుంది. ఈ పాలు తాగి మీరు స్పృహ కోల్పోతారు. గురక పెట్టి నిద్రపోతారు అని అనుకుంటుంది మల్లిక.
janaki kalaganaledu 13 july 2022 full episode
నీకంటే ముందు నేనే పిల్లలను కనేస్తాను. 5 సెంట్ల స్థలాన్ని కొట్టేస్తాను. మా అమ్మమ్మ తగ్గేదేలే అని అనుకుంటుంది మల్లిక. ఇంతలో కిచెన్ లోకి వస్తుంది జానకి. తనను చూసి షాక్ అవుతుంది మల్లిక. నేను పౌడర్ కలిపింది చూసిందా అని డౌట్ పడుతుంది మల్లిక. మనిద్దరం పిల్లలను కని అత్తయ్య గారి చేతుల్లో పెడదాం అంటుంది జానకి. ఇద్దరూ చెరో గ్లాస్ తీసుకొని వెళ్తారు. మల్లిక పాల గ్లాస్ పట్టుకొని విష్ణు దగ్గరికి వస్తుంది. పాల గ్లాస్ తీసుకొని తనను కూర్చో అంటాడు విష్ణు. మన పెళ్లి అయి 3 ఏళ్లు అవుతోంది. ఇంతలా సిగ్గు పడుతున్నావెందుకు అంటాడు విష్ణు. ముందు మీరు పాలు తాగండి అంటుంది మల్లిక. దీంతో సగం పాలు తాగి.. తనకు ఇస్తాడు విష్ణు.
పాలు తాగు అంటే.. గ్లాస్ పట్టుకొని జానకి, రామా గురించే ఆలోచిస్తూ ఉంటుంది మల్లిక. మరోవైపు రామా.. జానకి కోసం ఎదురు చూస్తుంటాడు. పాల గ్లాస్ పట్టుకొని రూమ్ లోకి వస్తుంది జానకి. డోర్ కు గడి పెట్టి లోపలికి వస్తుంది. రామా దగ్గరికి వస్తుంది.
ఇద్దరూ పాలు తాగి బెడ్ మీద పడిపోతారు. కానీ.. ఇదంతా మల్లిక కలగంటుంది. అయితే.. ఆ పాలు తాగి విష్ణు స్పృహ పడిపోతాడు. అక్కడ ప్లాన్ వేస్తే ఇక్కడ రియాక్షన్ వచ్చిందేంటి అని అనుకుంటుంది. కానీ.. అసలు జరిగింది ఏంటంటే.. మత్తు మందు కలిపిన పాల గ్లాస్ ను కంగారులో మల్లికే తీసుకొస్తుంది.
మరోవైపు జానకి .. పాల గ్లాస్ తీసుకొని రామా దగ్గరికి వస్తుంది. ముందు మీరు ఐపీఎస్ చదువు పూర్తి చేయండి. ఆ తర్వాత అసలు విషయం ఆలోచిద్దాం అంటాడు రామా. పాలు తాగండి అంటే రామా వద్దు అంటాడు. దీంతో తను సగం తాగి రామాకు ఇస్తుంది.
ఆ గ్లాస్ మీద తన లిప్ స్టిక్ రంగు అంటుకుంటుంది. దాన్ని చూసి రామాకు మూడ్ వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఒక మాట ఆడుగుతాను సూటిగా ఒక సమాధానం చెప్పండి అంటుంది జానకి. నిజంగానే నా చదువు కోసం నన్ను దూరం పెడుతున్నారా లేక.. నేనంటే మీకు ఇష్టం లేదా అని అడుగుతుంది.
దీంతో అదేంటి అలా మాట్లాడుతున్నారు.. అంటాడు. మరి లేకపోతే ఏంటి.. గ్లాస్ కు లిప్ స్టిక్ అంటిందని ఆ పాలు తాగకుండా వేరు వైపు నుంచి తాగుతున్నారు అంటుంది జానకి. దీంతో సరు.. తాగుతాను అని లిప్ స్టిక్ అంటుకున్న వైపు నుచే పాలు తాగేస్తాడు రామా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.