Janaki Kalaganaledu 14 Feb Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 ఫిబ్రవరి 2022, సోమవారం ఎపిసోడ్ 236 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబ, గోవిందరాజు ఇద్దరూ.. జానకి, రామాకు చెప్పకుండానే వెన్నెల నిశ్చితార్థానికి ముహూర్తం పెడతారు. ఎల్లుండి మంచి ముహూర్తం ఉందని పంతులు చెప్పడంతో అదే ముహూర్తాన్ని ఖరారు చేస్తారు. మరోవైపు వెన్నెల ఇంటికి రావడానికి మెండికేస్తుంది. నీకు, దిలీప్ కు పెళ్లి నేను జరిపిస్తాను అంటుంది జానకి. నిశ్చితార్థం అయిపోగానే.. దగ్గర్లోనే మంచి ముహూర్తం చూసి పెళ్లి కూడా జరిపించేద్దాం అంటుంది జ్ఞానాంబ. దీంతో సరే అంటారు మగ పెళ్లి వాళ్లు. జరగబోయే నిశ్చితార్థాన్ని ఆపి నీ పెళ్లి నేను జరిపిస్తాను అంటుంది జానకి.
అది కాదు వదిన.. అమ్మ గురించి తెలుసు కదా అంటుంది వెన్నెల. మాకు నీ ప్రాణాలే ముఖ్యం అంటుంది జానకి. కానీ.. మరోవైపు జ్ఞానాంబ.. మాకు పరువే ముఖ్యం అంటుంది. ప్రాణం కంటే పరువే మాకు ముఖ్యం అంటుంది. దాని కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా అంటుంది జానకి. పరువు పోయే పరిస్థితే వస్తే ప్రాణాలను వదిలేసుకోవడానికి సిద్ధం ఉన్నాం అంటుంది జ్ఞానాంబ. పరువు పోయేలా చేసేవాళ్లు నా కన్నకొడుకు అయినా కూతురు అయినా క్షమించను.. సహించను. మా అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టమో కాదో మరోసారి కనుక్కోండి అనే మీ ప్రశ్నకు నా సమాధానం ఇది అని మగ పెళ్లి వారికి చెబుతుంది జ్ఞానాంబ. మా మీద నమ్మకం ఉంచమ్మా.. మరోసారి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయనని నాకు మాటివ్వు. నీకు ఏదైనా అయితే ఈ అన్నయ్య తట్టుకోలేడు అంటాడు రామా.
నా పిల్లల మీద నాకు నమ్మకం ఉంది. అందుకే.. ఇంత ధైర్యంగా నేను ఈ మాట చెబుతున్నాను అంటుంది జ్ఞానాంబ. అందుకే.. ఆ నమ్మకంతోనే నా పెద్దకొడుకు, కోడలు ఇంట్లో లేకపోయినా సరే నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టిస్తున్నాను. వాళ్లు వచ్చాక ఈ విషయం చెబితే అలాగే అమ్మ అని నా పెద్ద కొడుకు నా నిర్ణయానికి గౌరవం ఇస్తారు అంటుంది జ్ఞానాంబ.
మరోవైపు ఎలాంటి అఘాయిత్యం చేసుకోనని వెన్నెల.. రామాకు మాట ఇస్తుంది. వెన్నెల.. నువ్వు ఇంకా బయటపడుతున్నావని నాకు అర్థం అవుతోంది. అందుకే నేను నీకు మాటిస్తున్నాను అంటుంది జానకి. ఏం జరిగినా.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే.. ఈ పెళ్లి నేను జరిపిస్తాను అంటుంది జానకి.
మరోవైపు జ్ఞానాంబ కూడా మగ పెళ్లి వాళ్లకు మాటిస్తుంది. మీరు ఇక ఈ పెళ్లి గురించి అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు. ఈ పెళ్లి జరిగి తీరుతుంది. జ్ఞానాంబ మాటిస్తే తిరుగు ఉండదు. ఎదురు ఉండదు అంటుంది. మీ పెళ్లి జరుగుతుంది. మా మాట తప్పదు. మేము మాట తప్పం అంటుంది జానకి. తర్వాత అక్కడ నుంచి అందరూ వెళ్లిపోతారు.
పంతులు గారు నిశ్చితార్థం ముహూర్త పత్రికను మగ పెళ్లి వాళ్లకు ఇస్తాడు. వాళ్లు దాన్ని జ్ఞానాంబ గారికి ఇస్తారు. మేము అక్కడికి వెళ్లి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఫోన్ చేస్తాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు మల్లిక వాళ్ల నాయినమ్మ డైరెక్ట్ గా జ్ఞానాంబ ఇంటికే వస్తుంది.
నా మనవరాలు మల్లిక నన్ను చూడగానే ఆనందంగా ఎగిరి గంతేస్తుంది అని అనుకొని మల్లిక అని పిలుస్తుంది. ఇంతలో చికిత వస్తుంది. ఏయ్ చికిత బాగున్నావా అంటుంది. కానీ.. విచిత్రంగా తలుపులమ్మను చూస్తుంది చికిత. సరే.. లోపలికి రండి అంటుంది చికిత.
ఇంతలో జ్ఞానాంబ, గోవిందరాజు వస్తారు. తలుపులమ్మను చూసి షాక్ అవుతారు వాళ్లు. ఏంటి అందరూ నన్ను అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు అని అడుగుతుంది తలుపులమ్మ. అమ్మా.. మీరు బాగానే ఉన్నారు కదా.. మీకు ఏం కాలేదు కదా అని అడుగుతాడు గోవిందరాజు.
నాకేం అవుతుంది అబ్బాయి. కరోనా టైమ్ లో కూడా నేను బండరాయిలా ఉన్నాను అని చెబుతుంది తలుపులమ్మ. మీకు బాగాలేదని చెప్పి మల్లిక మీ ఇంటికే వచ్చింది కదా అంటుంది జ్ఞానాంబ. ఓమైగాడ్.. నా గురించి ఇంత బ్యాడ్ గా చెప్పిందా అని వెంటనే మల్లికకు చికిత ఫోన్ నుంచి ఫోన్ చేస్తుంది.
మీ నానమ్మ గారు ఎలా ఉన్నారండి అని అడుగుతుంది చికిత. నా వల్లనే బతికింది అని చెబుతుంది మల్లిక. ఆసుపత్రిలో డాక్టర్లు ఏమని చెప్పారో తెలుసా.. నీ చేతుల్లో ఏదో మహిమ ఉంది.. నీవల్లే మీ నానమ్మ బతికింది అని చెప్పారు అంటూ ఏదేదో మాట్లాడుతుంది మల్లిక.
దీంతో తలుపులమ్మకు తీవ్రంగా కోపం వస్తుంది. ఒసేయ్ చికిత.. నీ వంట గదిలో నుంచి నాకు కొన్ని ఆయుధాలు కావాలి అంటుంది తలుపులమ్మ. ఒసేయ్ మల్లిక.. రావే చెబుతా నీ సంగతి అని అనుకుంటుంది తలుపులమ్మ. ఇంతలో వెన్నెలను తీసుకొని రామా, జానకి ఇంటికి వస్తారు.
వదిన.. నిశ్చితార్థాన్ని ఎలా ఆపి దిలీప్ తో నా పెళ్లి జరిపిస్తారు అని అడుగుతుంది వెన్నెల. ఏదో ఒక పని చేసి ఎలాగోలా ఈ నిశ్చితార్థం ఆపుదాం. మీ ప్రేమ విషయం ఎలాగూ అత్తయ్య గారికి తెలిసిపోయింది కాబట్టి.. అత్తయ్య గారిని ఎలాగోలా ఒప్పించి ఈ పెళ్లి జరిపిద్దాం అంటుంది జానకి.
వద్దు వదిన.. అమ్మ ఒప్పుకోదు. ఈ ఇంట్లో ప్రేమ అనే పదం వినిపించకూడదు అంటుంది. అమ్మ ప్రేమ పెళ్లికి పొరపాటున కూడా ఒప్పుకోదు అంటాడు రామా. ప్రయత్నించడంలో తప్పు లేదు కదా. ఒప్పుకోకపోతే.. దిలీప్ తెలిసిన వారి అబ్బాయి అని చెప్పి.. వీళ్ల పెళ్లిని పెద్దు కుదుర్చిన పెళ్లిగా చూద్దాం అంటుంది జానకి.
ఇంతలోనే విష్ణు, మల్లిక ఇద్దరూ కారులో నుంచి దిగుతారు. విష్ణు మాత్రం నాకేదో తేడా కొడుతోంది అంటాడు. మా నానమ్మ ఏమన్నా వచ్చి మీ అమ్మకు చెబుతుందా అంటుంది. ఇంట్లోకి వస్తుండగానే చికిత ఎదురు వస్తుంది. ఇటు ఇవ్వండి మీ బ్యాగు నేను మోస్తాను అంటుంది చికిత.
ఎండిపోయిన కొబ్బరికాయ ఎప్పుడు రాలిపోతుందో చెప్పలేం. పండు ముసలి అయిన మా నానమ్మ ఎప్పుడు పుటుక్కుమంటుందో చెప్పలేం అంటూ ఇంట్లో అడుగుపెట్టబోతుంది మల్లిక. అప్పుడే తన నానమ్మను చూసి షాక్ అవుతుంది. మల్లికమ్మ గారు ఈవిడ ఎవరో అచ్చం మీ నానమ్మలా ఉన్నారు కదండి అంటుంది చికిత.
అంటే దీనికి ముందే తెలుసా.. తెలిసి కూడా నాతో వెటకారాలు ఆడిందా అని అనుకుంటుంది. నానమ్మ అంటూ తన దగ్గరికి వెళ్లబోతుంది. గుండ్రాయిలా ఉన్న నన్ను.. అనారోగ్యంతో ఉన్నా అంటావా.. నిన్ను అంటూ అప్పడాల కర్రతో మల్లికను వాయిస్తుంది.
కట్ చేస్తే రాత్రి అవుతుంది. వెన్నెల ప్రేమ విషయం ఇప్పటికే అత్తయ్య గారికి తెలిసిపోయింది కాబట్టి.. ఇప్పుడు మనం వెళ్లి ఆ ప్రస్తావన తీసుకొస్తే తను కొప్పడతారు. ఏం చేయాలి అని ఆలోచిస్తుంటారు జానకి, రామా. ఎలాగైనా తనతో మాట్లాడాలి రామా గారు అంటుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
This website uses cookies.