janaki kalaganaledu 14 november 2021 episode highlights
Janaki Kalaganaledu 14 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 15 నవంబర్ 2021, సోమవారం 171 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గత ఎపిసోడ్ లో జానకికి మైరావతి పెద్ద శిక్షే విధించిన విషయం తెలిసిందే. దీంతో రాత్రంతా జానకి.. బయట చలిలో పడుకుంటుంది. జానకి చలిలో పడుకోవడం చూసి జ్ఞానాంబ దుప్పటి తెచ్చి తనకు కప్పుతుంది. జ్ఞానాంబ జానకికి దుప్పటి కప్పడం చూసి రామా చాలా సంతోషిస్తాడు. అమ్మకు జానకి మీద చాలా ప్రేమ ఉందని అనుకుంటాడు.
janaki kalaganaledu 14 november 2021 episode highlights
ఉదయం లేవగానే.. ఇంట్లోని పనులన్నీ జానకే చేస్తుంది. ఇంతలో మైరావతి బయటికి వెళ్తుంది. వెంటనే రామా.. తన దగ్గరికి వచ్చి బావిలో నుంచి నీళ్లు తోడి సాయం చేస్తారు. అయ్యో.. మీరెందుకు వచ్చారు ఇక్కడికి. వెళ్లండి.. అమ్మమ్మ గారు చూస్తే బాగుండదు అంటూ చెబుతుంది. నాన్నమ్మ లేదు.. బయటికి వెళ్లింది అంటాడు రామా. రాత్రిపూట నీకు అమ్మే దుప్పటి కప్పింది అని చెబుతాడు రామా. దీంతో జానకి చాలా సంతోషిస్తుంది.
ఏమండోయ్ శ్రీవారు.. ఏంటి అలా చూస్తున్నారు లైన్ వేస్తున్నారా ఏంటి అంటుంది జానకి. చాల్లేండి.. నన్ను నవ్వించడం కోసం మనసులో అంత బాధ పెట్టుకొని ఇలా ఎలా జోక్స్ వేస్తున్నారండి అంటాడు రామా. నా మనసులో ఇంత బాధనా.. అదేం లేదు.. అంటుంది జానకి. నన్ను క్షమించండి జానకి గారు అంటాడు రామా.
నాతో ఏడు అడుగులు నడిచినప్పటి నుంచి మీకు ఏడుపు తప్ప సంతోషం ఏనాడూ లేదు. మీకు ఎప్పుడూ తోడుగా ఉంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి.. రాత్రి పూట మీరు చలిలో పడుకుంటే చూస్తూ ఉండిపోయాను తప్పితే ఏం చేయలేకపోయాను అంటాడు రామా.
లేదండి.. మీరు భర్తగా గెలిచారు. మీరు కూడా రాత్రి పూట.. నాకు తోడుగా నిద్రపోకుండా ఉన్నారు. అంటే భర్తగా మీరు గెలిచినట్టే కదండి అంటుంది జానకి. అయినా కూడా రామా వినడు. బాధగా ఉంటాడు. దీంతో రామానే చూస్తూ ఉంటుంది జానకి. ఏంటి అలా చూస్తున్నారు అంటాడు రామా. మా ఆయనకు లైన్ వేస్తున్నాను అంటుంది జానకి. మొత్తానికి రామాను నవ్విస్తుంది జానకి.
ఇంతలో జానకి అని పిలుస్తుంది జ్ఞానాంబ. అత్తయ్య గారు అంటూ వచ్చి కాళ్ల మీద పడుతుంది జానకి. రాత్రి నాకు దుప్పటి కప్పింది మీరేనని మీ అబ్బాయి గారు ఇప్పుడే చెప్పారు. ఎంత సంతోషపడిపోయానో తెలుసా. ఈ మనసు ఆనందంతో పొంగిపోయింది అత్తయ్య గారు అంటుంది జానకి.
నీకు దుప్పటి కప్పింది.. జాలితో, మానవత్వంతో. అంతమాత్రాన.. నువ్వు ఎదుర్కొంటున్న పరీక్షకు అనుకూలంగా ఉన్నట్టు కాదు. నీ స్థానంలో మల్లిక ఉన్నా.. నా కూతురు వెన్నెల ఉన్నా.. చివరికి చికిత ఉన్నా నేను ఇలాగే చేస్తాను అంటుంది జ్ఞానాంబ. మీరు నాకు అనుకూలంగా ఉన్నారని మీకు నేను థ్యాంక్స్ చెప్పలేదు అండి. అమ్మలా మీరు నామీద చూపించిన ప్రేమకు అంటుంది జానకి.
మరోవైపు మైరావతి ఇంట్లో పనిచేసే అమ్మాయి భర్త వచ్చి తనను తీసుకెళ్తానంటాడు. కానీ.. తాను రానంటుంది. తనకు విడాకులు ఇస్తా అంటున్నాడు. నేను వెళ్లనమ్మా అని జానకితో చెబుతుంది పనమ్మాయి. దీంతో జానకి వెళ్లి అతడితో మాట్లాడుతుంది. నీకు నీ భార్య మీద అంత ప్రేమ ఉంటే ఎందుకు విడాకులు ఇస్తా అంటున్నావు అంటూ బెదిరిస్తుంది.
మా అమ్మ మాటే నాకు వేదవాక్కు అంటాడు అతడు. మీ అమ్మ అంటే ప్రేమ ఉండే.. నీ భార్య గురించి సర్దిచెప్పాలి కానీ.. ఇలా హింసించడం ఏంటి.. అంటూ సీరియస్ అవుతుంది. అంత ప్రేమ ఉంటే ఎందుకు చచ్చినట్టు పని చేపిస్తున్నావు. అది హింస కాదా? అంటూ సీరియస్ అవడంతో అక్కడే ఉన్న జ్ఞానాంబ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
Good News from the Central Government for the Common Man : దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న…
Wheat Distribution in Ration Card Holders : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టి సారించి, కొత్త…
This website uses cookies.