Home » Entertainment » Janaki Kalaganaledu 14 November 2022 Full Episode
Entertainment

Janaki Kalaganaledu 14 Nov Today Episode : జ్ఞానాంబకు షాకిచ్చిన సునంద.. అఖిల్ బయటికి రాకుండా ఎస్ఐతో కలిసి ప్లాన్ చేసిన సునంద.. ఈ విషయం జానకికి తెలుస్తుందా?

Authored By
Varun G
The Telugu News | Published on: November 14, 2022, 9:00 am
Advertisement

Janaki Kalaganaledu 14 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 నవంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 431 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను ఏ తప్పు చేయలేదు. వదినను నేను దేవతగా భావించాను. కానీ.. తను నన్ను ఇలా చేసింది. వదినను పోలీస్ స్టేషన్ కు ఒక్కసారి రమ్మను. నేను తన కాళ్లు పట్టకొని అయినా ఈ కేసు నుంచి బయట పడతా అంటాడు అఖిల్. కానీ.. అది కుదరదు అని అంటుంది జ్ఞానాంబ. అసలు జానకి ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది అంటుంది జ్ఞానాంబ. దీంతో చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తోంది అంటాడు రామా. ఏం చేయాలో రామాకు అర్థం కాదు. అఖిల్ ఇంకా ఏడుస్తాడు. మరోవైపు ఇంటి బయట కూర్చొని జానకి అఖిల్ విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన మల్లిక.. జానకితో మాట్లాడుతుంది. నీ అదృష్టం గిర్రున తిరిగింది. దురదృష్టం తలుపు తట్టింది. అత్తయ్య గారు, బావ గారికి నీ మీద ఉన్న నమ్మకాన్ని నువ్వు అవుట్ చేసుకున్నావు. ఇంటి కెప్టెన్సీ ఇచ్చారు కదా అని చెప్పేసి ప్లేయర్లతో ఆడుకోవాలని చూస్తే ఇలాగే ఉంటుంది జానకి అంటుంది.

Advertisement

janaki kalaganaledu 14 november 2022 full episode

దీంతో నేనే నిజం అని ఆ దేవుడు ఖచ్చితంగా నిరూపిస్తాడు. నీ టైమ్ బాగుండి నీ ఫేక్ ప్రెగ్నెన్సీ బయట పెట్టేలోపు అఖిల్ సమస్య ముందుకొచ్చింది. అది పరిష్కారం కాగానే తర్వాత నువ్వే. ఈసారి నేను కొట్టేది సిక్సే. కొడితే స్టేడియం అవతల పడతావు అంటుంది జానకి. దీంతో అయ్యో నాకు భయమేస్తోంది జానకి. ఎక్కడ దాక్కోను.. ఇక్కడ దాక్కోనా అని అంటుంది. దీంతో దీనికేం తక్కువ లేదు. ఈ వెటకారాలన్నీ కొన్నిరోజులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జానకి. దీంతో అప్పటి వరకు నిన్ను ఇంట్లో ఉండనిస్తే కదా.. అప్పటి వరకు నువ్వు ఇంట్లో వెళ్లిపోతావు అని అనుకుంటుంది మల్లిక. మరోవైపు పోలీస్ స్టేషన్ నుంచి జ్ఞానాంబ ఫ్యామిలీ బయలుదేరుతుంది. కోర్టు ద్వారా బెయిల్ తీసుకోవడం తప్ప మీకు మరో మార్గం లేదు అంటాడు ఎస్ఐ. దీంతో సరేననండి అని అంటాడు రామా.

Advertisement

పోలీస్ స్టేషన్ నుంచి జ్ఞానాంబ ఫ్యామిలీ బయటికి వస్తుండగా అప్పుడే కారులో అక్కడికి వస్తుంది సునంద. అయ్యయ్యో.. నిన్ను చూస్తే నాకు జాలా ఉంది జ్ఞానాంబ అని కారు దిగి వచ్చిన సునంద అంటుంది. నువ్వంటే నాకు పడకపోయినా నీ నిజాయితీ అంటే నాకు మర్యాద అంటుంది.

కానీ.. నీ కొడుకు చేసిన పనికి ఆ రెండూ మంట కలిసి పోయి నువ్వు స్టేషన్ మెట్లు ఎక్కడం చూస్తుంటే బాధగా ఉంది అంటుంది సునంద. నీ పరువుకు మచ్చ పడింది. నీకు ఎలా ఉందో కానీ.. నీ పరిస్థితి చూస్తుంటే నేనే తట్టుకోలేకపోతున్నాను అంటుంది సునంద.

Advertisement

Janaki Kalaganaledu 14 Nov Today Episode : జెస్సీ తండ్రికి ఫోన్ చేసి అఖిల్ అరెస్ట్ గురించి చెప్పిన మల్లిక

నువ్వేమో నీ కోడలును పోలీస్ ఆఫీసర్ ను చేయాలని కలలు కన్నావు. అదే ఎదురు తిరిగి నీ కొంప ముంచి నీ కొడుకును నేరస్థుడిలా సమాజం ముందు నిలబెట్టింది. నువ్వు నీ కుటుంబాన్ని నడిపించే తీరు, హుందాతనం చూసి నాకు ఈర్ష్యం కలిగేది. కానీ.. ఈరోజు నుంచి నీ కొడుకు చేసిన పని వల్ల నువ్వు ఇలా తలదించుకునే స్థితికి రావడం చూసి నాకు చాలా బాధగా ఉంది జ్ఞానాంబ అంటుంది సునంద.

సర్లే ఏం చేస్తాం. మనం ఎంత బాగా బతికినా తలరాత కొన్ని సార్లు ఎదురు తిరుగుతుంది. కంగారు పడకు. నీకు పోయిన పరువును తీసుకురాకపోయినా నీ కొడుకును బయటికి తీసుకురావడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. వస్తాను జ్ఞానాంబ అని చెప్పి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తుంది సునంద.

పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సునంద.. అఖిల్ నే చూస్తుంటుంది. మీతో పర్సనల్ గా మాట్లాడాలి కానీ.. ఇక్కడ కాదు అంటుంది సునంద ఎస్ఐతో. దీంతో లోపలికి తీసుకెళ్లి మాట్లాడుతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ జ్ఞానాంబ కొడుకు అఖిల్ బయటికి రాకూడదు. అందుకు మీరు చేయాల్సింది మీరు చేయండి. నేను చేయాల్సింది నేను చూసుకుంటాను అని చెబుతుంది సునంద.

దీంతో సరే మేడమ్ అంటాడు ఎస్ఐ. నిజంగానే జానకి తన ఫేక్ ప్రెగ్నెన్సీ గురించి జ్ఞానాంబకు చెబుతుందా అని అనుకొని జానకిని ఎలాగైనా ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలని అనుకుంటుంది. అందుకు వెంటనే జెస్సీ వాళ్ల తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని అనుకుంటుంది.

Advertisement

వెంటనే జెస్సీ తండ్రికి ఫోన్ చేస్తుంది. జానకి మీకు మేలు చేస్తున్నట్టుగా నటిస్తూనే వెనుక నుంచి బాధ కలిగించే పనులు చేస్తోంది అంటుంది మల్లిక. దీంతో జానకి చాలా మంచిది. తన వల్లే నా కూతురు జీవితానికి ఒక దారి దొరికింది అంటాడు పీటర్. అసలు జానకి ఏం చేసింది అని అడుగుతాడు.

దీంతో మీ అల్లుడు అఖిల్ మీద హత్యా ప్రయత్నం కేసు పెట్టి పోలీసులతో అరెస్ట్ చేయించింది అంటుంది మల్లిక. దీంతో పీటర్ షాక్ అవుతాడు. ఎవరో అమ్మాయిని చంపబోయాడని కేసులో ఇరికించింది అంటుంది. మా బావ గారు, అత్తయ్య గారు కూడా కేసు వెనక్కి తీసుకో అని ప్రాధేయపడ్డారు.

అయినా కూడా తను వినలేదు అంటుంది మల్లిక. పాపం.. భర్తను పోలీసులు తీసుకెళ్లిపోతున్నారని జెస్సీ ఏడుస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోయింది అంటుంది. అఖిల్ కు తల్లిలాంటి దాన్ని అన్ని పైకి వెన్న పూస్తూనే అందరికీ గాయం చేసింది జానకి అంటుంది మల్లిక.

జానకి తప్పు చేసిందని తనను ఏం అనకండి. కోప్పడకండి. సరే బాబాయి ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది మల్లిక. నేను పెట్టిన ఈ చిచ్చు జానకిని ఇంట్లో నుంచి బయటికి పంపించేలా చేస్తుంది అని అనుకుంటుంది మల్లిక. మరోవైపు ఈ విషయాన్ని పీటర్ తన భార్యకు చెబుతాడు.

Advertisement

మరిదిని హత్యా ప్రయత్నం మీద జానకి అరెస్ట్ చేయించడం ఏంటి. ఒకసారి జెస్సీకి ఫోన్ చేయండి అంటుంది మేరీ. దీంతో పీటర్.. ఫోన్ చేస్తాడు. కానీ.. జెస్సీ ఫోన్ లిఫ్ట్ చేయదు. దీంతో మనమే ఒకసారి ఇంటికి వెళ్దాం పదా అంటాడు పీటర్. మరోవైపు రామా, విష్ణు.. ఇద్దరూ లాయర్ దగ్గరికి వెళ్లి అన్నీ చెబుతారు.

ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా అని అడుగుతాడు లాయర్. దీంతో ఫైల్ అయింది అంటారు. దీంతో ఎస్ఐ దగ్గరికి వెళ్లి ఎఫ్ఐఆర్ తీసుకురండి అంటాడు. ఆ తర్వాత జానకితో ఈ కేసును విత్ డ్రా చేసుకోమని చెప్పండి అంటాడు. దీంతో జానకిని మళ్లీ బతిమిలాడుతాడు రామా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి