Janaki Kalaganaledu 16 Nov Today Episode : జానకికి విడాకులు ఇస్తా అని రామా బెదిరించడంతో అఖిల్ ను బయటికి తీసుకొచ్చిన జానకి.. ఆ తర్వాత రామాకు షాకిచ్చిన జానకి

Janaki Kalaganaledu 16 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 నవంబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 433 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జెస్సీతో మల్లిక మాట్లాడటం విన్న రామా వెంటనే లాయర్ కు ఫోన్ చేసి తన తమ్ముడికి ఏ శిక్ష పడే అవకాశం ఉందని అడుగుతాడు. దీంతో ఉరి శిక్ష కానీ.. జీవిత ఖైదు కానీ పడే అవకాశం ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమ్మాయి చనిపోతే, కోర్టులో జానకి సాక్ష్యం చెబితే ఖచ్చితంగా ఆ రెండింటిలో ఒక శిక్ష మాత్రం పడే అవకాశం ఉంది అని చెబుతాడు లాయర్. దీంతో ఏం చేయాలో రామాకు అర్థం కాదు. మరోవైపు జానకి దగ్గరికి వెళ్లిన గోవిందరాజు.. నా కొడుకును బయటికి తీసుకురా అని బతిమిలాడుతాడు. నువ్వు నాకు ఈ సాయం చేస్తే నేను నా భార్యను నేను కాపాడుకోగలుగుతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు గోవిందరాజు. దీంతో జానకి ఏడుస్తుంది. తనకు ఏం చేయాలో అర్థం కాదు.

janaki kalaganaledu 16 november 2022 full episode

మరోవైపు రామా సీరియస్ గా అఖిల్ గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడు కనుక కంప్లయింట్ వెనక్కి తీసుకోకపోతే వాడి జీవితం నాశనం అవుతుంది. ఇప్పుడే జానకి గారితో మాట్లాడుతాను అని అనుకుంటాడు రామా. మరోవైపు గోవిందరాజు అన్న మాటలనే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది జానకి. ఇంతలో రామా ఆవేశంగా వస్తాడు. జానకి గారు.. నేను అడిగిన దానికి నేరుగా నా దగ్గరికి వచ్చి మీ నిర్ణయం మార్చుకున్నాను అని చెబుతారనుకొన్నాను. కానీ.. మీరు అది చేయలేదు. రేపు మధ్యాహ్నం కల్లా అఖిల్ ను కోర్టుకు తీసుకెళ్తారు. మీరు రెడీగా ఉండండి. స్టేషన్ కు వెళ్లి కేసు వాపసు తీసుకుందాం అని చెప్పి రామా వెళ్లబోతాడు. దీంతో సారీ రామా గారు. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. నేను కేసును వెనక్కి తీసుకోలేను. దయచేసి అర్థం చేసుకోండి అంటుంది జానకి.

దీంతో ఇంకా నేను అర్థం చేసుకునేది ఏంటి. మీరే ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఐపీఎస్ ఆఫీసర్ అవడం మీ నాన్న గారి కల, మీ ఆశయం అని చెబితే మా అమ్మకు అబద్ధం చెప్పి నేను మీ పక్కన నిలబడ్డాను. ఎందువల్ల.. అది మిమ్మల్ని అర్థం చేసుకోవడం కాదా. అఖిల్ ప్రేమ విషయంలో కూడా జెస్సీ కోసం మీ పక్కన నిలబడ్డాను అంటాడు రామా.

ఆ నమ్మకం ఇప్పుడు లేదా రామా గారు అంటుంది జానకి. దీంతో అప్పుడు మీ పక్కన నిలబడింది మీ ఆశయం నెరవేర్చడం కోసం. కానీ.. ఇప్పుడు కూడా మీ పక్కన నిలబడితే నా తమ్ముడిని ఎక్కడ దూరం చేసుకోవాల్సి వస్తుందో అని అంటాడు రామా. ఇప్పుడు జెస్సీని మోసం చేసిన వాడిని అవుతాను అంటాడు రామా.

మా అమ్మ ఎలాంటి మనిషో మీకు తెలుసు జానకి గారు. అవసరం అయితే మిమ్మల్ని శాసించగలదు కానీ.. ఆ పని చేయలేదు. అత్తింటి గౌరవాన్ని నిలబట్టే విషయంలో మిమ్మల్ని పూర్తిగా నమ్మి ఒక తల్లిలా, కూతురులా మిమ్మల్ని కడుపులో పెట్టుకుంది.. అంటాడు రామా.

Janaki Kalaganaledu 16 Nov Today Episode : రేపు ఉదయం 10 గంటల వరకు మీ నిర్ణయం చెప్పాలని జానకికి చెప్పిన రామా

మీ సమాధానం కోసం మౌనంగా ఎదురు చూస్తోంది తప్ప మిమ్మల్ని నిలదీయలేదు. ఇవేవీ ఆలోచించడం లేదా జానకి గారు అంటాడు రామా. కన్న కొడుకు గురించి ఆరాటపడుతున్న ఆ తల్లి బాధ మీకు అర్థం కావడం లేదా అని అడిగితే.. నాకు కూడా నా మరిది స్టేషన్ లో ఉన్నాడని బాధ ఉంది అంటుంది జానకి.

మీరు కనీసం ఈ విషయం అమ్మకు కూడా చెప్పకుండా మీ నిర్ణయం మీరు తీసేసుకున్నారు. నా తమ్ముడిని నేను కాపాడుకోలేకపోతే వాడి అన్నగా కూడా నమ్మకాన్ని కోల్పోతాను. అందుకు నేను సిద్ధంగా లేను జానకి గారు అంటాడు రామా. దీంతో ఎలా చెబితే మీకు అర్థం అవుతుంది రామా గారు అంటుంది జానకి.

ఒక ఆడపిల్ల మీద హత్యా ప్రయత్నం చేసింది నా మరిది కాకపోతే బాగుండు అని నేను ఎలా అనుకున్నానో మీకు ఏం తెలుసు. నా మరిది మీద కేసు పెట్టినప్పుడు నేను ఎంత బాధపడ్డానో మీకేం తెలుసు అంటుంది జానకి. మీరు నిజంగా అలా ఆలోచించి ఉంటే ఈ పని చేసేవాళ్లు కాదు. ఎవరికో న్యాయం చేయాలని చెప్పి మీ కుటుంబాన్ని అన్యాయం చేస్తున్నారు అంటాడు రామా.

నా తమ్ముడు రేపు జైలుకు వెళ్తే నేను రేపు మీతో సంతోషంగా ఉండలేను. రేపు ఉదయం 10 గంటలకు కేసు వెనక్కి తీసుకొని నా తమ్ముడిని తీసుకొస్తా అని మీ నిర్ణయం నాకు చెప్పాలి అని అంటాడు రామా. దీంతో ఇన్నాళ్ల నా చదువు, నా సంస్కారం, ధర్మాన్ని కాపాడాలన్న సంకల్పం, న్యాయాన్ని రక్షించాలన్న ఆశయం వీటన్నింటినీ దాటి మీరు చెప్పినట్టు నేను చేయలేనండి అంటుంది జానకి.

ఒక బిడ్డ గురించి తల్లి పడుతున్న కన్నీటిని అర్థం చేసుకోలేనప్పుడు, ఒక భర్త పడుతున్న ఆరాటం అర్థం చేసుకోలేనప్పుడు మీరు చదువుకున్న చదువు, న్యాయం, నీతి ఎందుకండి అని జానకిపై సీరియస్ అవుతాడు రామా. దీంతో దానికోసమే అయితే నా చదువుకు అర్థం లేదు కదా అంటుంది జానకి.

మీ చదువు నా తమ్ముడిని నాకు దూరం చేస్తుంది అంటే అందుకు నేను ఒప్పుకోను అంటాడు రామా. మీకు చదువు ఎంత ముఖ్యమో.. నాకు నా కుటుంబం కూడా అంతే ముఖ్యం. మీకు మీ సిద్ధాంతం ఎంత ముఖ్యమో.. నాకు నా బంధం కూడా అంతే ముఖ్యం. నా తమ్ముడిని కాపాడలేకపోతే.. మీ చదువును నేను ఒప్పుకోలేను. చదువా.. కుటుంబమా.. మీరే నిర్ణయం తీసుకోండి. అది కూడా రేపు ఉదయం 10 గంటల వరకు మాత్రమే. మీ నోటితో మీరే వచ్చి చెప్పాలి. మీ నిర్ణయం ఏంటని.. అని అంటాడు రామా.

మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు. నేను చెప్పేది కూడా వినండి. మీది మీ తమ్ముడిది రక్త సంబంధం. మధ్యలో వచ్చిన నాదేముంది. కానీ.. నేను సమాజానికి, మా నాన్న గారికి నేను మాటిచ్చాను. నా చదువు గురించి అత్తయ్య గారికి అబద్ధం చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు కూడా నా ముందు లక్ష్యం ఉంది కాబట్టి అబద్ధం చెప్పాను.

నా కళ్ల ముందు జరిగిన అన్యాయానికి అడ్డు తిరిగినందుకే నేను ఇప్పుడు ఇలా అయ్యాను. నాకు అమ్మానాన్నలు లేరు. ఉన్న అన్నయ్య కూడా నాకు దూరంగానే ఉన్నాడు. నాకు ఉన్నది మీరే. నన్ను చేయి పట్టి నడిపించే తోడు దొరికిందని చాలా సంతోషించాను.

కానీ.. ఈరోజు ఏదైతే కల కోసం నేను కష్టపడుతున్నానో.. దాన్ని మన కుటుంబంలో ఒకరి కోసం వదులుకోవాలి అన్నారు కదా.. నేను నమ్మేది, బతికేది మీకోసమే. మీరే ఒక నిర్ణయం తీసుకోవాలని అన్నాక.. మిమ్మల్ని దాటి నేను ఏ నిర్ణయం తీసుకోలేను.

అందుకే నాకు ఈ చదువు వద్దు. నా ఐపీఎస్ ను వదిలేస్తున్నాను.. అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది జానకి. మీరు కోరుకున్నట్టే మీ తమ్ముడిని బయటికి తీసుకొస్తాను. అది మీకు ఇష్టమే కదా అంటూ వెనక్కి తిరిగి చూస్తుంది జానకి. కానీ.. అక్కడ రామా ఉండడు.

దీంతో జానకికి ఏం చేయాలో అర్థం కాదు. నేను చెప్పింది రామా గారు వినలేదన్నమాట. మీరు వినకూడదని దేవుడు ఇలా చేశాడా? మీకు కావాల్సింది మీ తమ్ముడిని బయటికి తీసుకురావడం, నా ఆశయాన్ని వదిలి.. అఖిల్ ను బయటికి తీసుకొస్తాను రామా గారు.

మీకోసం, మీ కుటుంబం కోసం తీసుకొస్తాను.. అని అనుకుంటుంది జానకి. ఉదయమే రామా, జానకి లాయర్ తో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

2 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

4 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

5 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

6 hours ago

Tulsi Leaves | తులసి నీరు ఆరోగ్యానికి చాలా ఉప‌యోగం.. నిపుణులు చెబుతున్న అద్భుత ప్రయోజనాలు

Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…

7 hours ago

Garlic Peel Benefits | వెల్లుల్లి తొక్కలు పనికిరానివి కావు. .. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు

Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…

8 hours ago

Health Tips | బరువు తగ్గాలనుకుంటున్నారా? గ్రీన్ టీ బెటరా? మోరింగ టీ బెటరా?

Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…

9 hours ago

Diwali | దీపావళి 2025: ఖచ్చితమైన తేదీ, శుభ సమయం, పూజా విధానం ఏంటి?

Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…

10 hours ago