Janaki Kalaganaledu 18 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. సీరియల్ తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. జానకి కలగనలేదు సీరియల్ 18 అక్టోబర్, 2021 సోమవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి చదువు విషయం తెలుసుకున్నా కూడా జానకిని ఏమీ అనలేదు జ్ఞానాంబ. అంతే కాదు తను తెచ్చిన చీర కట్టుకొని జానకి బర్త్ డే వేడుకలకు హాజరు అవుతుంది జ్ఞానాంబ. కానీ.. హుషారుగా ఉండదు. ఏదో బాధపడుతూ ఉంటుంది. తనకు కేక్ తినిపించబోయినా కూడా వద్దు.. ముందు రామాకు తినిపించు అని చెబుతుంది.
ఆ తర్వాత తెల్లారాక.. గోవిందరాజును జానకిని తెగ పొగుడుతాడు. జానకి లాంటి కోడలు దొరకడం తమ అదృష్టం అని అంటాడు. జ్ఞానాంబ మాత్రం ఏం మాట్లాడదు. జ్ఞానాంబ ఇంకా బాధపడుతూనే ఉంటుంది. మామయ్య గారు ట్యాబ్లెట్ వేసుకోండి.. అని చెబుతుంది. షుగర్ ట్యాబ్లెట్ వేసుకోండి.. నేను చాయ్ తీసుకొస్తా అని చెబుతుంది. ఇంతలో రామా.. కొట్టుకు వెళ్లబోతుండగా ఒరేయ్ రామా.. జానకి చాయ్ చేస్తుంది.. తాగిపో అని చెబుతాడు. ఇవన్నీ చూసి మల్లికకు అస్సలు నచ్చదు.
జానకి కిచెన్ కు వెళ్లి చాయ్ పెడుతుంది. ఇంతలో అక్కడికి రామా వస్తాడు. ఏమైంది అని అడుగుతుంది జానకి. చాయ్ తాగి వెళ్లమని నాన్న చెప్పాడు అంటాడు. ఇక.. తన రొమాన్స్ ను స్టార్ట్ చేస్తాడు రామా. మరి.. మరి.. అంటూ తన చేతులను తాకేందుకు ప్రయత్నిస్తాడు. కానీ.. జానకి మాత్రం వద్దని వారిస్తుంటుంది. మొత్తం మీద ఇద్దరూ కాసేపు సరసాలు ఆడుకుంటారు.
మరోవైపు తన అంతరాత్మతో జ్ఞానాంబ మాట్లాడుతుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు, బంగారం లాంటి నూరేళ్ల జీవితం.. అన్నింటికి మించి పెద్దకొడుకు అంటే పంచప్రాణాలు.. అని జ్ఞానాంబ అంతరాత్మ అడుగుతుంది. భయపడటంలో అర్థం ఉంది. కానీ భయపడినట్టు జరుగుతుంది అని అనుకోవడంలోనే అర్థం లేదు.. అని మరో అంతరాత్మ అంటుంది. ఒకసారి సొంత తమ్ముడి విషయంలో ఎదురుదెబ్బ తగిలాక కూడా భయపడకపోతే.. జాగ్రత్త పడకపోతే ఎలా? అని అంటుంది మరో అంతరాత్మ.
ఎప్పుడో ఒకసారి అలా జరిగిందని ఎల్లప్పుడూ అలాగే జరుగుతుందా? అని మరో అంతరాత్మ అంటుంది. తమ్ముడి విషయంలో జరిగిందే కొడుకు విషయంలో జరగదని నమ్మకం ఏంటి? అని ప్రశ్నిస్తుంది. జరగదు.. జరగదంటే జరగదు.. అని చెబుతుంది అంతరాత్మ. దీన్నిబట్టి జ్ఞానాంబ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.