janaki kalaganaledu 18 april 2022 full episode
Janaki Kalaganaledu 18 April Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 ఏప్రిల్ 2022, సోమవారం ఎపిసోడ్ 281 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శ్రీరామనవమి వేడుకలకు అందరూ గుడికి వెళ్తారు. అప్పుడే రామా, జానకి కూడా గుడికి వెళ్తారు. వాళ్ల వెనుకే వీళ్లు కూడా వెళ్తారు. గుడిలోకి వెళ్లేందుకు చెప్పులు విప్పుతుంది జ్ఞానాంబ. ఇంతలో రామా కూడా అక్కడే చెప్పులు విప్పి.. తన కాళ్లు మొక్కేందుకు ప్రయత్నిస్తాడు. కానీ.. తనను చూసి కాళ్లను వెనక్కి అనుకుంటుంది జ్ఞానాంబ. దీంతో అందరూ షాక్ అవుతారు. మల్లిక మంచిగయింది అనుకుంటుంది.
janaki kalaganaledu 18 april 2022 full episode
ఇంతలో జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తను వెళ్లిపోవడంతో రామాకు ఏం చేయాలో అర్థం కాదు. రామా.. నువ్వేం బాధపడకురా. కోపం అయితే ఒక గంట.. రెండు గంటలు.. మహా అయితే ఒకటి రెండు రోజులు. కానీ.. మీ అమ్మది ప్రేమ తాలుకు బాధ. అందుకే.. ఆ బాధ నుంచి మీ అమ్మ బయటికి రాలేకపోతోంది. మిమ్మల్ని దగ్గరికి తీసుకోలేకపోతోంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత విష్ణు, వెన్నెల, అఖిల్ అందరూ వచ్చి హ్యాపీ శ్రీరామనవమి అంటారు. ఇంతలో మల్లిక వచ్చి పదండి.. పదండి.. లోపలికి వెళ్దాం అని తీసుకెళ్తుంది. ఏమండి వెళ్దాం పదండి అంటుంది.
దీంతో ప్రతి శ్రీరామనవమికి అమ్మ ఆశీర్వాదం తీసుకున్నాకే నేను ఇంట్లో నుంచి కాలు బయట పెట్టేవాడిని. కానీ.. ఇంతకుముందు అమ్మ ఆశీర్వాదం తీసుకుందామనుకునేసరికి.. అమ్మ కాలును వెనక్కి పెట్టింది. నాకు ఇంతకన్నా నరకం ఉంటుందా అని అనుకుంటాడు.
ఆ తర్వాత నేను దండం పెట్టుకోవడానికి అమ్మ పాదాలు అయితే ఏంటి.. చెప్పులు అయితే ఏంటి. ఆనాడు భరతుడు.. అన్న పాదరక్షలు సింహాసనం మీద పెట్టి రాజ్యమేలాడట. నేను ఇప్పుడు ఈ రూపంలో అమ్మ ఆశీర్వాదం పొందుతా అని అనుకుంటాడు రామా.
ఆ తర్వాత పూజారి జ్ఞానాంబ ఫ్యామిలీని పిలుస్తాడు. మీ పెద్దబ్బాయి.. పెద్ద కోడలు రాలేదేంటమ్మా అని అడుగుతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి మీ పెద్దబ్బాయి రామచంద్ర మీ పక్కనే ఉంటారు కదా. మరి ఈ సంవత్సరం రాలేదు ఏంటి అని అడుగుతాడు.
దీంతో ఏమైంది జ్ఞానాంబ గారు మీ కుటుంబంలో ఏవైనా గొడవలా ఏంటి అని అడుగుతారు పెద్దలు. మీకు మీ పెద్దకొడుకు, కోడలుతో మాటలు లేవా ఏంటి అని అడుగుతారు. ఏం మాట్లాడుతున్నారండి.. మీరు అనుకుంటున్నట్టు అలా ఏమీ లేదు.. మా పెద్దకొడుకు, కోడలు అదిగో అక్కడ ఉన్నారు అంటాడు గోవిందరాజు.
దీంతో సరే అంటారు. ఒరేయ్ రాముడు, జానకి.. రండి ఇటు.. మీ అమ్మ పిలుస్తోంది.. రండి అంటాడు. ఇంతలో రామా, జానకి వస్తారు. రామా, జానకి చేతుల మీదుగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తాడు పంతులు గారు. తర్వాత ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లి కళ్యాణ మండపంలో పెడతారు జ్ఞానాంబ, రామా. అందరూ కూర్చుంటారు.
ఇంతలో విష్ణు, మల్లిక పీటల మీద కూర్చుంటారు. దీంతో వాళ్లను లేపి.. రామా, జానకిని కూర్చోబెడతాడు గోవిందరాజు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.