
janaki kalaganaledu 18 july 2022 full episode
Janaki Kalaganaledu 18 July Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 జులై 2022, సోమవారం ఎపిసోడ్ 346 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రామాను పట్టుకొని రూమ్ లోకి తీసుకెళ్తుంది జానకి. నేను చెప్పిన విషయం మీకు గుర్తుందని నాకు తెలుసు.. మీరు మరిచిపోకుండా మల్లెపూలు తీసుకొస్తారని నాకు తెలుసు. ఇలా ఇవ్వండి అంటుంది. దీంతో తీసుకురాలేదండి అంటాడు రామా. దీంతో ఎందుకు తీసుకురాలేదు అని అడుగుతుంది జానకి. కావాలనే తీసుకురాలేదు అంటాడు రామా. నేను అంతలా చెప్పాక కూడా మీరు మరిచిపోవడం ఏంటి స్వామీ అంటుంది జానకి. దీంతో చూడండి జానకి గారు మీరు ఇప్పుడు చదువుకోవడానికి బడికి వెళ్లాలి. అవి పెట్టుకొని వెళ్తే బాగోదు. వెళ్లండి. ముందు వెళ్లి రెడీ అవ్వండి అంటాడు రామా. దీంతో నేను ఇవాళ అకాడెమీకి వెళ్లను అంటుంది జానకి. నేను అలిగాను అంటుంది జానకి.
janaki kalaganaledu 18 july 2022 full episode
దీంతో ఏం కాదు వెళ్లండి.. చెప్పేది వినండి అంటాడు రామా. కానీ.. జానకి మాత్రం నేను వెళ్లను. అకాడెమీకి ఇవాళ సెలవు అంటుంది జానకి. దీంతో ఓహో అవునా అంటాడు. తను మల్లెపూలు తేకున్నా.. తనదగ్గర ఉన్న మల్లెపూలు రామాకు ఇస్తుంది. అత్తయ్య గారు మాల కట్టి ఇచ్చారు.. అంటుంది. వెంటనే పెట్టేయండి అంటుంది. దీంతో నేను స్నానానికి వెళ్లాలి. మీరు పెట్టుకోండి అంటాడు రామా. కానీ.. జానకి వినదు. పెట్టండి అంటుంది జానకి. రామా గారు త్వరగా పెట్టండి అంటుంది జానకి. దీంతో పెడుతున్నాను ఆగండి అంటాడు. పెట్టిన తర్వాత పూల వాసన ఎలా ఉంది అని అడుగుతుంది జానకి. దీంతో చూసి చెబుతాను అంటాడు రామా. వాసన చూస్తుండగా తను ముందుకు తిరుగుతుంది.
దీంతో ఒకరిని మరొకరు చూసుకుంటారు. ఆ తర్వాత రామాకు మూడ్ వస్తుంది. ఇంతలో తేరుకొని నేను స్నానం చేయాలి అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు రామా. స్నానం చేసి వచ్చాక ఇద్దరూ పడుకుంటారు. రామా ముసుగు వేసుకొని పడుకుంటాడు.
కానీ.. అతడికి జానకే గుర్తొస్తుంది. మల్లెపూల వాసనే గుర్తొస్తుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాదు. తను ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం అని చూసేసరికి.. తను నిద్రపోతున్నట్టు నటిస్తుంటుంది. తన మీద చేయి వేస్తాడు. దీంతో ఇందాక దూరం దూరం అన్నారు. నేను నిద్రపోతుంటే ఇప్పుడేమో ఇంత దగ్గరగా వచ్చారా? అమ్మ దొంగ మీరు మామూలోళ్లు కాదు అంటుంది జానకి.
దీంతో నాకేం తెలియదు అంటాడు రామా. కట్ చేస్తే తెల్లవారుతుంది. కాలేజీకి వెళ్లాలి. త్వరగా టిఫిన్ పెట్టు చికిత అంటారు అఖిల్, వెన్నెల. వాళ్లు టిఫిన్ చేస్తుండగా మల్లిక హాల్ లోకి వచ్చి.. జానకికి రాత్రి పూట కాలేజీ నుంచి ఫోన్ వచ్చింది అంటే ఆ పోలేరమ్మ నమ్ముతుందో నమ్మదో అని అనుకుంటుంది.
దీంతో వెన్నెల, అఖిల్ దగ్గరికి వెళ్లి ఎవరో కాలేజీ నుంచి ఫోన్ చేసి ఒరిజినల్ సర్టిఫికెట్స్ తసుకురమ్మన్నారు అంటుంది. అవునా.. మా కాలేజీ వాళ్ల. వాళ్లు డే టైమ్ లో ఫోన్ చేస్తారు అంటారు. ఇంతలో జ్ఞానాంబ, గోవిందరాజు ఇద్దరూ వస్తారు. ఏంటో రాత్రి పూట కాలేజీ నుంచి ఫోన్లు రావడం అని కావాలని అంటుంది జ్ఞానాంబ.
ఏదేదో మల్లిక గునుగుతూ ఉంటే.. ఆపు ఇక అంటుంది జ్ఞానాంబ. ఇంతలో రామా, జానకి ఇద్దరూ వస్తారు. వాళ్లను టిఫిన్ తినండి అని అంటాడు గోవిందరాజు. నువ్వు కూడా కూర్చొని తిను అని మల్లిక తో అంటాడు గోవిందరాజు. టిఫిన్ చేస్తుండగా… రామా కాలి మీద కాలేస్తుంది జానకి. తన కాలితో తన కాలిని అటూ ఇటూ అంటుంది. దీంతో రామాకు ఏం చేయాలో అర్థం కాదు.
ఆ తర్వాత అతడి నడుము గిల్లుతుంది జానకి. దీంతో అబ్బో అంటాడు. అందరూ షాక్ అవుతారు. ఏమైంది అని అంటాడు గోవిందరాజు. దీంతో అల్లం ముక్క.. అరిచాను అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.