Janaki Kalaganaledu 18 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 నవంబర్ 2021, గురువారం 174 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి.. రామాకు ఫోన్ చేస్తుంది. రామా ఫోన్ వేరే చోట ఉండటంతో లేవబోగా.. మైరావతి చూసి ఎందుకు లేస్తున్నావు అంటుంది. ఫోన్ అనగానే.. పూజలో కూర్చున్నాక లేవకూడదు అంటుంది. ఆ ఫోన్ ను గోదావరి తెచ్చి ఇస్తుంది. రామాకు ఎవరు ఫోన్ చేస్తున్నారో చూసి చెప్పు విష్ణు అంటుంది. ఇంతలో ఆ ఫోన్ ను మల్లిక గుంజుకోవడంతో మైరావతికి కోపం వస్తుంది.
అరెయ్ విష్ణు.. ముందు నీ పెళ్లాన్ని తీసుకెళ్లి ఆ బీరువా మీద కూర్చోబెట్టు అంటుంది మైరావతి. దీంతో తనను తీసుకెళ్లి విష్ణు.. ఆ బీరువా మీద కూర్చోబెడతాడు. మరోవైపు పూజకు సమయం అవుతున్నా ఇంకా ఎందుకు జానకి రావడం లేదు అని జ్ఞానాంబ అనుకుంటుంది. ఇంతలో రామా మంచినీళ్లు తాగి వస్తా అని చెప్పి జానకి రూమ్ కు వెళ్తాడు. ఏమండి.. వెంటనే మల్లిక లేదా చికితను రమ్మని చెప్పండి అంటుంది. దీంతో ఇప్పుడు వాళ్లు వచ్చేంత సమయం లేదండి అంటాడు రామా.
ఏమైందో చెప్పండి.. నేను చేస్తా అంటే జాకెట్ హుక్కు పెట్టండి అంటుంది. సరే.. అని చెప్పి జాకెట్ హుక్కు పెడుతాడు రామా. ఇంతలో జానకి పరవశించిపోతుంది. జానకి గారు ఆ చీర కుచ్చిళ్లు ఏంటండి అలా పెట్టుకున్నారు అంటాడు రామా. నాకు పట్టుచీర కట్టుకోవడం సరిగ్గా రాదు అంటుంది. దీంతో రామానే తన చీర కుచ్చిళ్లను సరి చేస్తాడు.
వెంటనే పూజకు వచ్చేయండి అని చెప్పి రామా వెళ్లిపోతాడు. రామా వచ్చి కూర్చుంటాడు. అయినా ఇంకా జానకి రాకపోయేసరికి.. మైరావతికి కోపం వస్తుంది. అంతలోనే జానకి ఆతృతగా దిగి రాబోతూ.. మెట్ల మీద జారి పడుతుంది. అయినా సరే.. నొప్పిని ఓర్చుకొని పూజ కోసం వస్తుంది జానకి.
కానీ.. మైరావతికి కోపం వస్తుంది. టైమ్ ఎంతయింది అంటుంది. 8.31 నిమిషాలు అంటుంది. ఎన్ని గంటలకు నేను పూజలో కూర్చోవాలని చెప్పాను అని అడుగుతుంది. 8.30 అని చెబుతుంది జానకి. ఎన్ని గంటలకు రమ్మని చెప్పా నేను.. నువ్వెప్పుడు వచ్చావు అని ప్లేట్లు అన్నీ పడేస్తుంది. పూజ లేదు.. గీజ లేదు అని అంటుంది.
నేను నీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా.. అంటుంది మైరావతి. నేను చెప్పేది వినండి అమ్మమ్మ గారు అన్నా కూడా వినదు మైరావతి. ఏం చెప్తావు.. నాకు పెద్దవాళ్ల మాట మీద గౌరవం లేదని చెబుతావా? అంటుంది మైరావతి. నా కోడలు పెద్దలంటే గౌరవం అని అన్నావు కదా జ్ఞానాంబ అని ప్రశ్నిస్తుంది.
ఇదేనా.. పెద్దల మాటకు ఇచ్చే గౌరవం. పెద్దలకు ఆవిడ ఇచ్చేది ఇదేనా. ఇదిగో.. ఏదో ఒక అంశంలో నువ్వు మా రాముడికి సరిపోతావులే అనుకున్నా. కానీ.. వాడి భార్యకు ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా లేదు నీకు.. ఛీ అంటుంది. ఇన్నేళ్లలో ఈ ఇంట్లో పూజ జరుగుతుంటే ఎప్పుడూ ఇలా జరగలేదు. నీ కారణంగా మొదటిసారి పూజ ఆగిపోయింది అంటుంది మైరావతి.
బుద్ధుందా నీకు.. అత్తయ్య గారి సంప్రదాయం గురించి తెలుసు కదా.. అయినా కూడా అలా చేస్తావా అంటూ జ్ఞానాంబ సీరియస్ అవుతుంది. ఇంతలో తన కాళ్లకు దెబ్బ తగిలి రక్తం వస్తుండటం గోవిందరాజు చూస్తాడు. ఆయ్యో ఆ కాలికి ఏంటి అంటూ గోవిందరాజు అంటాడు. నీ ఆలస్యానికి కారణం అదా అంటాడు.
మైరావతి కోపంతో తన రూమ్ కు వెళ్తుంది. దీంతో తన దగ్గరికి అందరూ వస్తారు. జ్ఞానం నువ్వే అమ్మతో మాట్లాడి ఎలాగోలా పూజకు తీసుకురా అంటాడు గోవిందరాజు. జ్ఞానాంబ వెళ్లి రండి అత్తయ్య గారు పూజ పూర్తి చేయడానికి అంటుంది. పూజ ఆపేశాను అంటుంది మైరావతి.
పూజను అలా మధ్యలో ఆపేస్తే అరిష్టం అత్తయ్య గారు దయచేసి రండి.. అంటుంది జ్ఞానాంబ. ఇన్నేళ్లలో నా మాటకు ఎవరూ ఎదురు చెప్పలేదు. కానీ.. నీ కోడలు నా మాటను తుంగలో తొక్కేసింది. నాకు అంతకన్నా అరిష్టం ఇంకేముంటుంది అంటుంది.
అయినా కూడా వినకుండా.. జ్ఞానాంబ పూజ చేస్తా అని చెబుతుంది. దీంతో మైరావతి మాట కాదని అందరూ పూజ చేయడానికి వెళ్తారు. కానీ.. మైరావతికి బాధేస్తుంది. రామా నువ్వైనా చెప్పరా.. నా మాట కాదని పూజ చేయకండి అన్నా కూడా జ్ఞానాంబ వినదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.