
janaki kalaganaledu 19 january 2022 full episode
Janaki Kalaganaledu 19 Jan Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 19 జనవరి 2022, బుధవారం ఎపిసోడ్ 218 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కన్నబాబు తనకు జరిగిన అవమానం తట్టుకోలేక మందు తాగుతూ ఉంటాడు. సునంద వచ్చి ఆపరా అంటుంది. కానీ.. కన్నబాబు అస్సలు వినడు. ఫుల్లుగా మందు తాగుతుంటాడు. నేను ఇక బతకను.. అంటూ ఫుల్లుగా మందు తాగుతాడు. ఇంతలో రామా స్పీడ్ గా బైక్ వేసుకొని వస్తుంటాడు. సునంద మాత్రం.. ఇలా ఆవేశపడితే పని జరగదు. మోసంతో వాళ్ల పని పట్టాలి అంటుంది సునంద. ఇంతలో రామా వాళ్ల దగ్గరికి వచ్చి కన్నబాబును పట్టుకొని చితక్కొడతాడు. నా చెల్లెలును తోటకు రమ్మని బెదరిస్తాడా.. ఎంత ధైర్యం వీడికి.. నా కుటుంబం జోలికి వస్తే చంపేస్తాను అంటూ కన్నబాబును తీవ్రంగా కొడతాడు.
janaki kalaganaledu 19 january 2022 full episode
దీంతో కన్నబాబు.. రామా కాళ్లు పట్టుకుంటాడు. రామచంద్రా నీ కాళ్లు పట్టుకుంటాను.. ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదు.. అంటాడు కన్నబాబు. కాళ్లు పట్టుకున్నా రామా వినడు.. చితక్కొట్టుడు కొడతాడు. దీంతో సునంద కూడా రామా కాళ్లు పట్టుకుంటుంది. దీంతో మీరు మా అమ్మ లాంటి వాళ్లు. నా కాళ్లు పట్టుకోవడం తప్పు అంటాడు రామా. అమ్మంటే బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్ది మంచి మార్గంలో నడిపించాలి. అంతే కానీ.. నీ కొడుకు పనికిమాలిన చెత్తపనులు చేస్తుంటే సమర్థించడం కాదు.. అని సునందకు సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. ఒరేయ్.. మీ అమ్మ కాళ్లు పట్టుకోవడంతో నిన్ను వదిలేశాను. అలా అని నువ్వు ఏం చేస్తే అది నడుస్తుందనుకుంటే పొరపాటే.. అంటాడు రామా.
కట్ చేస్తే ఇంట్లో వాళ్లంతా దీనంగా కూర్చొని బాధపడుతూ ఉంటారు. మల్లిక మాత్రం చాలా ఖుషీగా ఉంటుంది. అందరినీ భోం చేద్దురు కానీ పదండి అంటుంది మల్లిక. కానీ.. ఎవ్వరూ రారు. దేవత లాంటి వదిన పాపం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అన్నం ఎలా తినగలం వదిన అంటాడు అఖిల్.
దీంతో అఖిల్ కు ఏదో కొటేషన్ చెబుతుంది మల్లిక. జానకిని ఇంట్లో నుంచి పంపించేయాలని ఎన్నో ప్లాన్స్ వేశాను కానీ.. నీ ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది అని మనసులో అనుకుంటుంది మల్లిక. వెన్నెల దగ్గరికి వెళ్లి తనను బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది మల్లిక.
జానకి వెళ్లిపోయింది కాబట్టి.. ఈ ఇంటి బరువు బాధ్యతలన్నీ ఈ కోడలు మీద పడిపోతాయి అంటూ మల్లిక చెబుతుండగా జ్ఞానాంబ వస్తుంది. జ్ఞానాంబను చూసుకోకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది మల్లిక. ఆ తర్వాత జ్ఞానాంబను చూసి.. వామ్మో అంటూ అనుకుంటుంది.
అంటే అత్తయ్య గారు మరీ అది అంటూ ఏదో చెప్పబోతుంది. వీళ్లెవరూ భోజనం చేయడం లేదు. తినమని అడుగుతున్నాను అంటుంది. నువ్వు మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అంటుంది జ్ఞానాంబ. కాదు అత్తయ్య గారు కాదు అంటుంది మల్లిక.
జానకి వెళ్లిపోయినప్పటి నుంచి నేను పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు అంటుంది మల్లిక. అందుకేనా ఇప్పటి వరకు మూడు సార్లు తిన్నావు అంటాడు గోవిందరాజు. ఎప్పుడు చూసినా తోటికోడలు మీద ఏడ్చే నువ్వు..జానకి ఇంట్లో నుంచి వెళ్లిపోతే ఎంత సంతోషపడతావో మాకు తెలియదా ఏంటి అంటాడు గోవిందరాజు.
జానకి తప్పు చేసిందో లేదో ఇంకా నిర్ధారణ కాలేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకోలేదు కాబట్టి.. జానకి తప్పు చేసిందని కాదు.. మా అత్తయ్య గారి మాటను కాదనలేక తనను ఇంట్లో నుంచి పంపించేశాను అంటుంది. ఆ విషయంలో జానకి తప్పు ఏం లేదని తెలిస్తే నా కోడలును నేనే స్వయంగా ఇంట్లోకి తీసుకొస్తాను అంటుంది జ్ఞానాంబ.
అందుకే ఇప్పుడు నేను కన్నబాబు ఇంటికి వెళ్లొచ్చాను కానీ.. ఇంట్లో ఎవరూ లేరు అంటుంది జ్ఞానాంబ. మరోవైపు రామా జానకితో మాట్లాడిన చెట్టు దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. అక్కడ కూర్చొని జానకి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. తనను చేజేతులారా దూరం చేసుకున్నా అని అనుకుంటాడు రామా.
ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. ఇళ్లంతా మూగబోయినట్టు ఉంది అని అనుకుంటుంది మల్లిక. సరే.. టీవీ చూద్దాం అని అనుకుంటుంది మల్లిక. టీవీ పెడుతుంది. ఇంతలో ఆత్రేయపురం శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అని టీవీలో న్యూస్ చెబుతుంటారు.
ఆత్రేయపురం నుంచి పసలపూడి వెళ్తున్న బస్సు ఆత్రేయపురం శివార్లలో ఒక లోయలో పడిపోయింది అని చెబుతారు న్యూస్ లో. దీంతో రామా షాక్ అవుతాడు. అందరూ అక్కడికి వస్తాడు. బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది ప్రయాణికులలో 10 మంది చనిపోయారు అని చెబుతుంది.
చనిపోయిన వాళ్లలో జానకి పేరును కూడా ప్రస్తావించడంతో రామా షాక్ అవుతాడు. ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. చనిపోయింది మన జానకి గారే అని చెబుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
TRS : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పాత జెండా పేరు చుట్టూ వేడి చర్చలు మొదలయ్యాయి. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను…
Ajay Ghosh : టాలీవుడ్‌లో మరోసారి రెమ్యూనరేషన్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ ఇటీవల…
Cold Water : వేసవి కాలం మొదలయ్యిందంటే చాలు, చల్లటి నీటి కోసం ప్రతి ఇంటిలో ఫ్రిజ్ తలుపులు ఎక్కువసార్లు…
Paapam Prathap Movie Review in Telugu : టాలీవుడ్‌లో కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన…
Bad Boy Karthik Movie Review in Telugu : టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య Naga Shaurya తన…
Green Tea vs Black Coffee : నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై అవగాహన గణనీయంగా పెరిగింది. బరువు…
Modi : దేశ రాజకీయాల్లో ఇప్పుడు నారీ శక్తి వందన చట్టం సవరణ వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ గా…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు విశ్లేషిస్తే వైసీపీ అధినేత జగన్…
Dacoit Movie : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తన కెరీర్ లో ఎప్పుడు వైవిధ్యమైన కథలను…
Raghuraama Vs Ramalayam : పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ప్రస్తుతం ఒక ఆలయ నిర్మాణం చుట్టూ జరుగుతున్న పరిణామాలు…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతోంది. అదే నారా లోకేష్ మార్క్…
Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సామాజిక, ఆర్థిక, సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను…
This website uses cookies.