Janaki Kalaganaledu 19 July Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 19 జులై 2022, మంగళవారం ఎపిసోడ్ 347 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబ ముందే.. రామా కాలిని తన కాలితో రాకుతూ ఉంటుంది. వామ్మో.. ఇదేంది అని మల్లిక చూసి అనుకుంటుంది. మరోవైపు సాయంత్రం పెందలాడే ఇంటికి వస్తాను. రెడీగా ఉండండి అని అంటాడు రామా. దీంతో మల్లెపూలు తీసుకొస్తారా అని అంటుంది జానకి. దీంతో ఐపీఎస్ చదువు కోసం వెళ్లడానికి నేను రెడీగా ఉండండి అంటాడు. మీరు ఇప్పుడు కేవలం ఐపీఎస్ చదువు మీదనే ధ్యాస పెట్టండి అంటాడు. అది కాదు రామా గారు అంటూ జానకి రామా వైపు వస్తుండగా.. అతడిని వెళ్లనీయదు. రామా గారు.. ప్రతి రోజు మీరు బయటికి వెళ్లేటప్పుడు మీకు ఎదురు రావాలని అత్తయ్య గారు చెప్పారు అంటుంది జానకి. వీళ్లను మల్లిక గమనిస్తూ ఉంటుంది. అరటి పండు తింటూ అరటి తొక్కను జానకి వచ్చే ప్లేస్ లో విసిరేస్తుంది.
జానకి రామాకు ఎదురుగా వస్తూ అరటి తొక్క మీద కాలు వేస్తుంది. దీంతో అక్కడే కూలబడుతుంది. అమ్మో.. అంటుంది. వెంటనే అందరూ పరిగెత్తుకొస్తారు. అయ్యో అంటారు. జానకి గారు ఏమైంది అని అడుగుతాడు రామా. జానకి ఏమైంది అని అంటాడు గోవిందరాజు. జ్ఞానాంబ కూడా వస్తుంది. కాలు బెనికింది అంటుంది. లేవలేకపోతుంది. జానకి దెబ్బ ఏమైనా తగిలిందా అని అంటుంది జ్ఞానాంబ. అసలు ఎలా పడ్డావు అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో ఇక్కడ అరటి తొక్క ఉంది అత్తయ్య గారు.. చూసుకోలేదు అంటుంది జానకి. అయినా ఇక్కడ అరటితొక్క ఎవరు వేశారు ఇంట్లో అని అంటాడు గోవిందరాజు. వెంటనే డాక్టర్ కు ఫోన్ చేయండి అని అంటుంది జ్ఞానాంబ. దీంతో వద్దు అత్తయ్య గారు.. డాక్టర్ అవసరం లేదు.. అంటుంది జానకి.
అమ్మాయిని జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్లు అంటుంది జ్ఞానాంబ. తనను నడిపించుకుంటూ తీసుకెళ్లాలని అనుకుంటాడు రామా. కానీ.. తను నడవలేకపోతుంది. దీంతో తనను ఎత్తుకొని రూమ్ లోపలికి తీసుకెళ్తాడు రామా. ఎక్కడ నొప్పి అని అడుగుతాడు. దీంతో కాలు దగ్గర అని చెప్పడంతో తన కాళ్లు పడతాడు రామా.
జానకి కోసం వేడి నీళ్లు పెట్టి.. నీళ్లు తీసుకెళ్లబోతూ తన కాళ్ల మీద పోసుకుంటుంది మల్లిక. వేడి నీళ్లు పడగానే.. వామ్మో.. అంటూ అరుస్తుంది. దీంతో తన అరుపులకు గోవిందరాజు అక్కడికి వచ్చి ఏమైంది అని అడుగుతాడు. వేడి నీళ్లు పడ్డాయి అని చెబుతుంది.
ఆ దేవుడు ఉన్నాడు. జానకి కాలికి దెబ్బ తగలడానికి కారణం నువ్వే అయి ఉంటావు. అందుకే ఆ దేవుడు నీకు అలా చేశాడు అని అంటాడు గోవిందరాజు. తర్వాత జానకి రూమ్ లోకి వేడి నీళ్లు తీసుకెళ్తుంది జ్ఞానాంబ. తనకు తోడుగా ఉండమని రామాకు చెబుతుంది జ్ఞానాంబ.
దీంతో వేడి నీళ్లతో జానకికి కాపురం పెడతాడు రామా. అయితే.. అరటి తొక్క మీద కాలు వేయకుండానే జానకి పడిందా అనే డౌట్ వస్తుంది మల్లికకు. అసలు జానకి ఎలా కిందపడింది అని అనుకుంటుంది మల్లిక. ఇదంతా జానకి ప్లాన్ ఏమో అని అనుకుంటుంది మల్లిక.
నొప్పి పైకి చేరుతోంది అంటుంది జానకి. చీరను కొంచెం పైకి లేపి కాళ్లను చూపించేసరికి.. రామాకు పిచ్చి లేస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నారు. బామ్ రాయండి అంటుంది. అక్కడ చేతులతో ఎలా రాయాలి అంటాడు రామా. ఏంటి చూస్తున్నారు రాయండి అంటుంది జానకి.
దీంతో తన కాళ్ల మీద బామ్ తో రాస్తుంటాడు రామా. దీంతో తను నవ్వుతూ ఉంటుంది. నవ్వుతున్నారేంటండి అంటాడు రామా. దీంతో నేను నవ్వడం ఏంటి..నొప్పితో విలవిలలాడిపోతుంటే నవ్వుతున్నాను అంటారేంటి అంటుంది జానకి. అసలు ఇదేంటి.. మీకు నిజంగా దెబ్బ తాకిందా.. లేక కావాలని చేస్తున్నారా అని అడుగుతాడు రామా.
దీంతో మీ మీద ప్రేమతో ఏకాంతంగా ఉండాలని ఇలా చేస్తున్నా అని అంటుంది జానకి. దీంతో మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ కోప్పడతారు రామా. దీంతో వెళ్లి అతడిని గట్టిగా హత్తుకుంటుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
This website uses cookies.