Janaki Kalaganaledu 2 March Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 మార్చి 2022, బుధవారం ఎపిసోడ్ 248 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నా బలమేంటో తెలుసా అని అడుగుతుంది జానకి. దీంతో ఎవరు హనుమాన్ కదా అంటాడు రామా. దీంతో కాదు.. రామయ్య అంటుంది. దీంతో ఓహో.. ఆయనా అంటాడు రామా. ఆయన కాదు.. మా ఆయన రామయ్య. బంగారు రామయ్య అంటుంది జానకి. దీంతో రామా సంబురపడిపోతాడు. మీరు పక్కన ఉంటే చాలండి. ఏదైనా చేసేయగలను అనిపిస్తుంది అంటుంది జానకి. వెన్నెల ఎంగేజ్ మెంట్ ను పెళ్లి చూపుల దాకా రాకుండా ఆపేయాలి.. ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది మల్లిక. ఆరోజు దిలీప్.. ఫోన్ లో వెన్నెల అని చనువుగా మాట్లాడటం విన్నాను.. వాళ్లిద్దరి మధ్య అంత చనువు.. ప్రేమ ఎలా చిగురించింది. ఎలా.. ఎలా.. హౌ.. అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది మల్లిక.
అప్పుడే అక్కడికి వచ్చిన చికిత.. తన దగ్గరికి వెళ్లి.. తన చెవులు పట్టుకుంటుంది. దీంతో చికిత వదలు.. వదలవే అంటుంది మల్లిక. నా మెడ పట్టుకుంటుంది. ఎందుకే అలా పట్టుకున్నావు అంటుంది. దీంతో మీకు మెడపట్టి ఇబ్బంది పడుతున్నారేమోనని హెల్పింగ్ చేశానండి.. హెల్పింగ్ అంటుంది చికిత. దీంతో చికితను రెండు బాదుతుంది. మరోవైపు జానకి.. ఇంటి బయట గార్డెన్ దగ్గరే నిద్రపోతూ ఉంటుంది. ఎండ కొడుతున్నా కూడా అలాగే నిద్రపోతుండటం చూస్తాడు రామా. వెంటనే తన టవల్ తో ఎండ రాకుండ అడ్డు పెడతాడు. అప్పుడే మల్లిక.. బట్టలు తీయడానికి అటువైపు రావడంతో.. జానకి పుస్తకం అక్కడే ఉండటంతో వెంటనే ఆ పుస్తకాన్ని తీసి గోడ మీద పెడతాడు. ఇంతలో మల్లిక వెళ్లిపోతుంది.
మరోవైపు జానకి నిద్రలో కింద పడబోతుంది. వెంటనే తను వెళ్లి జానకి కింద పడకుండా తన భుజాన్ని అడ్డం పెడతాడు. ఇంతలో జానకి అటూ ఇటూ కింద పడబోతుంది. తనకు ఎండ తగులుతోందని.. తనను ఎత్తుకొని మంచం దగ్గరికి తీసుకొచ్చి పడుకోబెడతాడు. అప్పటికే తనకు మెళకువ వస్తుంది కానీ.. నిద్రపోయినట్టు నటిస్తుంది.
మంచంలో పడుకోబెట్టాక తను లేస్తుంది. అవును.. అక్కడ అలా పడుకున్నారేంటి అంటాడు రామా. చదువుకుందామని అక్కడికి వచ్చాను కానీ.. ఇంతలోనే నిద్ర వచ్చి పడుకున్నాను అంటుంది జానకి. ఇంతలో మల్లిక వచ్చి వంట చేస్తుంటే నా చేయి కాలిందని వచ్చి తెగ ఏడ్చేస్తుంది.
దీంతో నేను వంట చేస్తాలే.. నువ్వు మందు రాసుకో అంటుంది. కానీ.. వంట నుంచి తప్పించుకోవడం కోసం మల్లిక వేసిన కుట్ర అది అని జానకి తెలుసుకోలేకపోతుంది. మరోవైపు పెళ్లికి వెళ్లమని మల్లిక, విష్ణును అడుగుతుంది జ్ఞానాంబ.
దీంతో స్టాక్ వస్తుంది. ఇప్పుడు మేము వెళ్లలేం అంటుంది మల్లిక. దీంతో ఇంతలో జానకి వచ్చి అత్తయ్య గారు మేము వెళ్తాం అంటుంది జానకి. దీంతో అది కాదమ్మా.. నిన్న రాత్రి నీకు నిద్ర లేదు కదా అంటుంది. ఏం కాదు.. మేము వెళ్లి ఈ సారె ఇచ్చి వస్తాం అంటుంది జానకి. సారె తీసుకొని వెళ్తారు.
మరోవైపు మల్లిక.. అత్తయ్య గారు.. అత్తయ్య గారు అంటూ వస్తుంది మల్లిక. అత్తయ్య గారు పెళ్లికి జానకి వెళ్లలేదట. బావగారు ఒక్కరే వెళ్లారట అంటుంది మల్లిక. దీంతో ఏమ్మా మల్లిక ఇక నువ్వు మారవా. ఎప్పుడూ తోటికోడలు మీద చాడీలు చెప్పడమేనా.. అంటాడు గోవిందరాజు.
దీంతో సాక్ష్యం ఉంది అంటుంది మల్లిక. లీలావతి పెద్దమ్మను పిలుస్తుంది మల్లిక. చెప్పు అంటుంది మల్లిక. అవును జ్ఞానాంబ.. పెళ్లికి నీ పెద్ద కొడుకు రామచంద్ర ఒక్కడే వచ్చాడు. జానకి రాలేదు. చీర, సారె కూడా రామా ఒక్కడే పెట్టాడు. ఏంటో ఈ విడ్డూరం అంటుంది లీలావతి.
దీంతో నువ్వు చెప్పేది నిజమా అంటుంది జ్ఞానాంబ. దీంతో నిజమే అంటుంది లీలావతి. ఇంతలో రామా, జానకి వస్తారు. మీరిద్దరూ ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడుగుతుంది జ్ఞానాంబ. జానకి.. పెళ్లికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్లి వస్తున్నారు అని అడుగుతుంది జ్ఞానాంబ.
మాట్లాడవేంటి ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది. నువ్వు రామాతో కలిసి పెళ్లికి వెళ్లలేదా.. మరి ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది జ్ఞానాంబ. మాట్లాడవేంటి.. సాంప్రదాయం ప్రకారం పెళ్లికూతురుకు సారె పెట్టాలి. నీ అంతట నువ్వే పెళ్లికి వెళ్లి సారె పెడతా అన్నావు అంటుంది జ్ఞానాంబ.
అంటే అత్తయ్య గారు అది.. అంటూ ఏదో చెప్పబోతుంది జానకి. దీంతో నీళ్లు నమలకు అంటుంది జ్ఞానాంబ. ఇంతలో రామా.. నేను ఒక్కడినే పెళ్లికి వెళ్లానమ్మా. జానకి గారు రాలేదు అంటాడు రామా. మాట్లాడవేంటి జానకి. నువ్వు రామాతో పాటు పెళ్లికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్లావు. సమాధానం చెప్పు అని సీరియస్ అవుతుంది జ్ఞానాంబ.
దీంతో ఒక ముఖ్యమైన పని మీద జానకి గారు బయటికి వెళ్లారమ్మా అంటాడు రామా. దీంతో ముఖ్యమైన పనా ఏంటది అంటుంది జ్ఞానాంబ. దీంతో పెళ్లికూతురుకు మెట్టలు తీసుకురావడానికి మేనమామ ఎవ్వరూ లేకపోతే.. ఆ స్థానంలో జానకి గారు తనకు మెట్టలు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అందుకే మెట్టలు తీసుకురావడానికి జానకి గారు బయటికి వెళ్లారు అంటాడు రామా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.