Janaki Kalaganaledu 2 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. లేటెస్ట్ ఎపిసోడ్ 2 నవంబర్ 2021, 162 ఎపిసోడ్ మంగళవారం హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అత్తయ్య గారిని వెళ్లి అడిగి.. పూతరేకులు చేయమని చెబుదాం అని రామాతో అంటుంది జానకి. కానీ.. నిన్న రాత్రి కాళ్లు పట్టడానికి అమ్మ దగ్గరికి వెళ్లినప్పుడు అమ్మ ఏమందో తెలుసా? వీడి కారణంగా ఇప్పటికే చాలా బాధపడుతున్నాను. పదే పదే మాట్లాడటానికి ప్రయత్నించి.. ఇంకా ఇంకా బాధపెట్టి చంపొద్దు అని చెప్పండి అని నాన్నతో చెప్పింది. ఇప్పుడు నేను వెళ్తే అమ్మ కోపంతో పాటు బాధ కూడా ఎక్కువవుతుంది.. అంటాడు రామా. ఒప్పుకున్నాక ఆర్డర్ డెలివరీ చేయకపోతే మాట పోతుంది కదండి అని జానకి అంటుంది. ప్రాణమే పోతోంది.. ఈ ఆర్డర్ ఎంతండి.. అంటాడు రామా. రజినీ.. ఆ కస్టమర్ కు ఫోన్ చేసి చెప్పు అని నెంబర్ ఇస్తాడు రామా.
కట్ చేస్తే తెల్లారుతుంది. పూతరేకులు ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి వచ్చి.. ఆర్డర్ అయిందా? అని అడుగుతాడు. రజినీ ఫోన్ చేసి చెప్పాడు కదా.. ఆర్డర్ ఇవ్వలేమని అని అంటాడు. నాకు ఎవ్వరూ ఫోన్ చేయలేదు అంటాడు. రజినీని తిడతాడు. క్షమించండి అంటాడు రామా కస్టమర్ తో. చిన్న పొరపాటు జరిగింది అంటాడు. ఇది చిన్న పొరపాటా.. మర్యాదగా సరుకు ఇవ్వు.. లేకపోతే ఊరుకునేది లేదు.. అంటాడు ఆ కస్టమర్. ఇంతలో జానకి వస్తుంది. నీ బోడి క్షమాపణలు ఎవరికి కావాలి.. నువ్వు సరుకు ఇవ్వు ముందు. నాటకాలు ఆడుతున్నావా? ఇప్పుడే నీ సంగతి ఊరంతా చెబుతా అని బయటికి వెళ్తాడు ఆ కస్టమర్.
బాబు.. పేరుకే వీళ్లది పెద్ద షాపు. వీళ్ల షాపుకు ఎవరూ రాకండి. అంటాడు. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? తాడో పేడో తేల్చుకుంటాను.. అంటూ రామా కాలర్ పట్టుకుంటాడు ఆ కస్టమర్. దీంతో రామా ఏం చేయలేకపోతాడు. జానకి ముందు కాలర్ వదులు అంటే అన్నా కూడా వినడు. ఇంతలో జ్ఞానాంబ వచ్చి కాలర్ పట్టుకున్న అతడి చేయిని తీసేసి తోచేస్తుంది. ఏయ్.. ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు కాలర్ పట్టుకుంటావు నువ్వు. ఇదిగో నీ పూతరేకులు.. తీసుకెళ్లు. చొక్కా పట్టుకున్నందుకు రామాకు క్షమాపణలు చెప్పు అని కస్టమర్ ను బెదిరిస్తుంది జ్ఞానాంబ. దీంతో ఏదో తొందర పడ్డాను. క్షమించండి అమ్మ అంటాడు. నాకు కాదు.. అక్కడ చెప్పు అనగానే రామచంద్ర క్షమించు.. అంటాడు. దీంతో అక్కడి నుంచి జ్ఞానాంబ వెళ్లి.. స్వీట్ షాపు దగ్గరికి వచ్చి జ్ఞానాంబ స్వీట్లకు ఉన్న 20 ఏళ్ల నమ్మకాన్ని పోగొట్టొద్దని చెప్పు రజినీ అని చెప్పి జ్ఞానాంబ వెళ్లబోతుంది.
దీంతో వెంటనే తన కాళ్ల మీద పడతాడు రామా. అన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి అమ్మా.. అంటాడు. అమ్మ నువ్వు నాతో మాట్లాడొద్దు అన్న మాట తప్ప నాకు ఏదీ వినబడటం లేదు. నా కళ్ల ముందు ఏదీ కనబడటం లేదు. నీ మాట గుర్తొచ్చినప్పుడల్లా నా ప్రాణం పోతోంది అమ్మా అంటాడు. అయినా నా ప్రాణమే మా అమ్మ అయినప్పుడు నా ప్రాణం నాతో మాట్లాడొద్దు అంటే నేను తట్టుకొని బతకగలనా? నేను ప్రాణం ఉన్న బొమ్మను మాత్రమే.. అంటాడు రామా. అయినా కూడా జ్ఞానాంబ పట్టించుకోదు. అస్సలు రామా ముఖం కూడా చూడదు.
నువ్వు సమయానికి వచ్చావు కాబట్టే.. కొట్టు పరువు నిలబడింది. అలాగే నీ కొడుకు ప్రాణం కూడా నిలబెట్టు అమ్మా.. లేకపోతే నేను కూడా నిజంగా నీకు దూరం అవుతాను అంటాడు రామా. నువ్వు నాకు ఏదో ఒక శిక్ష వేయి.. ఆనందంగా భరిస్తాను కానీ.. మాట్లాడుకుండా మాత్రం ఉండకు అమ్మ. ప్రాణం పోతోంది అనిపిస్తోంది అమ్మా.. అంటాడు.
ఆతర్వాత జానకి కూడా జ్ఞానాంబ కాళ్ల మీద పడుతుంది. అత్తయ్య గారు.. నన్ను మా ఆయన నుంచి దూరం చేయండి కానీ.. ఆయనకు అమ్మను మాత్రం దూరం చేయకండి. అమ్మతో మాట్లాడకుండా మీ అబ్బాయిగారు బతకలేరు. ఆ శిక్షేదో నాకు వేయండి కానీ.. ఆయన ప్రాణాలు కాపాడండి అత్తయ్య గారు అంటుంది జానకి. రజినీ కూడా అదే చెబుతాడు.
నీ భార్యను తీసుకొని మన తోటకు రా.. అని రామాకు చెప్పి జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు మల్లిక తెగ ఏడుస్తుంటుంది. చికిత వచ్చి హేళన చేస్తుంటుంది. ఏమైంది అని అడుగుతుంది. ఇప్పుడే ఫ్లాష్ న్యూస్ అందింది. కొడుకు, కోడలు, అత్త.. అందరూ పూతరేకుల్లో పంచదారలా బాగా కలిసిపోయారంట.. అని చెప్పి తెగ ఏడ్చేస్తుంది మల్లిక. నిన్నటి వరకు అంత కోపంగా ఉన్న పెద్దమ్మ గారు ఇంతలోనే ఎలా వాళ్లను క్షమించారు అని అంటుంది చికిత.
తోటకు పిలిచిన జ్ఞానాంబ జానకికి 15 రోజుల గడువు ఇస్తుంది. ఈ సమయంలో మంచి భార్యగా.. మంచి కోడలుగా ఉండాలి. అనిపించుకోవాలి అని చెబుతుంది జ్ఞానాంబ. ఈ విషయాలన్నీ చాటున ఉండి మల్లిక వింటుంది. ఈ 15 రోజులు నువ్వు అబద్ధం చెప్పినా.. మోసం చేసినట్టు తెలిసినా.. చదువుకున్నాననే అహం నీలో కనిపించినా ఆ అహంతో నా కొడుకును అవమానించినట్టు కనిపించినా నా కొడుకుతో నువ్వు గొడవ పడినా.. నీ కారణంగా ఈ ఇంటి పరువు పోయినా.. స్వయంగా నా కొడుకే నిన్ను ఈ ఇంట్లో నుంచి వాడి జీవితంలో నుంచి పంపించేస్తాడు.. అని చెబుతుంది జ్ఞానాంబ. మరి.. జ్ఞానాంబ షరతులకు జానకి ఒప్పుకుంటుందా? లేదా? అనే విషయాలు తరువాయిభాగంలో చూడాల్సిందే.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.