Janaki Kalaganaledu 2 Sep Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ 2 సెప్టెంబర్ 2021, గురువారం తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 119 హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం. తన భర్తను ఒప్పించి మరీ.. జ్ఞానాంబకు కాళ్లు ఒత్తుతుంది జానకి. ఇంతలోనే జ్ఞానాంబ భర్త వచ్చి.. ఆ దేవుడు నీకు ఇంత మంచి కోడలును మన ఇంటికి పంపించాడు అంటాడు.
ఇంతలో అత్తయ్య గారు.. అత్తయ్య గారు.. అరుస్తూ వస్తుంది మల్లిక. ఏంది నీ గోల అంటుంది జ్ఞానాంబ. గోల కాదు అత్తయ్య గారు ఘోరం అంటుంది. ఏంటది అంటుంది. జానకి గదిలో ఒక వింతను చూసి నా మతి పోయింది అత్తయ్య గారు అంటుంది. ఏయ్.. ఏం మాట్లాడుతున్నావు నువ్వు.. వింతేంటి.. విచిత్రం ఏంటి.. అంటుంది. చెప్పడం కాదు అత్తయ్య గారు.. చెప్పడం కన్నా.. చూస్తేనే మీకు అర్థం అవుతుంది.. అని అంటుంది మల్లిక.
రండి అత్తయ్య గారు.. మీరు వస్తే నేను చూపిస్తాను మామయ్య గారు మీరు కూడా రండి. పెద్ద కోడలు గారు కిరీటం లేని దేవత అని పొడుగుతుంటారు కదా.. ఆ దేవత దాచిన రహస్యాన్ని మీరు కూడా చూద్దురు కానీ రండి.. అంటుంది మల్లిక.
మల్లిక అసలు ఏ విషయం గురించి చెబుతోందో అర్థం కావడం లేదని జానకి మనసులో అనుకుంటుంది. అమ్మో.. నా టేబుల్, పుస్తకాలు మల్లిక చూసిందా? అవి అత్తయ్య గారు చూసిందంటే వామ్మో.. నా కారణంగా ఆయన్ను కూడా దోషిగా చూడాల్సి వస్తుంది.. అని అనుకుంటుంది జానకి.
ఇంతలో మల్లిక.. జ్ఞానాంబ, తన మామయ్యను జానకి గదిలోకి తీసుకెళ్తుంది. రండి.. రండి.. అంటూ తీసుకెళ్తుంది. వాళ్ల వెంటనే జానకి కూడా వస్తుంది. మామయ్య గారు రండి. చూడండి.. అంటూ అటువైపు చూపిస్తుంది. చూడండి.. అనగానే అక్కడ ఏం కనిపించదు. రామా పడుకొని ఉంటాడు. మీ కళ్లారా చూడండి. ఇవి ఇక్కడ ఎందుకు ఉన్నాయో.. ఎవరి కోసం ఉన్నాయో నిలదీసి కడిగేయండి అత్తయ్య గారు.. అంటుంది మల్లిక.
అయ్యో.. అత్తయ్య గారు.. నన్నూ అందాన్ని రోజు చూస్తున్నారు కదా.. ముందు అక్కడ చూడండి అంటుంది. అక్కడ ఏముందని చూడాలి అంటుంది జ్ఞానాంబ. కళ్ల ముందు కనిపిస్తుంటే… అంటూ అటు చూసి షాక్ అవుతుంది మల్లిక. అక్కడ ఏం కనిపించకపోయే సరికి షాక్ అవుతుంది.
ఓయ్.. నిన్నే.. అంటుంది జ్ఞానాంబ. ఏమైపోయాయి.. ఇంతలోనే ఎక్కడికి మాయం అయిపోయాయి.. కనిపించడం లేదే.. అంటూ అటూ ఇటూ వెతుకుతుంది మల్లిక. ఇంతలోనే రామా లేచి.. నాన్నా.. అమ్మ ఏమైంది.. అని అడుగుతాడు రామా.
నీ గదిలో ఏదో వింత, విచిత్రం జరుగుతోందట.. అంటూ తన తండ్రి అంటాడు. బావ గారు.. మీరు ఇప్పుడే నిద్ర లేచారా? లేక ఇంతకుముందే నిద్రలేచారా? అంటూ పిచ్చి పిచ్చిగా ప్రశ్నలు వేస్తుంది మల్లిక. అసలు.. నువ్వు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు.. ఏవో రహస్యాలు చూపిస్తా అన్నావు.. ఏమైంది అని అడుగుతుంది జ్ఞానాంబ. అడుగుతుంటే బిత్తర చూపులు చూస్తావేంటి.. అని అడుగుతుంది జ్ఞానాంబ.
అంటే అత్తయ్య గారు.. టేబుల్, పుస్తకాలు, లైట్.. ఇవన్నీ ఉండాలి.. ఏమయ్యాయి.. అని అనుకుంటుంది మల్లిక. దీంతో టాపిక్ డైవర్ట్ చేయడానికి.. కర్టెన్లు అత్తయ్య గారు.. కర్టెన్లు.. వచ్చే వారం మనం వ్రతం చేసుకుందామని అనుకున్నాం కదా. కానీ.. జానకి వాటిని ఉతకకుండా అలాగే ఉంచింది…. అవే చూపిద్దామని నేను మిమ్మల్ని తీసుకొచ్చా.. అని చెబుతుంది మల్లిక.
ఏయ్.. అసలు ఇది ఒక విషయమేనా? దీని కోసం.. మమ్మల్ని ఉన్నపళంగా పిలుచుకొచ్చావా? బుద్ధి ఉందా నీకు అస్సలు. దీని కోసం ఇంత హడావుడి చేశావా? అంటూ ప్రశ్నిస్తుంది జ్ఞానాంబ.
వెంటనే జ్ఞానాంబ, తన భర్త వెళ్లిపోతారు.. ఆ తర్వాత మల్లిక తమ్ముడు ఎదురు చూస్తుంటాడు… నువ్వు వెళ్లు అని అంటాడు రామా. మల్లిక వెళ్లగానే.. డోర్ పెట్టేసి.. వచ్చి ఏమండీ పుస్తకాలు ఏవి.. అని అడుగుతుంది జానకి. పుస్తకాలా.. ఇదిగో అంటూ తన దుప్పటి కింద ఉన్న పుస్తకాలను చూపిస్తాడు. థ్యాంక్యూ అండి.. అంటూ రామాను గట్టిగా హత్తుకుంటుంది జానకి. దీంతో రామాకు ఏం చేయాలో అర్థం కాదు. మతిపోతుంది.
జానకి గారు.. అది.. అంటూ మెలికలు తిరిగిపోతాడు. ఏంటండి.. అంటుంది జానకి. ఏంటండి.. అంటుంది జానకి. మరి.. మరి.. అంటూ తెగ సిగ్గుపడిపోతుంటాడు. అంటే.. మొన్న ఇచ్చారు కదా.. అంటాడు. మిమ్మల్ని.. అంటూ వెంటనే చెంప మీద ముద్దు పెడుతుంది.
కట్ చేస్తే తెల్లవారుతుంటుంది. జ్ఞానాంబ ఉదయమే లేచి ఇంటి బయట ముగ్గు వేస్తుంటుంది. అప్పుడే జానకి వచ్చి అత్తయ్య గారు.. మీరు ఎందుకు ముగ్గు వేస్తున్నారు. నేను సరైన సమయానికే వచ్చాను కదా.. అనగానే.. ఈరోజు శ్రావణ శుక్రవారం కదా.. అందుకే నేను ముగ్గు వేస్తున్నాను.. అంటుంది జ్ఞానాంబ.
జానకి.. ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని మన తోటలో జరుపుకుంటాం. గత సంవత్సరం వరలక్ష్మీ వ్రతం జరుపుకోవడం కుదరలేదు. ఈ సంవత్సరం అందుకే.. అందరం కలిసి తోటలోకి వెళ్లి వ్రతం జరుపుకుందాం. నువ్వు వెళ్లి అందరినీ తొందరగా రెడీ అవ్వమని చెప్పు.. అంటుంది జ్ఞానాంబ. సరే.. అత్తయ్య గారు.. అని చెప్పి వెళ్తుంది జానకి.
ఇంతలో.. మల్లిక తన జుట్టును దువ్వుకుంటుంటుంది. హాయిగా నిద్రపోతుంటే.. తోటకు వెళ్లాలి.. అంటూ నిద్ర డిస్టర్బ్ చేస్తున్నారు. ఇంతలో వెన్నెల వచ్చి వదినా త్వరగా రెడీ అవ్వు. వ్రతానికి లేట్ అయితే.. మా అమ్మ తిడుతుంది అని చెబుతుంది వెన్నెల. ఇంతలోనే జానకి వచ్చి వెన్నెల, మల్లిక రెడీ అయ్యారా? త్వరగా రెడీ అవ్వండి.. అని చెబుతుంది జానకి. మల్లిక ఒక వైపు టైమ్ అవుతుంటే.. నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు ఏంటి.. అనగానే.. దీన్ని రెడీ అవ్వడమనే అంటారు.. అంటుంది మల్లిక.
వెంటనే దువ్వెన తీసుకొని జానకి.. మల్లిక తల దవ్వుతుంది. నీకో విషయం చెప్పనా? నీ జుట్టు లాగే.. నీ మనసు కూడా గందరగోళంగా ఉంది. ప్రశాంతంగా ఉండు. చిరాకులు, కోపాలు లేకుండా హాయిగా ఉండు.. అని మల్లికకు చెబుతుంది జానకి. భలే చెప్పావు జానకి. నువ్వు చెప్పావు కదా.. వింటాను అంటుంది. ఓవైపు నీ పెత్తనాన్ని తట్టుకోలేకపోతుంటే.. మరోవైపు నీతి వాక్యాలు చెబుతావా? అంటూ తనలో తానే అనుకుంటుంది మల్లిక.
కట్ చేస్తే.. ట్రాక్టర్ మీద అందరూ వరలక్ష్మీ వ్రతానికి తోటకు వెళ్లేందుకు సిద్ధం అవుతారు. రామా, జానకి, మల్లిక, విష్ణు.. అందరూ రండి.. అంటూ జ్ఞానాంబ పిలుస్తుంది. అదిగదిగో రెడీ.. రెడీ.. అంటూ జ్ఞానాంబ భర్త వచ్చి ట్రాక్టర్ ఎక్కుతాడు. పోలా.. అదిరిపోలా గెటప్ అని అనుకుంటాడు. ఇందాకటి నుంచి అద్దాన్ని అస్సలు వదలడం లేదు. మీరేమన్న కొత్త పెళ్లి కొడుకా? అంటూ అంటుంది జ్ఞానాంబ. అవును.. నేను కొత్త పెళ్లి కొడుకులా లేనా? అని అడుగుతాడు గోవింద రాజు. ఏమండోయ్.. ఇక ఆపండి.. అంటుంది. ఇంతలోనే అందరూ వచ్చేస్తారు. నాన్న ట్రాక్టర్ అదిరింది అంటారు అందరూ.
ఒరేయ్ విష్ణు.. మీ ఆవిడ మల్లిక ఎక్కడరా.. అని అడుగుతుంది. ఆ వస్తుంది అమ్మ. అని అంటాడు. అందరికన్నా వెనుక వస్తుంది అంటే.. నీ భార్య.. కడుపులో ఏదో పెట్టుకొని వస్తుంది చూడు. మన కుటుంబం అంతా కలిసిమెలిసి ఉంటే… చూడలేక.. ఏదో ఒక వంక పెట్టడం తనకు అలవాటే కదా. ఇదివరకు కాళ్ల నొప్పి, తలనొప్పి అంటూ ఏదేదో చెప్పింది.
ఇప్పుడు కడుపునొప్పి అని చెబుతుంది చూడు.. అని వెటకారంగా అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత అందరూ కలిసి.. వ్రతం చేయడం కోసం.. తోటకు బయలుదేరుతారు. అక్కడ వ్రతంలో పాల్గొంటారు.
జానకి.. జ్ఞానాంబకు పసుపు రుద్దుతుంది. అందరూ సంతోషంగా వ్రతంలో పాల్గొంటారు. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. కానీ.. మల్లిక మాత్రం అస్సలు హ్యాపీగా ఉండదు. అందరూ సంతోషంగా ఉండటం చూసి అస్సలు తట్టుకోదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే.. తరువాయి భాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.