Home » Entertainment » Janaki Kalaganaledu 20 December 2021 Episode Highlights
Entertainment

Janaki Kalaganaledu 20 Dec Tomorrow Episode : కేకుల పోటీలో గెలిచినా.. జానకికి మరో షాక్.. తన ఐపీఎస్ కలను ఇక వదిలేసుకోవాల్సిందేనా?

Authored By
Varun G
The Telugu News | Updated on: December 19, 2021 1:07 pm
Advertisement

Janaki Kalaganaledu 20 Dec Tomorrow Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఇవాళ ప్రసారం కాదు. జానకి కలగనలేదు సీరియల్ సోమవారం ఎపిసోడ్ 20 డిసెంబర్ 2021, సోమవారం 195 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకికి కేకుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. సునంద తననే విన్నర్ గా ప్రకటిస్తుంది. దీంతో సునంద కొడుకుకు కోపం వస్తుంది. మల్లికకు కూడా ఏం అర్థం కాదు. అసలు కేకులే తయారు చేయడం చేతగాని జానకికి కేకుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ ఎలా వచ్చింది.. అని అర్థం కాదు తనకు. దీంతో ఏం చేయాలో తోచదు. జానకికి ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు తనకు సన్మానం చేస్తుంది సునంద. తర్వాత అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. మల్లిక మొహం మాడ్చుకొని ఉండటం చూసి గోవిందరాజు షాక్ అవుతాడు.

Advertisement

janaki kalaganaledu 20 december 2021 episode highlights

జ్ఞానాంబ కూడా జానకికి ఫస్ట్ ప్రైజ్ రావడంతో సంతోషిస్తుంది. పోటీ దగ్గర సునంద.. ఇక మీ షాపులో కేకులు కూడా పెట్టుకోవచ్చు అని జ్ఞానాంబతో అంటుంది. ఆ విషయాన్ని గుర్తు చేసుకున్న జ్ఞానాంబ.. ఇక నుంచి ఖార్ఖానాలో కేకులు తయారు చేసే బాధ్యత జానకికి అప్పగిస్తుంది. ఇప్పటి నుంచి మన షాపులో కేకులు కూడా తయారు చేద్దామని చెబుతుంది జ్ఞానాంబ. దీంతో జానకి సరే అంటుంది. కానీ.. రేపటి నుంచి రాజమండ్రికి జానకి వెళ్లాల్సిన అవసరం లేదు అంటుంది జ్ఞానాంబ. దీంతో జానకి షాక్ అవుతుంది. నీ మీద నీ ప్రతిభ మీద నాకు నమ్మకం ఉంది. నా నమ్మకాన్ని నువ్వు నిలబెట్టావు. మన స్వీటు కొట్టు పేరును ఈరోజు నువ్వు మరో మెట్టు ఎక్కేలా చేశావు. నాకు సంతోషంతో పాటు గర్వంగానూ ఉంది అంటుంది జ్ఞానాంబ. అందుకే ఇక నువ్వు రాజమండ్రికి వెళ్లి నేర్చుకోవాల్సిన అవసరం లేదు అంటుంది జ్ఞానాంబ.

Advertisement

నువ్వు వెళ్లింది కొద్దిరోజులే అయినా ఎలా నేర్చుకున్నావో అనుకున్నా కానీ.. పోటీలో ఫస్ట్ రావడంతో నాకు నీమీద పూర్తి నమ్మకం వచ్చింది అంటుంది జ్ఞానాంబ. అదికాదు అమ్మ.. నేర్చుకోవడం మధ్యలోనే ఆపేస్తే ఎలా అంటాడు రామా. పోటీలో పాల్గొని బహుమతి గెలుచుకున్నాక ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి. మల్లికలా బుద్ధి మందంగా ఉంటే ఎన్ని ఏళ్లు నేర్చుకున్నా అది రాదు అని మల్లికను తిడుతుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu 20 Dec Tomorrow Episode : అసలు జానకి కేకు ఎలా తయారు చేసిందని షాక్ అయిన రామా

కట్ చేస్తే.. జానకి.. బాధపడుతూ తన రూమ్ లో కూర్చుంటుంది. రామా కూడా టెన్షన్ పడుతుంటాడు. మీరిచ్చిన షాక్ నుంచి నేను ఇంకా కోలుకోకముందే అమ్మ  ఇంకో షాక్ ఇచ్చింది.. అంటాడు రామా. నేనేం షాకిచ్చాను అంటుంది జానకి. కేకులు నేర్చుకోవడానికి మీరు ఒక్క రోజు కూడా వెళ్లలేదు. ఎలా పోటీలో ఫస్ట్ వచ్చారు అంటాడు రామా.

Advertisement

దీంతో అత్తయ్య గారు ఎప్పుడైనా కేకు ఎలా తయారు చేయాలో అడిగితే సమస్య అవుతుందని నేనే ఇంటర్నెట్ లో చూసి నేర్చుకున్నా అంటాడు. అది కరెక్ట్ కానీ.. మీరు ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ గెలవడం వల్ల రాజమండ్రికి వద్దని అమ్మ చెప్పింది కదా అంటాడు రామా.

ఒకవేళ నేను కేకు సరిగ్గా చేయకపోయి ఉంటే.. నేను అసలు కేకులు నేర్చుకోవడానికి వెళ్తున్నానో లేదో అని అత్తయ్య గారు ఇంకా టెన్షన్ పడేవాళ్లు కదండి అంటుంది జానకి. అవును అండి.. నేను ఆ విషయం మరిచేపోయా.. అంటాడు రామా.

రామా గారు.. రేపు నేను ఖచ్చితంగా టెస్ట్ కు హాజరు అవ్వాల్సి ఉంటుంది. ఆ టెస్ట్ రాయకపోతే చాలా కష్టం అవుతుంది. ఇప్పటి వరకు వెళ్లడం ఒక ఎత్తు.. రేపటి టెస్ట్ కు వెళ్లడం ఇంకో ఎత్తు అంటుంది జానకి. మీరు ఆ పరీక్ష ఖచ్చితంగా రాయాలి అంతే కదా అంటాడు రామా. దీంతో అవును అంటుంది జానకి.

మిమ్మల్ని ఎలాగైనా నేను కోచింగ్ సెంటర్ కు వెళ్లేలా చేస్తాను. నేను తీసుకు వెళ్తాను అని చెప్పి తనను పడుకోబెడతాడు రామా. నిద్రపోండి ప్రశాంతంగా అని చెప్పి రామా కింద పడుకుంటాడు. కానీ.. తను కూడా ఎలా తన తల్లిని ఒప్పించాలా అని ఆలోచిస్తుంటాడు.

Advertisement

మరో వైపు జ్ఞానాంబ మల్లిక దగ్గరికి వచ్చి.. రేపటి నుంచి ఖార్ఖానాకు వెళ్లి జానకితో కలిసి కేకులు తయారు చేయడం నేర్చుకో అని చెబుతుంది. దీంతో సరే అత్తయ్య గారు అని అంటుంది. రాత్రి అవుతుంది. రామా, జానకి మధ్య రొమాన్స్ మొదలవుతుంది. ఇంటి బయట గార్డెన్ లో ఇద్దరూ ఒకరిని మరొకరు చూసుకుంటూ సిగ్గు పడుతుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి